సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటీకే కొందరు నేతలు పార్టీలు మారుతుండగా.. కొన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు మరికొందరు నేతలు వెనకడుగు వేస్తున్నారు. ఇందుకు కారణాలు ఏమైనప్పటికీ.. ఇప్పటి వరకు పోటీ చేసిన స్థానాల్లో కాకుండా కొత్త చోట్ల బరిలోకి దిగాలనే ఆలోచన చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని సమాచారం. కాగా, కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బరిలో నిలుస్తుండటంతో షబ్బీర్ అలీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రత్యర్థిగా కేసీఆర్ ఉండటంతోనే పోటీకి ఆయన విముఖత చూపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా వస్తే తన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని షబ్బీర్ అలీ ఆలోచిస్తున్నట్టు పార్టీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని చూస్తున్న మదన్ మోహన్‌రావును కామారెడ్డి నుంచి బరిలో దిగాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. కాగా.. షబ్బీర్ అలీ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరోవైపు.. మొదటి లిస్టులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిన్న(ఆదివారం) 55 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో షబ్బీర్ అలీ పేరు లేకపోవడం విశేషం.
ఇది కూడా చదవండి: నేడు బీజేపీ కీలక భేటీ.. అభ్యర్థుల్లో టెన్షన్!
Comments
Please login to add a commentAdd a comment