అనధికారికంగా ఉన్న రూ.31వేలు స్వాధీనం
దాచేపల్లి: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని రవాణాశాఖ రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గామాలపాడుకు సమీపంలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లో మంగళవారం రాత్రి 11 నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. చెక్‌పోస్ట్‌లో ఏఎంవీఐ గోపాల్‌తో పాటు మరో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ సందర్భంగా ఏసీబీ తనిఖీల్లో రూ. 31వేలు అనధికారికంగా ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ రాజారావు విలేకరులకు తెలిపారు. చెక్‌పోస్ట్‌లో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారుల ద్వారా రవాణాశాఖ కమిషనర్‌కు నివేదికను పంపి తదుపరి చర్యలు తీసుకోవాలని కోరతామని వెల్లడించారు. ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో ఆర్టీఏ చెక్‌పోస్ట్‌కు సమీపంలోనిఉన్న వాణిజ్యపన్నుల శాఖ చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు అప్రమత్తమయ్యారు. దాడుల్లో ఏసీబీ రేంజ్‌ఇన్‌స్పెక్టర్ కె.సీతారాం, ఇన్‌స్పెక్టర్ పి.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు
Published Thu, Mar 26 2015 1:56 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement