
ప్రైవేటు పాఠశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
అర్వపల్లి: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రభుత్వ నిబంధనల అమలు తదితర విషయాల పరిశీలనకై మంగళవారం మండలంలోని ప్రైవేటు పాఠశాలలను టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీ చేసింది. అర్వపల్లిలోని విజ్ఞాన్ పబ్లిక్‌స్కూల్, చైతన్యభారతి, మాంటిస్సోరి, లోయపల్లి క్రాస్‌రోడ్డులోని శాంతి నికేతన్ పాఠశాలలను బృందం పరిశీలించింది. పరిశీలించిన నివేదికను డీఈఓకు పంపనున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారి తుంగతుర్తి ఎంఈఓ బి. లింగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు పాలవరపు సంతోష్, అశోక్‌రెడ్డి, ఎస్. రాజయ్య, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు కె. జగన్, కె. మహేశ్వర్, కె. ఉప్పలయ్య, వీణ తదితరులు పాల్గొన్నారు.