taskforce
-
అప్పట్లో వైఎస్ఆర్ పెట్టిన గొప్ప పథకం. ఇప్పుడు సీఎం జగన్ చేసి చూపించారు
-
కానిస్టేబుల్ ఈశ్వర్.. ఇతని రూటే సెపరేటు.. దొంగలతో చేతులు కలిపి
సాక్షి, హైదరాబాద్: ప్రజలను రక్షించే బాధ్యత పోలీసులదే. ఎక్కడ ఏ అన్యాయం, నేరం జరిగినా ముందుండేది ఖాకీలే. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో వీరిదే కీలక పాత్ర. పోలీస్ వృత్తికి, యూనిఫామ్‌కు ఉన్న గౌరవం అలాంటిం. అయితే అభాగుల్యకు, బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే దారితప్పుతున్నారు. తక్కువ కాలంలో కోట్లు సంపాదించాలనే దురుద్దేశంతో అక్రమ మార్గాలు తొక్కుతున్నారు. నేరస్తుల పంచన చేరి తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తే కానిస్టేబుల్ ఈశ్వర్.. వృత్తి పోలీస్ అయినా చేసేవన్నీ దొంగ పనులు. ప్రస్తుతం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. హఫీజ్‌పేటలో నివాసముంటున్న ఈశ్వర్ స్వస్థలం ఏపీలోని బాపట్ల జిల్లా స్టూవర్ట్‌పురం. గౌరవనీయమైన పోలీస్ వృత్తిలో ఉంటూ దొంగలతో చేతులు కలిపి నెలసరీ మామూళ్లు వసూళ్లు చేయడం ప్రారంభించాడు. కొన్నేళ్లకు ఈశ్వర్ ప్రవర్తన మీద ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో పోలీస్ ఆపరేషన్స్‌కు దూరంగా పెట్టారు. టాస్క్‌ఫోర్స్ విభాగానికి అటాచ్ చేశారు. ముఠా నేతగా అయినా ఈ కానిస్టేబుల్ తన వక్ర బుద్దిని మార్చుకోలేదు. అంతేనా రూటు మార్చి కొత్త పద్దతులో డబ్బు సంపాదనకు శ్రీకారం చుట్టాడు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తూ ఆ కుటుంబంలో ఉన్న యువకులు, మైనర్లను తన ఇంటికి తీసుకొచ్చేవాడు. వీరందరితో ఓ ముఠా ఏర్పాటు చేసి చోరీలకు పథకాన్ని రచించేవాడు. ఆ గ్యాంగ్‌కు లీడర్‌గా వ్యవహరించేవాడు. వారితో దొంగతనాలు, చైన్ స్నానింగ్లు వంటివి చేయించేవాడు. దొంగతనం చేసిన సొమ్ము లక్షల్లో అతని చేతిలోకి రాగానే ఒక్కొక్కరికి రూ. 40 వేల నుంచి 50 వేల వరకు చెల్లించి చేతులు దులుపుకునేవాడు. మాయమాటలు చెప్పి బెయిల్ ఒకవేళ దొంగలు పోలీసులకు పట్టుబడితే తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. పట్టుబడిన నిందితులు తనకు కావాల్సిన వారని, దగ్గరి బంధువులంటూ ఏదో మాయమాటలు చెప్పి వారిని కేసు నుంచి తప్పించడం, బెయిల్‌పై బయటకు తీసుకురావడం చేసేవాడు. అంతేగాకుండా అంతరాష్ట్ర దొంగలను పట్టుకునేందుకు బయల్దేరగానే వారికి ముందుగానే సమాచారమిచ్చి తప్పించుకునేలా సహకరించేవాడని కూడా ఈశ్వర్‌పై ఆరోపణలున్నాయి. చదవండి: Hyderabad: టీచర్ల నిర్వాకం.. విద్యార్థులతో పారిశుద్ధ్య పనులు..! అధికారుల పరిచయాలతో చివరికి ఈశ్వర్ చోరీలు, దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే అతనిపై చీరాల, బేగంపేట, హుమాయిన్‌నగర్ తదితర పోలీస్ స్టేషన్లో గృహహింస, కిడ్నాప్ కింద కేసులు నమోదైనట్లు గుర్తించారు. దీంతో ఐదుసార్లు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే తనకున్న ఉన్నతస్థాయి అధికారుల పరిచయాలతో నెలల వ్యవధిలోనే మళ్లీ కొలువులో చేరేవాడు. నల్గొండ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కూడా సీఐ..ఏ సీపీ స్థాయిలో ఉన్న అధికారులను బదిలీ చేయించగల సత్తా తనకుందని.. తాను దొంగతనం చేయం ఏంటని బుకాయించి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇతడు చేసే నేరాల్లో మరో కానిస్టేబుల్ కూడా సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిపై కూడా పోలీసులు అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వీరిద్దరిపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతునట్లు సమాచారం -
టీడీపీ నాయకుడే గుట్కా కింగ్!
ఒంగోలు: గుట్టు చప్పుడు కాకుండా గుట్కా విక్రయాలు సాగిస్తున్న టీడీపీ నాయకుడి ఉదంతాన్ని ఎస్ఈబీ అధికారులు రట్టు చేశారు. ఒంగోలు అన్నవరప్పాడు సెబ్ కార్యాలయంలో బుధవారం ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ ఎన్.సూర్యచంద్రరావు వివరాలు చెప్పారు. స్థానిక కమ్మపాలెం వాసి ముల్లూరి వెంకట నాగశివ చరణ్ కారులో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్లు సెబ్ అధికారులకు సమాచారం అందింది. స్థానిక ఎస్ఈబీ అధికారులు కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద కారును ఆపి తనిఖీ చేయగా అందులో 27,375 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో అతన్ని అదుపులోనికి తీసుకుని విచారించగా స్థానిక బృందావన్ నగర్‌లోని ఒక పాడుబడిన ఇంట్లో ఉంచిన గుట్కా నిల్వల సమాచారాన్ని ఇచ్చాడు. అతని సహాయంతో సంబంధిత ప్రాంతాన్ని గుర్తించి ఇంట్లో తనిఖీ చేయగా 2,39,556 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో గుట్లపల్లి శ్రీమన్నారాయణ అలియాస్ చిన్నా నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. శ్రీమన్నారాయణ స్థానిక 46వ డివిజన్ కార్పొరేటర్ కుమారుడు. ఇతను మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు అనుచరుడిగా పేరుంది. దాడిలో 2,66,931 గుట్కా ప్యాకెట్లను సీజ్‌చేశారు. వాటి విలువ రూ.3,43,224గా ఉంటుందని అంచనా. -
Drugs: అలవాటయ్యే వరకు అగ్గువ!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): గంజాయి సంబంధిత ద్రవ పదార్థమైన హష్ ఆయిల్ విక్రయంలో ఓ ముఠా కొత్త ఎత్తు వేసింది. ప్రధానంగా యువత, విద్యార్థులను టార్గెట్‌గా చేసుకున్న వీళ్లు..ఈ మత్తుకు అలవాటు పడేవరకు వారికి తక్కువ రేటుకు అమ్మారు. బానిసలుగా మారిన తర్వాత భారీ రేటు కట్టి విక్రయించారు. ఈ ముఠా వ్యవహారంపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారని టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మి బుధవారం వెల్లడించారు. సనత్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మహబూబ్ అలీ వృత్తిరీత్యా డ్రైవర్ అయినప్పటికీ నేర చరితుడు. మాదాపూర్‌లో రెండు దోపిడీ, మరో హత్యాయత్నం కేసులతో పాటు ఎస్సార్‌నగర్‌లో డ్రగ్స్ కేసు ఇతడిపై నమోదై ఉన్నాయి. గంజాయి, హష్ ఆయిల్ వినియోగానికి బానిసగా మారిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం హష్ ఆయిల్ తీసుకువచ్చి ఇక్కడ విక్రయించాలని భావించాడు. ఈ ఆలోననను తన స్నేహితులైన సనత్‌నగర్ వాసులు మహ్మద్ సర్ఫ్రాజ్, మహ్మద్ హాజీ పాషాలకు చెప్పడంతో వాళ్లూ జట్టుకట్టారు. కొన్నాళ్ల క్రితం ఈ త్రయం ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు వెళ్లింది. అక్కడి వెంకట్ అనే వ్యక్తి నుంచి హష్ ఆయిల్ ఖరీదు చేసుకువచ్చింది. తన స్నేహితులు, పరిచయస్తులైన వారికి తక్కువ రేటుకు అమ్మడం మొదలెట్టింది. వారి ద్వారా పరిచయమైన వారికీ ఈ మాదకద్రవ్యం విక్రయించింది. అలా వారిని ఈ మత్తుకు బానిసలుగా మార్చేసిన తర్వాత హష్ ఆయిల్ రేటును అమాంతం పెంచేసి అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటోంది. హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్ పరిధిలోని వారికీ దీన్ని విక్రయిస్తోంది. ఇప్పుడు వీళ్లు వెళ్లాల్సిన పని లేకుండా ఆర్డర్ చేస్తే చాలా వెంకట్ వివిధ రకాలుగా పార్శిల్ చేసి పంపిస్తున్నాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్, కె.చంద్రమోహన్ వలపన్నారు. బంజారాహిల్స్ ప్రాంతంలో హష్ ఆయిల్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి నుంచి 205 చిన్న బాక్సుల్లో ఉన్న 1.02 లీటర్ల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న వెంకట్ కోసం గాలిస్తున్నారు. -
రంగులు పూసి.. రైతుల్ని ఏమార్చి.. రూ.6 కోట్లు
సాక్షి, నల్గొండ: పనికిరాని, నాసిరకం విత్తనాలకు రసాయన రంగులను పూయడంతోపాటు ఏకంగా క్యూఆర్ కోడ్లతో కూడిన ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి రైతులకు అంటగడుతున్న అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రైతుల నుంచి అందిన ఫిర్యాదులతో 15 రోజులపాటు జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందంతో కలసి అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఈ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. ఈ కేసులో 13 మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.6 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు, లేబుల్ ప్యాకెట్లు, యాంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్టు చేసిన నిందితులను శుక్రవారం నల్లగొండ ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు వివరాలను ఐజీ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ రంగనాథ్, వ్యవసాయ జేడీ శ్రీధర్‌రెడ్డిలు వెల్లడించారు. పట్టుబడిన వాటిలో రూ. 4 కోట్ల విలువైన 20 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు, రూ. 2 కోట్ల విలువైన 200 టన్నుల నకిలీ వరి, మొక్కజొన్న, మిర్చి, ఇతర కూరగాయల విత్తనాలు ఉన్నాయన్నారు. వాటిని స్వాధీనం చేసుకోకపోతే 40 వేల ఎకరాల్లో పంట నష్టంతోపాటు రైతులు పెట్టుబడి నష్టపోయేవారన్నారు. దందా సాగించారిలా... ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో నైరుతి సీడ్స్ కంపెనీ నడుపుతున్న ప్రధాన నిందితుడు, చార్టెడ్ అకౌంటెంట్ అయిన ఏనుబోతుల శ్రీనివాస్‌రెడ్డి, ఏపీలోని నంద్యాలకు చెందిన కర్నాటి మధుసూదన్‌రెడ్డిలు మరికొందరితో కలసి ఈ దందాకు తెరలేపారు. ఇందుకోసం శ్రీనివాస్‌రెడ్డి దేవరయాంజల్లో ఎంజీ అగ్రిటెక్ ప్రాసెసింగ్ యూనిట్ నడుపుతున్న కాకినాడవాసి మేడిశెట్టి గోవిందు, నంద్యాలకు చెందిన గోరుకంటి పవన్‌కుమార్, స్వామిదాస్ల సహకారం తీసుకున్నాడు. వారి ద్వారా పనికిరాని పత్తి గింజలు, ఇతర పంటల విత్తనాలను కిలో రూ. 200 చొప్పున కొనుగోలు చేసి వాటిని గోవిందుకు చెందిన ప్రాసెసింగ్ యూనిట్లో శుద్ధి చేసేవాడు. వాటిని నాణ్యమైన విత్తనాలుగా నమ్మించేందుకు రసాయన రంగులను పూసి అందమైన ప్యాకెట్లలో నింపి రైతులకు కిలో ప్యాకెట్‌ను రూ. 900 చొప్పున విక్రయించేవాడు. రైతులను నమ్మించేం దుకు శ్రీనివాస్‌రెడ్డి నాగపూర్‌కు చెందిన ఐసీఏఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్) సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లుగా ప్యాకిం గ్ కవర్లపై ముద్రించాడు. ఈ దందాకు పాత నేరస్తుడైన మధుసూదన్‌రెడ్డితోపాటు ఖమ్మానికి చెందిన పెద్దిరెడ్డి, నల్లగొండ జిల్లా చండూర్‌కు చెందిన బాలస్వామి, దేవరకొండకు చెందిన పిచ్చయ్య, పవన్‌లతోపాటు మరికొందరు సహకరించేవారు. నకిలీ విత్తనాల రవాణాతోపాటు కొందరు డీలర్లకు అధిక కమీషన్ ఆశచూపి నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టేలా మధుసూదన్‌రెడ్డి తదితరులు ప్రోత్సహించేవారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు టాస్క్‌ఫోర్స్ బృందంతో కలసి ఏపీలోని నంద్యాల, ఆళ్లగడ్డతోపాటు గజ్వేల్, గద్వాల, జడ్చర్ల, హైదరాబాద్, గుండ్లపొచంపల్లి, ఎల్లంపేట, దేవరయాంజల్, బోయినపల్లి తదితర ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 20 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు, 140 టన్నుల వరి, 40 టన్నుల మొక్కజొన్న, 4 క్వింటాళ్ల వివిధ కూరగాయల నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. -
సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతుంటే జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆ ఇద్దరు దొంగల వివరాలు తెలిపారు. ఈస్ట్ జోన్ పరిధిలో వరుస ఇళ్ల దొంగతనాలు చేసిన షేక్ అబ్దుల్ జాఫర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని టౌలిచౌకీకి చెందిన ఇతడు ఆటో డ్రైవర్‌గా కూడా పని చేస్తున్నాడు. ఆటో నడుపుతూనే దొంగతనాలు చేస్తున్నాడు. అతడి నుంచి 23 తులాల బంగారం, డైమండ్ హారంతో పాటు ఒక బైక్‌ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. వీటి విలువ రూ.12 లక్షలు ఉంటుందని వివరించారు. 2006 నుంచి ఇప్పటివరకు ఇతడిపై మొత్తం 66 ఇళ్ల దొంగతనాల కేసులున్నాయి. హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌కు చెందిన హాబీబ్ అజమత్ దక్షిణ జోన్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నాడు. ఇతడి సహాయకుడు షారూఖ్ పరారీలో ఉన్నాడు. నిందితుడి నుంచి రూ.10.50 లక్షల విలువైన 20 తులాల బంగారంతో పాటు ఆటోని సీజ్ చేశారు. ఇతడిపై ఇప్పటివరకు 30 కేసులు నమోదై ఉన్నాయి. ఈ ఇద్దరి నుంచి మొత్తం రూ.22.50లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లిన వారికి కొన్ని జాగ్రత్తలు తెలిపారు. తాము ఊళ్లకు వెళ్తున్నామని సోషల్ మీడియాలో ప్రకటించొద్దని.. అది దొంగలకు వరంగా మారుతుందని కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. గ్రామానికి వెళ్తున్న వారు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. తాము నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నా దొంగతనాలు కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. ముందే నివారణ చేసుకుంటే నేరాలు జరిగే అవకాశం లేదని కమిషనర్ అంజనీకుమార్ గుర్తుచేశారు. తాము ప్రవేశపెట్టిన యాప్స్ కూడా వినియోగించాలని సూచించారు. -
గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
సాక్షి,విజయవాడ : విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో 20కేజీల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి ఎటువంటి బిల్లులు లేకుండానే కార్గో కొరియర్ ద్వారా బంగారు, వెండి ఆభరణాలను విజయవాడకు తరలిస్తున్నట్లు తెలిపారు. పన్నులు ఎగ్గొట్టి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని, నగరంలోని పలు బంగారు దుకాణాల్లో సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా పట్టుబడ్డ బంగారం విలువ సుమారు రూ.17 కోట్లుగా ఉంటుందని, అలాగే వారి వద్ద నుంచి రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. -
భారీగా గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : నగరంలో గంజాయి దొరకడం కలకలం రేపుతోంది. ఇబ్బడిముబ్బడిగా నగరంలో పలుచోట్ల గంజాయి దొరకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కూకట్పల్లి పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లి మెట్రో దగ్గర్లో ఎర్రెల్లి రాజు అనే గంజాయి సరఫరాదారుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద పన్నెండున్నర కిలోల గంజాయిని మేడ్చల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మాజీ డీఎస్పీ భూపతి ఇంట్లో టాస్కఫోర్స్ సోదాలు
-
ఈ–కామర్స్‌పై టాస్క్‌ఫోర్స్: కేంద్రం
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ రంగానికి సంబంధించి ప్రత్యేక విధానం రూపకల్పనపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ–కామర్స్‌పై జాతీయ విధానం రూపకల్పనపై ఏర్పాటైన కమిటీ మంగళవారం తొలిసారి సమావేశమైన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. ట్యాక్సేషన్, ఇన్ఫ్రా, పెట్టుబడులు, టెక్నాలజీ బదలాయింపు, డేటా భద్రత, నిబంధనలు, పోటీ మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా తెలిపారు. టాస్క్‌ఫోర్స్ తమ సిఫార్సులను అయిదు నెలల్లోగా కమిటీకి సమర్పించాల్సి ఉంటుందని, కమిటీ ఆరు నెలల్లో నివేదికనివ్వాల్సి ఉంటుందని ఆమె తెలియజేశారు. డైరెక్ట్ సెల్లర్లకు ఆన్లైన్ సెగ!: ఐడీఎస్ఏ డైరెక్ట్ సెల్లర్ల వ్యాపారంపై ఆన్లైన్ డిస్కౌంట్లు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ వంటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో డైరెక్ట్ సెల్లర్ల అనుమతి లేకుండానే వారికి సంబంధించిన ఉత్పత్తులు అధిక డిస్కౌంట్ ధరలకు లభిస్తున్నాయి. దీంతో వారి వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ విషయాలు ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ (ఐడీఎస్ఏ) 2016–17 వార్షిక నివేదికలో వెల్లడయ్యాయి. -
పాతబస్తీలో భారీగా గంజాయి పట్టివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. నగరంలోని ఓల్డ్ సిటీలో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా రెండు కార్లలో తరలిస్తున్న 175 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో పలువురు పరారైనట్టు తెలుస్తోంది. -
కల్తీ కేంద్రాలపై ఉక్కుపాదం
- నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసు దాడులు - రూ.1.10 కోట్ల విలువైన సరుకు స్వాధీనం హైదరాబాద్: నగరంలోని కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పాతబస్తీ, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం దాడులు జరిపారు. మొత్తం రూ.1.10 కోట్ల విలువైన కల్తీ ఆహార పదార్థాలు, గుట్కా స్వాధీనం చేసుకున్నారు. పలువురుని అరెస్టు చేశారు. పాతబస్తీలో మిర్చి, మసాలా పౌడర్... పాతబస్తీ సంతోష్‌నగర్, ఛత్రినాక, భవానీనగర్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ల పరిధిలోని కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై శాంతిభద్రతలు, టాస్క్‌పోర్స్ పోలీసులు దాడులు చేశారు. రూ.50 లక్షల విలువైన ఆహార పదార్థాలు, గుట్కా స్వాధీనం చేసుకున్నట్టు దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ చెప్పారు. సంతోష్‌నగర్ రక్షాపురంలోని భవానీ ఏజెన్సీ నిర్వాహకుడు ఎ.సర్జయ్య నుంచి చక్రం బ్రాండ్‌తో ఉన్న 800 కిలోల కల్తీ మిర్చి, ధనియాల పొడి, పసుపు, ఏలకులు స్వాధీనం చేసుకున్నారు. మోయిన్బాగ్లోని మహ్మద్ ముజీబ్ ఉల్ రెహమాన్ ఆధ్వర్యంలోని రాయల్రోజ్ ఎంకేఆర్ ప్రొడక్ట్స్‌తో ఉన్న 70 కిలోల అల్లం–వెల్లుల్లి మిశ్రమం, వెల్లుల్లి, తయారీ సామాగ్రిని సీజ్ చేశారు. ఛత్రినాక పూర్ణచందర్ కేంద్రంపై దాడులు చేసి 98 పామాయిల్, డాల్డా డబ్బాలను, భవానీనగర్‌లోని మహ్మద్ గౌస్ ఖురేషీ, మహ్మద్ అంజద్, మహ్మద్ ఖాజా మోయినోద్దీన్ల నుంచి 20 కిలోల పశు వ్యర్థాలు, 45 కిలోల పశు వ్యర్థాలతో తయారు చేసిన నూనె స్వాధీనం చేసుకున్నారు. చాంద్రాయణగుట్టలో సయ్యద్ రషీద్ నుంచి 2 గుట్కా తయారీ మిషన్లు, 150కి పైగా బ్యాగ్‌ల గుట్కా ముడిసరుకు, గుట్కా పౌడర్ సీజ్ చేశారు. బహదూర్‌పురాలోని డాక్టర్ హఫీజుల్లాఖాన్పై దాడి చేసి 25 లీటర్ల తేనె, మహ్మద్ రఫీక్‌కు చెందిన 150 కిలోల కల్తీ వంట నూనె స్వాధీనం చేసుకున్నారు. బహదూర్‌పురాలో తేనె తయారీ కేంద్రాన్ని కూడా సీజ్ చేశారు. వీటన్నింటికీ సంబంధించి 9 మందిని అరెస్ట్ చేసి నట్లు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఎల్బీనగర్లో రూ.60 లక్షల సరుకు స్వాధీనం ఎల్బీనగర్కు చెందిన శ్రీసాయి గ్రేడింగ్ వర్క్స్ నిర్వాహకుడు బన్నెల ప్రవీణ్(33)ను అరెస్టు చేసి, అతడి నుంచి 500కు పైగా బ్యాగ్‌ల మిర్చి పొడి, పసుపు స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో ఆర్.కె.ట్రేడర్స్ సుల్తాన్ రతానీని అరెస్ట్ చేసి, 362 బస్తాల మిర్చి, కారం బ్యాగ్‌లు, తయారీ పరికరాలను సీజ్ చేశారు. బైరామల్‌గూడ వద్ద గోదాం నిర్వహిస్తున్న తమ్మూరు బాయ్ నుంచి 400 కేజీలకు పైగా మిర్చి, కారం, చెక్క పొడి, డీసీఎం వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సాగర్‌రింగ్‌రోడ్డు ప్రకాశ్ సొసైటీలో బన్యాల ప్రవీణ్(33)... కారంలో చెక్కపౌడర్, ఆయిల్ కలిపి వివిధ బ్రాండ్ల పేరుతో సరఫరా చేస్తుండగా పోలీసులు గోదాంపై దాడి చేశారు. వీరి నుంచి 150 బస్తాల మిర్చి, 300 బస్తాల కారం తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
అమెరికన్ సిటిజన్‌కు టాస్క్‌ఫోర్స్ షాక్
-
200 కేజీల గంజాయి పట్టివేత
విజయవాడ: గొల్లపూడి వన్ సెంటర్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుమారు 200 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు విశాఖపట్నంలోని ట్రైబల్ ఏరియాకు చెందిన వారిగా గుర్తించారు. గంజాయిని కారులో విశాఖ నుంచి నిజామాబాద్‌కు తరలిస్తుండగా పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు వద్ద కారు ప్రమాదానికి గురైంది. మరో కారును కిరాయికి మాట్లాడుకుని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైస్‌మిల్లుపై టాస్క్‌ఫోర్స్ దాడులు
కస్టమ్ మిల్లింగ్ బియ్యం మాయం దీని విలువ రూ.1.80కోట్లుగా నిర్ధారణ 6ఏ కింద కేసు నమోదు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: 12వేల క్వింటాళ్లు.. రూ.1.80 కోట్ల విలువ.. నల్లగొండ జిల్లా కేంద్ర శివారులో ఉన్న ఓ రైస్‌మిల్లుపై పౌరసరఫరాల శాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడి జరిపితే కనిపించకుండా పోయిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎంఆర్) లెక్క ఇది. వివరాల్లోకి వెళితే... జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఆర్జాలబావి వద్ద సుమాంజలి పార్బాయిల్డ్ పేరిట ఓ రైస్‌మిల్లు నిర్వహిస్తున్నారు. ఈ మిల్లులో కస్టమ్ మిల్లింగ్ కోసం తీసుకున్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని గత ఖరీఫ్ సీజన్లో కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే, రబీ సీజన్లో తీసుకున్న బియ్యం కూడా ఇదే విధంగా పక్కదోవ పడుతుందన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో మిల్లుపై దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్ అధికారులు విద్యాసాగర్‌రెడ్డి, రాజేశంల నేతృత్వంలోని బృందం కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో మొత్తం 31,981 బస్తాల్లోని 12,792.40 క్వింటాళ్ల బియ్యం కనపడడం లేదని తేలింది. వాస్తవానికి ఈ మిల్లుకు ఇచ్చిన కోటా ప్రకారం 36,968 బస్తాల్లో 14,787 క్వింటాళ్ల బియ్యం ఉండాలని, కేవలం 4,987 బస్తాల్లోని 1994 క్వింటాళ్ల బియ్యం మాత్రమే ఉందని అధికారులు గుర్తించారు. కనపడకుండా పోయిన కస్టమ్ మిల్లింగ్ బియ్యం విలువ రూ.1.80 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. సదరు మిల్లు నిర్వాహకులపై 6(ఏ) నిబంధన కింద కేసు నమోదు చేస్తున్నట్టు అధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ దాడుల్లో జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రాజేందర్, వాణిజ్య పన్నుల శాఖ అ«ధికారి రామనాథరావు, సహాయ పౌరసరఫరాల అధికారి శేషన్న, ఏజీపీవో ఆర్. చంద్రశేఖర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ రంగారావు, ఆర్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కళశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
ఆలేరు : ఆలేరులోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఎస్ఆర్, వీఆర్, ఎస్‌వైఎల్‌ఎన్‌ఎస్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు వివరాలు, తరగతి గదులను, పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వో శ్రీధర్‌రెడ్డి, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
రైస్‌మిల్లులో టాస్క్‌ఫోర్స్‌దాడులు
మిర్యాలగూడ అర్బన్: రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అధికారుల బృదం మిర్యాలగూడలోని ఓ రైస్ మిల్లుపై శుక్రవారం ఆకస్మిక దాడులు చేసింది. అక్రమంగా నిల్వ చేసిన ధాన్యం బస్తాలను సీజ్ చేసింది. టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యాద్గార్పల్లి రోడ్డులో ఉన్న శ్రీ సాయి పవన్ రైస్‌మిల్లులో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విశ్వసనీయ సమచారంతో దాడులు నిర్వహించినట్లు రాష్ట్ర సివిల్ సప్లయ్ టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక అధికారులు జి.విద్యాసాగర్‌రెడ్డి, బి.రాజేషం తెలిపారు. శ్రీ సాయి పవన్ రైస్‌మిల్లుకు సీఎంఆర్ మిల్లింగ్ చేసి ఇచ్చేందుకు ప్రభుత్వం 40 కేజీల బస్తాలను 6 వేలు ఇచ్చిందన్నారు. కానీ ఆ బస్తాల లెక్కలను చూపకుండా బియ్యాన్ని బయటి మార్కెట్లో అమ్ముకున్నట్లు దాడుల్లో నిర్ధారించినట్లు తెలిపారు. ఏప్రిల్ 5, 2016 నుంచి ఆగస్టు 8వరకు రికార్డులు చూపిన రైస్‌మిల్లు యాజమాన్యం కస్టమ్స్ మిల్లింగ్ బియ్యం సంబంధించిన రికార్డులను ఏప్రిల్ 28వ తేది నుంచి నేటి వరకు ఎలాంటి రికార్డులు నమోదు చేయలేదని చెప్పారు. దీంతో సుమారు రూ.40 లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వానికి 6205.95 క్వింటాళ్ల సీఎంఆర్ బియ్యం ఇవ్వాల్సి ఉండగా.. 4590 క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వం అందించిన ధాన్యం నిల్వలు చూపకపోవడంతో మిల్లు యాజమాన్యం అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయిందన్నారు. 20 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని అక్రమంగా దాచి ఉంచినట్లు గుర్తించిన టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆ ధాన్యం మొత్తాన్ని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిబంధనల ప్రకారం బియ్యం సరఫరా చేయని ఈ మిల్లుపై ప్రభుత్వానికి నివేధికను పంపించి అనంతరం యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీజ్ చేసిన ధాన్యం బస్తాలకు పంచనామా నిర్వహించి, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో సివిల్ సప్లై నల్లగొండ, పెద్దవూర, డిప్యూటీ తహసీల్దార్లు సంగమిత్ర, లక్ష్మణ్, పీఆర్ఐ దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు పాఠశాలల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
అర్వపల్లి: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రభుత్వ నిబంధనల అమలు తదితర విషయాల పరిశీలనకై మంగళవారం మండలంలోని ప్రైవేటు పాఠశాలలను టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీ చేసింది. అర్వపల్లిలోని విజ్ఞాన్ పబ్లిక్‌స్కూల్, చైతన్యభారతి, మాంటిస్సోరి, లోయపల్లి క్రాస్‌రోడ్డులోని శాంతి నికేతన్ పాఠశాలలను బృందం పరిశీలించింది. పరిశీలించిన నివేదికను డీఈఓకు పంపనున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారి తుంగతుర్తి ఎంఈఓ బి. లింగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు పాలవరపు సంతోష్, అశోక్‌రెడ్డి, ఎస్. రాజయ్య, ఆయా పాఠశాలల హెచ్ఎంలు కె. జగన్, కె. మహేశ్వర్, కె. ఉప్పలయ్య, వీణ తదితరులు పాల్గొన్నారు. -
రూ.2కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
-
రూ.2కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి: చంద్రగిరి మండలం రంగపేట వద్ద టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహించింది. టాస్క్ ఫోర్స్ కు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. దీంతో సిబ్బంది గాల్లోకి కాల్పులు జరపగా కూలీలు పారిపోయారు. ఆ ప్రాంతంలో పోలీసులు రూ.2కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఐజీ కాంతారావు పరిశీలించారు. -
గంటల తరబడి మహిళలతో ...
-
ఢిల్లీలో ఇద్దరు హుజీ ఉగ్రవాదుల అరెస్ట్
ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఢిల్లీలో ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వారిని హైదరాబాద్ తరలిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు కొద్ది గంటల ముందు హైదరాబాద్ హూజీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.., హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే మెదక్ జిల్లా జహీరాబాద్ కు చెందిన షేక్ నూర్, ఢిల్లీకి చెందిన హకీంను ఢిల్లీలో పట్టుకున్నారు. వారిని హైదరాబాద్ తరలించారు. వీళ్లిద్దరూ ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్న యువకులను బార్డర్ దాటించడంలో దిట్ట అని సిట్ పోలీసులు వెల్లడిస్తున్నారు. -
ఇద్దరు నైజీరియన్లు అరెస్టు
హైదరాబాద్: విజిటింగ్ వీసాలపై నగరంలో తిష్టవేసిన పలువురు నైజీరియన్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో నివాసముంటున్న నైజీరియన్ ఇళ్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో ఇద్దరు నైజీరియన్ లను, సూడాన్ కు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో వారు నిందితులుగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. విజిటింగ్ వీసాల గడువు ముగిసినప్పటికీ నైజీరియన్లు నగరంలోనే స్థిరపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
'గ్రేహౌండ్స్ తరహాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్'
తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలు కట్టిస్తామని డీఐజీ కాంతారావు హెచ్చరించారు. గ్రేహౌండ్స్ తరహాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తిరుపతిలో బుధవారం ఆయన 'సాక్షి' మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అత్యుత్తమమైన ప్రమాణాలతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటయిందని కాంతారావు తెలిపారు. తప్పు చేసిన వారి విషయంలో కూలీ నుంకి బడా స్మగ్లర్ వరకూ ఎవరినీ వదలబోమని ఆయన హెచ్చరించారు. అటవీ, పోలీసు, రెవెన్యూ, టీటీడీలతో సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ కు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను తిరుపతిలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తం 483 మందితో కలిసి ఈ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని డీఐజీ కాంతారావు మీడియాతో చెప్పారు. -
నెట్ సెంటర్ పై దాడి, నీలి చిత్రాలు సీడీలు స్వాధీనం
హైదరాబాద్ : ఇంటర్నెట్ నుంచి నీలి చిత్రాలు డౌన్లోడ్ చేసి...వాటిని మెమరీ కార్డుల్లోకి ఎక్కించి సొమ్ము చేసుకుంటున్న ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వహకుడిని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి కంప్యూటర్‌తో పాటు మెమరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం... టప్పాచబుత్రకు చెందిన మహ్మద్ సర్దార్ స్థానికంగా 'యూనివర్సల్ ఇంటర్నెట్' సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. సెంటర్లో ఉన్న కంప్యూటర్లో నీలి చిత్రాలను డౌన్లోడ్ చేసుకుని వినియోగదారుల మెమరీ కార్డులలో డౌన్లోడ్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. విషయం తెలసుకున్న పోలీసులు నిన్న మధ్యాహ్నం ఇంటర్నెట్ సెంటర్‌పై దాడి చేశారు. నీలి చిత్రాలను స్వాధీనం చేసుకుని సర్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని టప్పాచబుత్ర పోలీసులకు అప్పగించారు.