
ఒంగోలు: గుట్టు చప్పుడు కాకుండా గుట్కా విక్రయాలు సాగిస్తున్న టీడీపీ నాయకుడి ఉదంతాన్ని ఎస్‌ఈబీ అధికారులు రట్టు చేశారు. ఒంగోలు అన్నవరప్పాడు సెబ్ కార్యాలయంలో బుధవారం ఎస్‌ఈబీ జాయింట్ డైరెక్టర్ ఎన్.సూర్యచంద్రరావు వివరాలు చెప్పారు. స్థానిక కమ్మపాలెం వాసి ముల్లూరి వెంకట నాగశివ చరణ్ కారులో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నట్లు సెబ్ అధికారులకు సమాచారం అందింది.
స్థానిక ఎస్‌ఈబీ అధికారులు కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద కారును ఆపి తనిఖీ చేయగా అందులో 27,375 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో అతన్ని అదుపులోనికి తీసుకుని విచారించగా స్థానిక బృందావన్ నగర్‌లోని ఒక పాడుబడిన ఇంట్లో ఉంచిన గుట్కా నిల్వల సమాచారాన్ని ఇచ్చాడు.
అతని సహాయంతో సంబంధిత ప్రాంతాన్ని గుర్తించి ఇంట్లో తనిఖీ చేయగా 2,39,556 గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో గుట్లపల్లి శ్రీమన్నారాయణ అలియాస్ చిన్నా నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. శ్రీమన్నారాయణ స్థానిక 46వ డివిజన్ కార్పొరేటర్ కుమారుడు. ఇతను మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు అనుచరుడిగా పేరుంది. దాడిలో 2,66,931 గుట్కా ప్యాకెట్లను సీజ్‌చేశారు. వాటి విలువ రూ.3,43,224గా ఉంటుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment