
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో గంజాయి దొరకడం కలకలం రేపుతోంది. ఇబ్బడిముబ్బడిగా నగరంలో పలుచోట్ల గంజాయి దొరకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కూకట్‌పల్లి పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కూకట్‌పల్లి మెట్రో దగ్గర్లో ఎర్రెల్లి రాజు అనే గంజాయి సరఫరాదారుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద పన్నెండున్నర కిలోల గంజాయిని మేడ్చల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.