హైదరాబాద్: విజిటింగ్ వీసాలపై నగరంలో తిష్టవేసిన పలువురు నైజీరియన్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో నివాసముంటున్న నైజీరియన్ ఇళ్లపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
దాడుల్లో ఇద్దరు నైజీరియన్ లను, సూడాన్ కు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో వారు నిందితులుగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. విజిటింగ్ వీసాల గడువు ముగిసినప్పటికీ నైజీరియన్లు నగరంలోనే స్థిరపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడులు జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.