కళాశాలల్లో విస్తృత తనిఖీలు | Colleges checks | Sakshi
Sakshi News home page

కళాశాలల్లో విస్తృత తనిఖీలు

Published Fri, Jul 29 2016 12:10 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

Colleges checks

గోవిందరావుపేట : మండలంలోని పస్రా జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గురువారం ఉదయమే దేవి ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, నలంద కళాశాల, గాయత్రీ, కాకతీయ డిగ్రీ కళాశాలల్లో తనిఖీలు జరిగాయి. నలంద కళాశాలకు సీఐడీ డీఎస్పీ రవి కుమార్, డిగ్రీ కళాశాలలకు విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రమణారెడ్డి, దేవి కళాశాలకు మైనింగ్‌ ఏజీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో బృందాలు చేరుకున్నాయి. లైబ్రరీ, ల్యాబ్‌లు, కళాశాలకు కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు ఉన్నాయా, భవనాలకు నిర్మాణ అనుమతి ఉందా అనే విషయాలు పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, లెక్చరర్‌లు ఎంతమంది, వారి అర్హతలు వంటి వివరాలను పరిశీ లిస్తున్నారు. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ డీ డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా విజి లెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ సురేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సుమారు 1200 కళాశాలల్లో తనిఖీలు చేపట్టనుండగా, ఇప్పటి వర కు 750 కళాశాలల్లో పూర్తయిందని వివరించారు. కళాశాలలో ఎలాంటి లోపాలున్నా ప్రాథమిక రిపోర్టును తయారు చేసి పంపిస్తామని చెప్పారు. ఆయన వెంట విజిలెన్స్‌ తహసీల్దార్‌ భవాని, సీఐడీ ఎస్సై పుష్పలత, ప్రొఫెసర్‌ అంజయ్య, పీఆర్‌ ఏఈ సుగుణాకర్‌రావు, సిబ్బంది ఉన్నారు. పస్రాలోని ఓ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో ఎప్పుడూ విద్యార్థులు కనిపించరని, ఇప్పుడు మాత్రం వస్తున్నారంటే తనిఖీ సమాచారం ముందే 
లీకై ఉండవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement