శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: నకిలీ ధ్రువపత్రాలతో పదోన్నతులు పొందిన వారిపై రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్, సీఐడీ అధికారులు కొరడా ఝుళిపించడం ఉపాధ్యాయుల్లో గుబులు పట్టుకుంది. ఎస్జీటీలుగా పనిచేస్తూ అక్రమంగా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందినవారిపై శుక్రవారం దాడులు జరగడమే కాకుండా కఠినంగా కేసులు కూడా నమోదు చేస్తుండడమే దీనికి కారణం. జిల్లాలో కూడా అక్రమ పదోన్నతులు పొందిన వారు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాలతో పోల్చితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లో అధికంగా పనిచేస్తున్నారు.
జిల్లాలో ఎస్జీటీలుగా ఉద్యోగాలు చేస్తూ నకిలీ ధ్రువపత్రాలతో పదోన్నతులు పొందిన వారు వందల సంఖ్యలో ఉండచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీల ద్వారా యూజీ, పీజీ కోర్సులు చదవకుండా నికిలీ ధ్రువపత్రాలను రూ 10వేల నుంచి రూ 30వేల మద్య కొనుగోలు చేసి పదోన్నతల సమయం వాటిని అస్త్రాలగా ఉపయోగించుకున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా జిల్లాలో కూడా నికిలీ పత్రాలతో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు ఉన్నారనే విషయం సుస్పష్టం అవుతుండటంతో విజిలెన్స్, సీఐడీ దాడులు జరగవచ్చుననే ఊహాగానాలు విద్యాశాఖ వర్గాల్లో జోరందుకున్నాయి. దాడులు సైతం జరగవచ్చుననే సంకేతాలను అధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ఇది అక్రమ పద్ధతుల్లో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.
గురువుల్లో గుబులు
Published Sat, Nov 9 2013 2:39 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement
Advertisement