పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల్ని చెక్కులు లేదా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని పేర్కొంటూ
న్యూఢిల్లీ: పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులకు చెల్లించాల్సిన వేతనాల్ని చెక్కులు లేదా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. పేమెంట్ ఆఫ్ వేజెస్(సవరణ) బిల్లు 2017ను, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బిల్లును సభ ముందుంచారు. పేమెంట్ ఆఫ్ వేజెస్(సవరణ) బిల్లు 2016, స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఇంతకుముందు ఈ అంశంపై జారీ చేసిన ఆర్డినెన్స్ ను కూడా రద్దు చేయాలని సూచించారు.