బాల్కొండ: నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని పలు సంక్షేమ హాస్టళ్లలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ సీఐలు రఘునాథ్, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వసతి గృహాల్లో విద్యార్థులకు కాస్మోటిక్ చార్టీలు చెల్లించకపోవడం, మెనూ ప్రకారం ఆహారం అందివ్వటం లేదని తనిఖీల్లో తేలినట్టు ఆధికారులు వెల్లడించారు. అదే విధంగా కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ గిరిజన హాస్టల్, మెదక్ జిల్లా జహీరాబాద్ బీసీ హాస్టల్ లోనూ ఏసీబీ దాడులు నిర్వహించి రిజిస్టర్లను పరిశీలించారు.