యాలాల: ఎట్టకేలకు పోలీసుల చెక్‌పోస్టు గుడారం దొరికింది. మండల పరిధిలోని వ్యవసాయ పరిశోధన స్థానం సమీపంలో ఇటీవల పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు గుడారాన్ని గుర్తుతెలియని దుండగులు అపహరిం చిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం మండల పరిధిలోని బెన్నూరు సమీపంలో రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తులు గుడారాన్ని పడేసి వెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి గుడారాన్ని పోలీస్‌స్టేష న్‌కు తరలించారు.
మండల పరిధిలో ని కాగ్నా నది నుంచి తరలిస్తున్న ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ పరిశోధన స్థానం సమీపంలో పోలీసులు చెక్‌పోస్టును ఏర్పాటు చేశా రు. ఓ గుడారం ఏర్పాటు చేసి పోలీసులు రాత్రివేళల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలోనే గత శుక్రవారం రాత్రి గుడారాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. పోలీసుల గుడారమే అపహరణకు గురవడంతో ఖాకీలు ఈ ఘటనను అవమానంగా భావించారు. ముమ్మరంగా దర్యాప్తు చేశారు.
ఈ ఘటనకు పాల్పడింది ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులే అని పోలీసులు ప్రాథమికంగా భావించారు. ఈ కోణంలో కొందరిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. అయితే అనుకోకుండా బుధవారం ఉదయం బెన్నూరు సమీపంలోని ఈడిగి అంబరయ్య బావి సమీపంలో గుడారం ప్రత్యక్షం అయింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
గుడారాన్ని పడేసివెళ్లిన నిందితులు?
పోలీసులు ప్రాథమిక అనుమానం ఉన్న ఇసుక రవాణాదారులను ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకొని విచారణ జరిపా రు. ఇసుక ట్రాక్టర్‌లు నడిపే డ్రైవర్లను తమదైన శైలిలో విచారించారు. దీంతో గుడారాన్ని అపహరించుకుపోయిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ చేసిన తప్పును అంగీకరించాడని విశ్వసనీయంగా తెలిసింది. కాగా ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తులు గుడారాన్ని బెన్నూరు శివారులో బుధవారం ఉదయం ఉద్దేశపూర్వకంగానే వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. గుడారం ప్రత్యక్షమవడం విషయమై యాలాల ఎస్‌ఐ రవికుమార్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ పలుమార్లు ఫోన్లో సంప్రదించే యత్నం చేసినా ఆయన స్పందించలేదు.
పోలీసుల ‘చెక్‌పోస్టు’ దొరికిందోచ్
Published Thu, Dec 18 2014 3:42 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement