- కొల్లాపూర్‌లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి
- సబ్‌రిజిస్ట్రార్ కుర్చీ పక్కన చెత్తబుట్టలో రూ.10వేల నగదు స్వాధీనం
- రికార్డులు పరిశీలించిన అధికారులు.. కేసు నమోదు
కొల్లాపూర్: ఏసీబీ దాడులతో కొందరు అధికారులకు దడ పు ట్టింది. కొల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవా రం సాయంత్రం ఏసీబీ అధికారుల బృందం ఆకస్మికంగా త నిఖీలు నిర్వహించింది. ఏసీబీ డీఎస్పీ టి.రాందాస్‌తేజ నేతృత్వంలో రెండుగంటల పాటు ఈ సోదాలు కొనసాగించారు. ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న బి.నవీన్‌కుమార్ వద్ద రూ.630తో పాటు ఆయన కుర్చీ పక్కనే ఉన్న చెత్తబుట్టిలో పడేసిన రూ.10,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం కార్యాలయ రికార్డులు పరిశీలించారు. అక్కడే విధుల్లో ఉన్న పలువురి నుంచి వివరాలు సేకరిం చారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాందాస్‌తేజ విలేకరులతో మాట్లాడారు. తాము కార్యాలయంలోకి వస్తుండగానే త మను చూసి సబ్‌రిజిస్ట్రార్ నవీన్‌కుమార్ రూ.10,600 నగదు ను చెత్తబుట్టిలో పడేశారని తెలిపారు. ఆ డబ్బులను స్వా దీనం చేసుకున్నామని చెప్పారు.
నవీన్‌కుమార్ జేబులో రూ. 630 ఉన్నాయని, కార్యాలయ రిజిస్ట్రేషన్ల ఫీజులకు సంబంధించిన చలాన్లు లభించాయని వివరించారు. దొరికిన నగదు లెక్కలు తేలడం లేదన్నారు. కేసు నమోదుచేసి విచారిస్తున్నామని తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు తిరుపతిరాజు, గోవిందరెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.