దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ గత అక్టోబర్ నెలలో దేశంలో అత్యధిక వాహనాలు విక్రయించిన ఆటోమేకర్ టైటిల్‌ను సంపాదించింది. ఆ నెలలో 2,20,894 యూనిట్ల డిస్పాచ్తో అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది.
పండుగ సీజన్లో బలమైన డిమాండ్, బ్రాండ్ కాంపాక్ట్ కార్లు, యుటిలిటీ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి కారణంగా అమ్మకాల పనితీరు పెరిగింది. దేశీయ అమ్మకాలు 180,675 యూనిట్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇందులో ప్యాసింజర్, లైట్ కమర్షియల్ వాహనాలు రెండూ ఉన్నాయి. కంపెనీ ఇతర ఓఈఎంలకు 8,915 యూనిట్లను పంపిణీ చేయగా, ఎగుమతులు 31,304 యూనిట్లు.
దేశీయ ప్యాసింజర్ వాహనాల విభాగంలో, మారుతి సుజుకి అక్టోబర్లో 176,318 యూనిట్లను విక్రయించింది. బాలెనో, స్విఫ్ట్, వేగనార్, డిజైర్, సెలెరియో, ఇగ్నిస్ వంటి మోడళ్లను కలిగి ఉన్న కాంపాక్ట్ కార్ శ్రేణి గణనీయమైన అమ్మకాలను పెంచింది. 76,143 యూనిట్ల అమ్మకాలతో ఇది చిన్న-కార్ల రంగంలో బలమైన డిమాండ్ను సూచిస్తోంది. ఇక ఆల్టో, ఎస్-ప్రెస్సోలను కలిగి ఉన్న మినీ విభాగంలో 9,067 యూనిట్లు అమ్ముడయ్యాయి.
బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, విక్టోరిస్, ఎక్స్ఎల్6 వంటి మోడళ్లు సమిష్టిగా 77,571 యూనిట్లను అందించడంతో కంపెనీ యుటిలిటీ వెహికల్ లైనప్ గణనీయమైన వృద్ధి చోదకంగా కొనసాగింది. ఈకో వ్యాన్ నెలవారీ మొత్తానికి 13,537 యూనిట్లను జోడించగా, సూపర్ క్యారీ లైట్ కమర్షియల్ వెహికల్ మరో 4,357 యూనిట్లను అందించింది.


