Monthly sales
-
టీవీఎస్ రికార్డ్.. 4.89 లక్షల వాహనాలు అమ్మేసింది!
ముంబై: టీవీఎస్ మోటార్ కంపెనీ విక్రయాలు అక్టోబర్‌లో రికార్డు గరిష్టానికి చేరాయి. గత నెలలో మొత్తం అమ్మకాలు 4.89 లక్షలుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇదే ఇప్పటి వరకు అత్యధికం.కిందటేడాది ఇదే నెలలో డీలర్లకు పంపిణీ చేసిన 4.34 లక్షల వాహనాలతో పోలిస్తే ఇవి 13% అధికం. మొత్తం ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్లు 14% వృద్ధితో 4,20,610 నుంచి 4,78,159 నుంచి చేరాయి. ఇందులో మోటార్‌సైకిల్ విక్రయాలు 14% 2,30,822 యూనిట్లకు చేరగా, స్కూటర్ల అమ్మకాలు 17% పుంజుకొని 1,93,439 యూనిట్లకు చేరాయి.ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 45% పుంజుకొని 20,153 యూనిట్ల నుంచి 29,308 యూనిట్లకు చేరాయి. అయితే త్రిచక్ర వాహన అమ్మకాలు 23% తగ్గి 10,856 యూనిట్లకు దిగివచ్చాయి. గతేడాది ఇదే అక్టోబర్‌లో 14,104 వాహనాలు అమ్ముడయ్యాయి. ఎగుమతులు 9% వృద్ధితో 87,952 నుంచి 95,708 యూనిట్లకు చేరాయి. -
జోరు తగ్గని రాయల్ ఎన్ఫీల్డ్: 2023 ఫిబ్రవరి అమ్మకాలు ఇలా..
ఫిబ్రవరి 2023 ముగియడంతో రాయల్ ఎన్ఫీల్డ్ తమ అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం గత నెల 71,544 యూనిట్లు (దేశీయ అమ్మకాలు, ఎగుమతులు) విక్రయించినట్లు తెలిసింది. నివేదికల ప్రకారం రాయల్ ఎన్ఫీల్డ్ గత నెలలో 350సీసీ విభాగంలో హంటర్, బుల్లెట్, క్లాసిక్, మీటియోర్ వంటి మోడల్స్ మాత్రమే కాకుండా హిమాలయన్, స్క్రామ్ 411, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 వంటి మోడల్స్‌ని కూడా విరివిగా విక్రయించింది. 2022 ఫిబ్రవరితో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 20.93 శాతం పెరిగాయి. కంపెనీ అమ్మకాలు భారీగా పెరగటానికి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 చాలా సహకరించింది. ఈ మోడల్ కేవలం ఆరు నెలల్లో ఏకంగా లక్ష యూనిట్లు అమ్ముడైంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో దీనికున్న డిమాండ్ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మోడల్ తరువాత క్లాసిక్ 350 ఎక్కువ అమ్మకాలు పొందింది. రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం అమ్మకాలలో దేశీయ అమమకాలు 64,436 యూనిట్లు కాగా. ఫిబ్రవరి 2022తో పోలిస్తే దేశీయ అమ్మకాలు కూడా 23.59 శాతం పెరిగాయి. ఎగుమతుల విషయానికి వస్తే, కంపెనీ గత నెలలో 7,044 యూనిట్లను ఎగుమతి చేసింది. గత సంవత్సరం ఇదే నెలలో కంపెనీ 7,025 యూనిట్లను విక్రయించింది. ఎగుమతుల్లో కూడా 0.91 శాతం పెరుగుదల ఉంది.