పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి రైతులకు అడ్తిదారులు చెక్కులు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. నగదు రూపంలో ఇవ్వకుండా చెక్కులు, ఆన్‌లైన్ చెల్లింపులు జరపడంతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందంటూ మార్కెట్ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో కొంత సేపు కొనుగోళ్లు నిలిచిపోయారుు. పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో చాలాకాలం తర్వాత రైతులు మార్కెట్‌కు సరుకులను తీసుకొస్తున్నారు. మార్కెట్‌కు సరుకులను తీసుకొచ్చిన రైతులకు నగదు రూపంలో ఇవ్వకుండా చెక్కులు, ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరపాలని మార్కెట్ కమిటీ నిర్ణరుుంచింది. దీంతో కొంతమంది రైతులు గేటుకు తాళం వేసే ప్రయత్నించగా, వారిని చైర్మన్ అడ్డుకుని నచ్చజెప్పారు. ధర విషయంలో కూడా అత్యధికంగా రూ. 5,100లతో కొనుగోళ్లు చేరుుంచారు.