విజయవాడలో ఆహార భద్రతా శాఖ తనిఖీలు
Published Mon, Feb 15 2016 12:40 PM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
విజయవాడ: ప్రజల ఆరోగ్యం ప్రభుత్వాలకు పట్టదా.. అని హైకోర్టు రెండు తెలుగు రాష్ట్రాలకు మొట్టికాయలు వేయడంతో అప్రమత్తమైన అధికారులు పండ్ల మార్కెట్‌లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కార్బైట్ సాయంతో పండిన పండ్లను తినడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పదే అవకాశం ఉన్నందున ఈ విషయం పై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించడంతో.. రంగంలోకి దిగిన భారతీయ ఆహార భద్రతా శాఖ అధికారులు సోమవారం విజయవాడలోని కేదారేశ్వరి నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా కార్బైట్ సాయంతో పండ్లను మగ్గపెడుతున్న ఓ షాపును సీజ్ చేశారు. శాఖ డెరైక్టర్ మంజరి ఆధ్వర్యంలో 15 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ల బృందం తనిఖీలు కొనసాగిస్తోంది.
Advertisement
Advertisement