‘పీజీ’ కౌన్సెలింగ్‌పై హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ వెల్లడి
హైదరాబాద్: వెబ్ కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించిన 145 ఇంజనీరింగ్ పీజీ కాలేజీల్లోనూ తనిఖీలు నిర్వహించి, నిబంధనల మేర సౌకర్యాలు ఉన్నాయో లేదో తేలుస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దాంతోపాటు లోపాలున్న 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కాలేజీలు తమ నోటీసులకు సమాధానమిచ్చాయని, ఆ సమాచారాన్ని క్రోడీకరించడంతో పాటు ఈ కాలేజీలను కూడా తనిఖీ చేస్తామని విన్నవిం చింది. అనంతరం ఈ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదికలను కోర్టు ముందు ఉంచుతామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇం దుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన కోర్టు విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా జేఎన్‌టీయూహెచ్ అఫిలియేషన్ నిరాకరించిన కాలేజీల ను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలంటూ గత నెల 4న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జేఎన్‌టీయూహెచ్ ఈ ఉత్తర్వులను స వాలు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని ధర్మాసనానికి అప్పీలు చేసింది. ఈ నేపథ్యంలో కాలేజీల వ్యాజ్యాలపై తుది విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి.. వాటిని గురువారం మరోసారి విచారించారు. పిటిషనర్లు, జేఎన్‌టీయూ తరఫున ఏజీ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ గుర్తించిన లోపాలను ఆయా కాలేజీలు సరిదిద్దుకున్నాయా? లేదా? అన్న అంశానికే కోర్టు తన విచారణను పరిమితం చేసేందు కు ఇరుపక్షాలూ అంగీకరించాయి. లోపాలున్న ట్లు చెబుతున్న 127 ఇంజనీరింగ్, 40 ఫార్మసీ కా లేజీలతో పాటు వెబ్ కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించిన 145 పీజీ కాలేజీల్లోనూ తనిఖీలు నిర్వహించి, నివేదిక సమర్పిస్తామని ఏజీ కోర్టుకు హామీ ఇచ్చారు. నాలుగు వారాల గడువుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేశారు.
అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ తనిఖీలు
Published Fri, Oct 17 2014 2:20 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement
Advertisement