రాష్ట్రంలోని అన్ని వైద్యవిద్య కాలేజీల్లోని ఏ కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం రెండో దశ వెబ్ కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇక వైద్య సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు ఇటీవలి తీర్పు ప్రకారం.. తొలిదశ కౌన్సెలింగ్‌లో మైనారిటీ కాలేజీల్లోని బీ కేటగిరీ సీటు పొంది, అడ్మిషన్ తీసుకోకుండా ఖాళీగా ఉంటే.. ఆ సీట్లను తాజా కౌన్సెలింగ్‌లో ఏ కేటగిరీలోకి మార్చుతున్నట్లు తెలిపింది.