సాక్షి, విశాఖపట్నం: మధురవాడలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం కోసం సోంత భవనం ఏర్పాటు చేస్తామన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి, మధ్యవర్తుల దోపిడిలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దళారీ వ్యవస్థ నిర్మూలించడానికి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఆన్‌లైన్ విధానం అమలు చేస్తామని తెలిపారు.
గతంలో మధురవాడ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసి తప్పుడు ఆరోపణలు చేశాయని, అందుకే తాను ఆకస్మిక తనిఖీకి వచ్చానని పిల్లి సుభాష్ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఏసీబీ దాడులపై సబ్ రిజిస్టర్ సిబ్బందితో ఆయన చర్చించినట్లు చెప్పారు. కాగా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ తారకేష్ పనితీరు బాగుందని, రిజిస్ట్రేషన్‌లలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ తారకేష్‌ను ఆయన అభినందించారు. రిజిస్ట్రేషన్‌లపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఈ ప్రాంతం దేశంలోనే రెండో ఆర్ధిక రాజధానిగా ఎదగడానికి అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment