పోలీసు కుటుంబాలకు భద్రత చెక్కుల పంపిణీ | checks distribution ot police families | Sakshi
Sakshi News home page

పోలీసు కుటుంబాలకు భద్రత చెక్కుల పంపిణీ

Published Sat, Dec 17 2016 9:37 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

బాధిత కుటుంబాలకు భోజనం వడ్డిస్తున్న ఎస్పీ, కమాండెంట్‌ - Sakshi

బాధిత కుటుంబాలకు భోజనం వడ్డిస్తున్న ఎస్పీ, కమాండెంట్‌

కర్నూలు : విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు ఎస్పీ ఆకే రవికృష్ణ చేతుల మీదుగా భద్రతా చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం బాధిత కుటుంబాలకు విందు వడ్డించి ఆయన సహపంక్తి భోజనం చేశారు. ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో శనివారం ఉదయం భద్రత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏఆర్‌పీసీ వై.ఎస్‌.మహేష్‌కుమార్, భార్య చందనకి రూ.7,99,580, పీసీ శ్రీనివాసరాజు భార్య అశ్వినికి రూ.4 లక్షలు, ఏఎస్‌ఐ ఎం.డి.యూసుఫ్‌ భార్య ముస్తాని బేగంకు రూ.3,98,845, హెడ్‌ కానిస్టేబుళ్లు రమణమూర్తి భార్య ఈశ్వరికి రూ.3,98,530, ఎ.వి.ఎస్‌.రఘుకుమార్‌ భార్య శ్రీలక్ష్మికి రూ.3,91,303, పదవీ విరమణ పొందిన ఎస్‌ఐ రామకృష్ణయ్యకి రూ.94,407 భద్రతా చెక్కులను ఎస్పీ అందజేశారు. అనంతరం వారి కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ రెండో పటాలం కమాండెంట్‌ విజయకుమార్, ఓఎస్‌డీ రవిప్రకాష్, జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి అబ్దుల్‌ సలాం, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు టి.నారాయణ, భద్రతా క్లర్కు పి.నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement