ఎర్రచందనం స్వాధీనం ఆరుగురి అరెస్ట్
సుమో, రెండు బైక్‌లు స్వాధీనం
బి.కొత్తకోట: ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న టాటా సుమోతో పాటు రెండు బైక్‌లను పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలు తీసుకుని వెళుతున్న ఆరుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ బీవీ.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మండలంలోని అమరనారాయణపురం వద్ద జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా నంబూలపూలకుంట నుంచి వచ్చిన టాటాసుమోను తనిఖీ చేయగా మూడు ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయన్నారు. ఘటనా స్థలం లో ఆరుగురు పట్టుబడగా, మరో ఆరుగురు పరారయ్యారని తెలిపారు.
సుమోలోని 234 కిలోల మూడు దుంగలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దుంగలు తరలిస్తున్న వారిలో మదనపల్లె పట్టణం బోయవీధికి చెందిన ఎంవీ.నాగరాజు(30), వైఎస్‌ఆర్‌జిల్లా రాయచోటి ఎస్‌ఎన్‌కాలనీకి చెందిన కే.శ్రీనివాసులు (34), రెడ్డీస్‌కాలనీకి చెందిన పీ.రెడ్డికిషోర్(23), బి.కొత్తకోట మండలం బూదలవారిపల్లెకు చెందిన ఎం.వెంకటనరుసు (20), ఎన్.సురేష్(28) అమరనారాయణపురానికి చెందిన ఎస్.బషీర్(58)ను అరెస్ట్ చేశామని చెప్పారు. దుంగల విలువ రూ. 4. 68 లక్షలు, వాహనాల విలువ రూ.3 లక్షలుగా లెక్కించారు. ఈ కేసులో గుర్రంకొండ మండలం కలూరివారిపల్లెకు చెం దిన ఎస్.చంద్రశేఖరనాయుడు, ములకలచెరువు మండలం చింతరేవులపల్లెకు చెందిన కే.వెంకటేష్, తంబళ్లపల్లెకు చెందిన ఎం.చంద్రశేఖర్, కర్ణాటకలోని కటికహళ్లికి చెందిన సలీం పరారీలో ఉన్నారని తెలిపారు. పట్టుబడిన నిందితులను కోర్టుకు హజరుపరిచినట్టు వివరించారు.
బుచ్చినాయుడుకండ్రిగలో
బుచ్చినాయుడుకండ్రిగ : బుచ్చినాయుడుకండ్రిగలోని పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం ఎర్రచందనం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. 14మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఈశ్వరయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బుచ్చినాయుడుకండ్రిగలోని పెట్రోల్ బంకు వద్ద వాహనాలను తనిఖీచేస్తుండగా 10 ఎర్రచందనం దుంగలు చెన్నైకు తరలిస్తున్న లారీ పట్టుబడిందని చెప్పారు. ఎర్రచందనం విలువ పది లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎర్రచందనం తరలిస్తున్న చెన్నైకు చెందిన 14మంది స్మగ్లర్లను అరెస్టు చేశామని తెలిపారు.