
డాక్టర్ రెడ్డీస్ ప్లాంటులో ఎఫ్‌డీఏ తనిఖీలు పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మిర్యాలగూడ ప్లాంటులో అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తనిఖీలు పూర్తయినట్లు ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్) వెల్లడించింది. మూడు సూచనలతో ఎఫ్‌డీఏ ఫారం 483ని జారీ చేసినట్లు తెలిపింది. ఇందులో పేర్కొ న్న అంశాల పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు డీఆర్‌ఎల్ వివరించింది.