హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాంటీ వైరల్ ఔషధం ‘వాల్‌సైట్’ జనరిక్ వెర్షన్‌కి అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ అనుమతి లభించినట్లు ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్‌ఎల్) తెలిపింది. దీంతో త్వరలో అమెరికా మార్కెట్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఎయిడ్స్ పేషంట్లలో సైటోమెగలోవైరస్ రెటినిటిస్ అనే కంటి సంబంధ సమస్యల చికిత్స కోసం ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం రోషె హోల్డింగ్ సంస్థ వాల్‌సైట్‌ను తయారు చేస్తోంది.
దీని జనరిక్ వెర్షన్ తయారీ కోసం మరో భారతీయ ఫార్మా సంస్థ రాన్‌బ్యాక్సీకి సూత్రప్రాయంగా అనుమతులు ఇచ్చినా, ఆ కంపెనీ ప్లాంట్లలో నాణ్యతాపరమైన ప్రమాణాలు లేవన్న కారణంగా అనుమతులను ఎఫ్‌డీఏ రద్దు చేసింది. వాల్‌సైట్ ఔషధ మార్కెట్ పరిమాణం దాదాపు రూ. 3,000 కోట్లు ఉంది. దీని తయారీతో డీఆర్‌ఎల్ ఆదాయానికి మరో రూ. 200 కోట్లు జతకాగలవని అంచనా.
డాక్టర్ రెడ్డీస్ ‘వాల్‌సైట్’కి ఎఫ్‌డీఏ అనుమతులు
Published Sat, Nov 8 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:02 PM
Advertisement