
నిరంతరం నిర్బంధ తనిఖీలు
నేరాల నియంత్రణ కోసం నిరంతరం నిర్బంధ తనిఖీలు కొనసాగిస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు.
కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి
కరీంనగర్ క్రైం : నేరాల నియంత్రణ కోసం నిరంతరం నిర్బంధ తనిఖీలు కొనసాగిస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్ శివారులోని కిసాన్‌నగర్, పసుల నారాయణకాలనీల్లో గురువారం ఉద యం కార్డెన్‌సెర్చ్ నిర్వహించారు. అనంతరం సీపీ కాలనీవాసులతో మాట్లాడారు. అసాంఘిక శక్తుల కదలికల నియంత్రణకు, అక్రమ కార్యకలాపాల అడ్డుకట్ట వేసేందుకు కార్డెన్‌సెర్చ్‌లు చేపడుతున్నట్లు చెప్పారు. శివారు ప్రాంతాల్లోనే కాకుండా ఇక ముందు ప్రతి అనుమానిత పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ తరహా తనిఖీలు చేపడతామన్నారు. నూతనంగా అద్దెకు వస్తున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని గ్రామ పోలీస్ అధికారులు(వీపీవో)లను ఆదేశించారు. వాహనాలు కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నప్పటి నుంచి అనుమానితుల కదలికలు తగ్గాయని, ఇలాంటి తనిఖీలు కొనసాగించాని కాలనీవాసులు సీపీని కోరారు. సాయంత్రం వేళల్లో ముఖ్య కూడళ్ల వద్ద కొందరు ఆకతారుులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీపీ ఇప్పటి నుంచే ఈ ప్రాంతంలో ప్రత్యేక గస్తీతో పాటు షీటీం బృందాలను రంగంలోకి దింపుతున్నట్లు తెలిపారు.
ఈ కార్డెన్‌సెర్చ్‌లో సరైన ధ్రువీకరణపత్రాలు లేని 36 ద్విచక్రవాహనాలు, ఒక కారు, ఒక ట్రాక్టర్, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న జంటను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో అటువైపుగా వచ్చిన దొంగ పో లీసులను చూసి తన వాహనం వదిలి పరారయ్యాడు. దొంగను పట్టుకునేందుకు రెండు బృందాలు రంగంలోకి దిగారుు. ఈ తనిఖీల్లో కరీంనగర్ ఏసీపీ రామారావు, ఇన్‌స్పెక్టర్లు సదానందం, హరిప్రసాద్, కృష్ణగౌడ్, లక్ష్మిబాబు, ఎస్సైలు తిరుమల్, వెంకటేశ్వర్లు, నరేశ్, రవీందర్‌నారుుడు, నాగన్నతోపాటు మరో ఆరుగురు ఎస్సైలు, ఏఎస్సైలు, హెచ్‌సీలు, పీసీలు, మహిళ పోలీసులు, ఏఆర్ సిబ్బంది, డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్ మొత్తం 200 మంది పోలీసులు పాల్గొన్నారు.