సాక్షి, ఏలూరు : జిల్లా పరిషత్, మండల పరి షత్ ఎన్నికల మలిపోరు శుక్రవారం జరగనుంది. 24 జెడ్పీటీసీ, 452 ఎంపీటీసీ స్థానాల్లో ఓటరు తీర్పు కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. తొలి విడత పోలింగ్‌లో ఎదురైన అవాం ఛనీయ ఘటనలు ఈసారి తలెత్తకుండా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నరసాపురం, కొవ్వూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 24 మండలాల్లో శుక్రవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
జెడ్పీటీసీ అభ్యర్థులు 87మంది, ఎంపీటీసీ అభ్యర్థులు 1,180 మం ది పోటీపడుతున్నారు. 11,67,231మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగిం చుకోవాల్సి ఉంది .686 ప్రాంతాల్లో 1,434 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు 9వేల 414 మంది సిబ్బంది గురువారం ఆయా ప్రాంతాలకు వెళ్లారు. బ్యాలెట్ పేపర్లు, ఇంక్ బాటిళ్లు, స్వస్తిక్ గుర్తులు, ఇతర పరికరాలు వెంటబెట్టుకెళ్లారు. 451 సమస్యాత్మక, 315 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 2,275 మంది పోలీసులతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
అక్రమాలను అరికట్టేందుకు రహస్య నిఘా
ఈ ఎన్నికల్లో నగదు, మద్యం, ఇతర ప్రలోభాలను నిరోధించేందుకు రహస్యంగా నిఘా వేసే బృందాలను కలెక్టర్ సిద్ధార్థజైన్ రంగంలోకి దించారు. నిఘా బృందాల సభ్యులు సాధారణ జనంలా.. అవసరమైతే మారువేషాల్లో వెళ్లి అక్రమార్కుల భరతం పట్టాలని కలెక్టర్ సూచించారు. తమ వాహనాలను దూరంగా ఉంచి తనిఖీలు చేయాలని చెప్పారు. తొలి విడతలో జరిగిన లోటుపాట్లు దృష్టిలో ఉంచుకుని అలాంటివి మలి విడత పోలింగ్ ప్రక్రియలో చోటుచేసుకోకుండా చూడాలని పోలింగ్ యంత్రాంగానికి ఆయన సూచించారు.
పూర్తయిన పంపకాలు : అధికారుల తనిఖీలు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు ముందుగానే మేల్కొన్నారు. డబ్బు, మద్యం పంపిణీని పోలింగ్ ముందు రోజు రాత్రి ముమ్మరంగా చేయడం ఆనవాయితీ. కానీ ఈ సారి ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే సహించమని అధికారులు హెచ్చరికలు జారీచేయడంతో పాటు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీంతో రెండు రోజులు ముందునుంచే పంపకాలు ప్రారంభించారు. గురువారం ఉదయానికే చాలా చోట్ల పూర్తి చేశారు.
మలి పోరుకు రె‘ఢీ’
Published Fri, Apr 11 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM
Advertisement
Advertisement