రిజర్వేషన్లపై ఉత్కంఠ
సాక్షి, వరంగల్ రూరల్: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తుం దో లేదోననే టెన్షన్లో ఉన్నారు. త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నందున ఇప్పటికే గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కాయి. కొన్నిచో ట్ల విందు రాజకీయాలు కూడా ప్రారంభమయ్యా యి.రిజర్వేషన్లు ఖరారైతే మరింత వేగంగా పరి ణామాలు మారే అవకాశం ఉంది.
వరంగల్ రూరల్ జిల్లాలో 16 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గ్రామీణ ఓటర్లు 4,31,778 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 2,16,008 మంది, స్త్రీలు 2,15,770 మంది ఉన్నారు. బీసీలు 2,53,384 మంది, ఎస్టీలు 64,058 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 77,076 మంది, ఓసీలు 37,277 మంది ఉన్నారు.
2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం..
రిజర్వేషన్లు 2011 గ్రామీణ జనాభా లెక్కల ప్రకారం, నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని అనుసరిస్తూ ఖరారు చేయనున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర యూనిట్‌గా, జెడ్పీటీసీలకు జిల్లాను, ఎంపీటీసీలకు మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటారు. ఎంపీటీసీల రిజర్వేషన్లను ఎంపీడీఓలు తయారుచేస్తే కలెక్టర్ ఫైనల్ చేయనున్నారు.
రాష్ట్రం, జిల్లా, మండల యూనిట్‌గా రిజర్వేషన్ల కేటాయింపుల్లో ముందుగా ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. తొలుత ఎస్సీలకు, తరువాత ఎస్టీలకు రిజర్వేషన్లను కేటాయించి మిగిలినవి బీసీలకు కేటాయిస్తారు. తర్వాత జనరల్ స్థానాలను ప్రకటిస్తారు. జిల్లా నుంచి నేడు(మంగళవారం) రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో అధికారులు రిజర్వేషన్ల ప్రకటనల కోసం తర్జనబర్జన అవుతున్నారు.
మండలం
ఎంపీటీసీ స్థానాలు
ఆత్మకూరు
09
చెన్నారావుపేట
11
దామెర
08
దుగ్గొండి
12
గీసుకొండ
09
ఖానాపురం
09
నడికూడ
10
నల్లబెల్లి
11
నర్సంపేట
11
నెక్కొండ
16
పరకాల
05
పర్వతగిరి
14
రాయపర్తి
16
సంగెం
14
శాయంపేట
12
వర్దన్నపేట
11
మొత్తం
178
తమకు అనుకులంగా కావాలని..
జెడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు తమకు అనుకులంగా వచ్చే విధంగా చేయాలని ఇప్పటికే ఆశావహులు ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జిల్లా, మండల నాయకుల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అనుకులంగా రిజర్వేషన్ తీసుకవస్తే గెలుపించుకుని వస్తామని జిల్లా, మండల నాయకులు ఆఫర్లు సైతం ఇస్తున్నారు. పార్టీ ఫండ్ సైతం ఏమీ లేకుండానే స్వంత డబ్బులు పెట్టుకుని గెలుస్తాడని హామీలు ఇస్తున్నారు.
ఎంపీలు, శాసన సభ్యులు సైతం గ్రామంలో బలమైన నాయకులకు అనుగుణంగా రిజర్వేషన్ వచ్చే విధంగా పావులు కదుపుతున్నారని సమాచారం. బలమైన నాయకుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అయితే పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్తారని అధికార పార్టీ నేతలు రిజర్వేషన్లు అనుకులంగా ఉండే విధంగా చూస్తున్నారని తెలుస్తోంది.