అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు
Published Thu, Feb 16 2017 11:15 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM
పంచలింగాల, తాండ్రపాడు ఇసుక రీచ్‌లను పరిశీలించిన ఎస్పీ
కర్నూలు: ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆకే రవికృష్ణ హెచ్చరించారు. అనుమతి లేని రీచ్‌ల నుంచి ఇసుకను తరలిస్తే వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామన్నారు. గురువారం ఉదయం కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని పంచలింగాల, తాండ్రపాడు గ్రామాల్లో ఇసుక రీచ్‌లు, పోలీస్ పికెట్ చెక్ పోస్టులను ఎస్పీ తనిఖీ చేశారు. అనుమతి లేని ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుకను తరలించేవారి వాహనాలను సీజ్ చేసి యజమానులపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామన్నారు. ఇసుకను డంప్‌లుగా దాచిపెట్టినా ఆ ఇసుకను ప్రభుత్వం సీజ్ చేసి తీసుకెళ్తుందన్నారు. సరిహద్దు చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేశామన్నారు. చెక్‌పోస్టులలో పకడ్బందీగా విధులు నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీఐ నాగరాజు యాదవ్, ఎస్‌ఐ గిరిబాబు తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు.
పోలీస్ కుటుంబాలకు కార్పస్ ఫండ్ చెక్కులు పంపిణీ
విధి నిర్వహణలో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు గురువారం స్థానిక కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎస్పీ ఆకే రవికృష్ణ కార్పస్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఏఆర్‌ఎస్‌ఐ స్వామిరెడ్డి కూతురు స్వాతి, ఏఎస్‌ఐ రఘుకుమార్ భార్య శ్రీలక్ష్మీ, హెడ్ కానిస్టేబుల్ రమణమూర్తి భార్య ఈశ్వరి, కానిస్టేబుల్ ప్రవీణ్‌కుమార్ భార్య రాణమ్మ, ఏఎస్‌ఐ మోహన్‌రావు భార్య అన్నమ్మ, కానిస్టేబుల్ రాముడు భార్య శిరీష, శ్రీనివాసరాజు భార్య అశ్విని, ఏఎస్‌ఐ యూనుస్ భార్య ముస్తారి బేగం, ఏఆర్‌పీసీ విజయకుమార్ భార్య పద్మావతి తదితరులకు ఒక్కొక్కరికి రూ.40 వేల కార్పస్ ఫండ్ చెక్కును ఎస్పీ ఆకే రవికృష్ణ పంపిణీ చేశారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, బి–సెక్షన్ సూపరింటెండెంట్ కుమారి వి.దేవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement