తిరుపతి: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లురు మండలం తానా చెక్ పోస్టుపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఆ చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఉద్యోగులు, కొందరు అనుమానితులను తనిఖీ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చెక్ పోస్ట్ వద్ద అనధికారికంగా ఉన్న రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.