డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో సోమవారం మంచు చరియలు విరిగిపడి ఆర్మీ చెక్‌పోస్టు ధ్వంసం కావడంతో ఇద్దరు జవాన్లు మరణించగా మరొక రు గల్లంతయ్యారు. ఇండో చైనా బోర్డర్‌లోని సియాలక్ చెక్ పోస్టులో ఎనిమిది మంది సైనికులు విధులు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు కలెక్టర్ డీఎమ్ సుశీల్ కుమార్ తెలిపారు. గల్లంతైన జవాన్ కోసం గాలిస్తున్నామన్నారు. గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్ కొండల్లో భారీ వర్షాలతో పాటు ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తోంది.
చెక్‌పోస్టుపై విరిగిపడిన మంచు చరియలు
Published Wed, Mar 4 2015 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM
Advertisement
Advertisement