
గోపేశ్వర్: ఉత్తరాఖండ్‌లో మరోసారి హిమానీనద ఉత్పాతం బీభత్సం సృష్టించింది. చమోలీ జిల్లాలోని సుమ్నా ప్రాంతం నీతి వ్యాలీలో మంచు చరియలు విరిగిపడి ధౌలి గంగ ఉప్పొంగడంతో పది మంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌ఒ) సిబ్బంది మరణించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 31 మంది ఆచూకీ తెలియడం లేదు. భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో పని చేస్తుండగా ఒక్కసారిగా భారీ వరద వారిని ముంచేసిందని అధికారులు వెల్లడించారు.
మంచు చరియలు విరిగిపడినప్పుడు బీఆర్‌ఓకు చెందిన 430 మంది వర్కర్లు సుమ్నా రిమ్‌ఖుమ్ రహదారి పనుల్లో నిమగ్నమై ఉన్నట్టుగా ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. 430 కార్మికుల్లో ఆర్మీ 400 మందిని రక్షించింది. శుక్రవారం రాత్రి రెండు మృతదేహాలు లభ్యమైతే, ఆదివారం ఉదయం మరో ఆరుగురి మృతదేహాలను సహాయ సిబ్బంది కనుగొన్నారు. క్షతగాత్రులను హెలికాఫ్టర్ ద్వారా జోషి మఠ్‌లో ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఫిబ్రవరిలో చమోలీలోనే భారీగా మంచు చరియలు విరిగిపడడంతో 80 మంది మరణించారు. మరో 126 మంది గల్లంతైన విషయం తెలిసిందే.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment