chamoli
-
Badrinath Highway: విరిగిపడిన కొండచరియలు.. తృటిలో తప్పించుకున్న కార్మికులు
ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌లో దేవుడుని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులకు కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలు, వరదలతో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. రోడ్లు, రహాదారులను అధికారులు ముందు జాగ్రత్తగా మూసేస్తున్నారు. దీంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.చమోలీ జిల్లాలో బద్రీనాథ్ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారిపై ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. దీంతో భయభ్రాంతులకు గురైన అక్కడి ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.హైవేపై కొండచరియలు విరిగిపడటంతో శిథిలాక కారణంగా రహదారిని అధికారులు మూసివేశారు. సుమారు 48 గంటల పాటు ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.కాగా బద్రీనాథ్ హైవేను తిరిగి తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రహదారిపై పడిన శిథిలాలను కార్మికులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం కార్మికులు పనిచేస్తుండగా పర్వతం నుంచి ఒక్కసారిగా బండరాళ్లు కిందపడ్డాయి. అయితే ఈ ప్రమాదం నుంచి కార్మికులు తృటిలో తప్పించుకున్నారు. రాళ్లు జారడం చూసిన కార్మికులు కొండపైకి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.ఇక బద్రీనాథ్ జాతీయ రహదారి మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రహదారిని క్లియర్ చేసేందుకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జోషిమఠ్ వద్ద రహదారిని క్లియర్ చేసేందుకు సుమారు 241 ఎక్స్కవేటర్లను అక్కడ మోహరించారు. ఉత్తరాఖండ్‌లో వర్షం, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 260కి పైగా రోడ్లు మూసేశారు. . రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా ఛార్‌దామ్ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఉత్తరాఖండ్: కరెంట్ షాక్‌తో 16 మంది దుర్మరణం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోరం జరిగింది. అలకనంద నది Alaknanda River చమోలి డ్యామ్ దగ్గర ట్రాన్స్‌ఫారమ్ పేలిన ఘటనలో పదహారు మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో పోలీసు సిబ్బంది.. ముగ్గురు హోంగార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ పేలి.. బ్రిడ్జి గుండా కరెంట్ పాస్ అయ్యింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్నవాళ్లకు కరెంట్ షాక్ తగిలింది. కొందరు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడగా.. వాళ్లను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్పీ పరమేంద్ర దోవల్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనంద నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. Uttarakhand | 10 people died and several injured after a transformer exploded on the banks of the Alaknanda River in the Chamoli district. Injured have been admitted to the district hospital: SP Chamoli Parmendra Doval — ANI (@ANI) July 19, 2023 -
700 మీటర్ల లోయలో పడిపోయిన టాటా సుమో.. 12 మంది దుర్మరణం..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమో అదుపు తప్పి 700 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులోని మొత్తం 12 మంది మరణించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను లోయ నుంచి పైకి తీసుకువచ్చారు. ఈ వాహనం జోషిమఠ్ నుంచి కిమాన గ్రామం వెళ్లే సమయంలో పల్ల జఖోల్ వద్ద ప్రమాదానికి గురైంది. 12 మంది మృతుల్లో 10 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. లోయ 700 మీటర్ల లోతు ఉండటంతో టాటా సుమో ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ప్రయాణికుల మృతదేహాలు చల్లాచెదురుగా పడి ఉన్నాయి. సీఎం దిగ్భ్రాంతి.. ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. #Chamoli: जोशीमठ के पास हुए सड़क हादसे में कई लोगों की मौत, घटनास्थल का वीडियो आया सामने।#Uttarakhand #ViralVideo #UserGenerated pic.twitter.com/RWeWDgPWaA — News Tak (@newstakofficial) November 18, 2022 #उत्तराखंड - चमोली में गहरी खाई में गिरा वाहन, 12 लोगों की गई जान, 10 पुरुष और 2 महिलाओं की हुई मौत. #Uttrakhand #RoadAccident #Chamoli pic.twitter.com/AXS0RP8w8S — TheuttarpradeshNews.com (@TheUPNews) November 18, 2022 చదవండి: యూపీలో దారుణం.. యువకుడ్ని చితకబాది మొహంపై మూత్ర విసర్జన.. -
‘భారత్ చిట్టచివరి దుకాణం’ ఏదో తెలుసా? ఎందుకీ పేరు?
సాధారణంగా చాలా విషయాల్లో.. మొదటిదానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో చిట్ట చివరి దానికీ అంతే ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ప్రాంతాల విషయంలో ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ దుకాణం కూడా అంతే ప్రత్యేకమైనది. చిత్రంలోని కొట్టు పేరు భారత్ చిట్టచివరి దుకాణం (హిందుస్థాన్ కీ అంతిమ్ దుకాణ్). పేరేంటి అలా ఉంది అనుకుంటున్నారా? పేరులోనే ఉంది కథంతా. ఏంటంటే.. ఈ షాప్ భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలోని భారత్ భూభాగమైన ఉత్తరాఖండ్‌లోని... చమోలీ జిల్లాలో ఉంది. ఇదో టీ స్టాల్. దీన్ని చందేర్ సింగ్ బద్వాల్ అనే వ్యాపారి నడుపుతున్నాడు. ఆ గ్రామంలో మొట్ట మొదటి టీ షాపు ఇదే. 25 ఏళ్ల కిందట దీన్ని ప్రారంభించారట. చిన్న షాపే. కానీ 3,118 మీటర్ల (10,229 అడుగులు) ఎత్తులో ఉంది. హిమాలయాల చెంత ఉన్న ఈ షాపు నుంచి చూస్తే అద్భుతమైన మంచు శిఖరాలు కనిపిస్తాయి. చైనా సరిహద్దుకి కొన్ని మీటర్ల దూరంలోనే ఈ షాపు ఉండటం విశేషం. అందుకే ఇక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ బద్వాల్ గారి టీ స్టాల్లో ఓ కప్పు చాయ్ కొట్టడంతో పాటు.. ఆ కొట్టు ముందర నిలబడి ఓ సెల్ఫీ కూడా దిగుతారు. చదవండి: సముద్రంలో తేలియాడే నగరం.. పంటలు కూడా.. ఎక్కడో తెలుసా? -
18 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన సీఈసీ
చమోలి: ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరోసారి ఆదర్శంగా నిలిచారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర చమోలీ జిల్లాలో కొండప్రాంతంలోని మారుమూల పోలింగ్ స్టేషన్‌కు ఆదివారం 18 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లారు. ‘సుదూరంగా ఉండే డుమాక్ గ్రామంలో ఈ పోలింగ్ స్టేషన్ ఉంది. ఎన్నికల సిబ్బందిని ఉత్సాహపరచాలన్నదే నా ఉద్దేశం. ఈ పోలింగ్ స్టేషన్‌కు ఎన్నికల సిబ్బంది పోలింగ్‌కు మూడురోజులు ముందుగానే చేరుకుంటారు’అని సీఈసీ ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మూకశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం సిబ్బందికి చాలా కష్టసాధ్యమైన విషయమని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో కూడా ఆయన పలు సందర్భాల్లో రహదారి సౌకర్యం లేని పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఆదర్శంగా నిలిచారు. -
చమోలీలో విరిగిపడిన కొండ చరియలు
-
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన మంచు చరియలు
గోపేశ్వర్: ఉత్తరాఖండ్‌లో మరోసారి హిమానీనద ఉత్పాతం బీభత్సం సృష్టించింది. చమోలీ జిల్లాలోని సుమ్నా ప్రాంతం నీతి వ్యాలీలో మంచు చరియలు విరిగిపడి ధౌలి గంగ ఉప్పొంగడంతో పది మంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఒ) సిబ్బంది మరణించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 31 మంది ఆచూకీ తెలియడం లేదు. భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో పని చేస్తుండగా ఒక్కసారిగా భారీ వరద వారిని ముంచేసిందని అధికారులు వెల్లడించారు. మంచు చరియలు విరిగిపడినప్పుడు బీఆర్ఓకు చెందిన 430 మంది వర్కర్లు సుమ్నా రిమ్ఖుమ్ రహదారి పనుల్లో నిమగ్నమై ఉన్నట్టుగా ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. 430 కార్మికుల్లో ఆర్మీ 400 మందిని రక్షించింది. శుక్రవారం రాత్రి రెండు మృతదేహాలు లభ్యమైతే, ఆదివారం ఉదయం మరో ఆరుగురి మృతదేహాలను సహాయ సిబ్బంది కనుగొన్నారు. క్షతగాత్రులను హెలికాఫ్టర్ ద్వారా జోషి మఠ్‌లో ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఫిబ్రవరిలో చమోలీలోనే భారీగా మంచు చరియలు విరిగిపడడంతో 80 మంది మరణించారు. మరో 126 మంది గల్లంతైన విషయం తెలిసిందే. చదవండి: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం -
ఉత్తరాఖండ్: మూడేళ్ల కొడుకును వదిలి
ప్రస్తుత కాలంలో మహిళలు అన్నిరంగాల్లో తమదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ధౌలిగంగా నది భారీ నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు కొంతమంది ప్రాణాలు కోల్పోగా ఎంతోమంది ఆచూకీ ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న అధికారుల్లో నలుగురు మహిళా అధికారులు ఎంతో నైపుణ్యంతో ముందుండి నడిపిస్తున్నారు. వీరిలో చమోలీ జిల్లా మెజిస్ట్రేట్ స్వాతి భడోరియా, ఐటీబీపీ డీఐజీ అపర్ణా కుమార్, గర్వాల్ రేంజ్ డీఐజీ నీరూ గార్గ్, ఎస్డీఆర్ డీఐజీ రిధిమ్ అగర్వాల్ ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకూ క్యాంపుల నిర్మాణం, బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి ఓదార్చడం, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, రెస్క్యూ ఆపరేషన్స్‌ను నిర్వహించడం, పునరావాస సామగ్రిని అందించడంలో ఈ నలుగురు అధికారులు ముందుండి ఎంతో సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఎక్కువ నష్టపోకుండా ఉండేందుకు వివిధ ఏజెన్సీలతో కలిసి శ్రమిస్తున్నారు. ఫిబ్రవరి 7న కొండచెరియలు విరిగి పడి నిర్మాణంలో ఉన్న డ్యామ్ కొట్టుకుపోయింది. ఈ డ్యామ్ వద్ద పనిచే స్తోన్న ఎంతోమంది కార్మికులను రక్షించేందుకు 2011 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన స్వాతి భడోరియా దుర్ఘటన జరిగిన రోజు నుంచే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మూడేళ్ల కుమారుడిని వదిలి ఈ విపత్తును ఎదుర్కోవడం పెద్ద సవాలే అయినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగామని స్వాతి భడోరియా చెప్పారు. ఎంతో మందిని సమన్వయ పరచడం, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, వివిధ రకాల అధికారులతో మాట్లాడడం, బాధిత కుంటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, సహాయ చర్యలను సమన్వయ పరచడం, విద్యుత్ సరఫరాను పునరుద్ధ్దరించడం, ఆహార ప్యాకెట్ల సరఫరా వంటి అనేక కార్యక్రమాలు చేపట్టామని ఆమె చెప్పారు. మొదటి మూడురోజులు తన మూడేళ్ల కుమారుడిని వదిలి తపోవన్‌లో క్యాంప్ వేసుకుని స్వాతి అక్కడే ఉన్నారు. తనతో మాట్లాడేందుకు సమయం లేదు 2005 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గర్వాల్ రేంజ్ డీఐజీ అయిన నీరూ గార్గ్ .. రెయినీ, తపోవన్ ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించే అనేక కార్యక్రమాలను ముందుండి నడిపించారు. ‘‘మేము వీలైనంత వరకు చేయగలిగిన సాయం చేస్తూ ఎక్కువ మందిని రక్షించేందుకు ప్రయత్నించాం’’ అని నీరూ చెప్పారు. తొమ్మిదేళ్ల తన కూతురు హరిద్వార్‌లో పరీక్షలు రాస్తోందని. ఆమెతో మాట్లాడేందుకు కూడా సమయం కేటాయించలేకపోయానని చెప్పారు. ముందుండి నడిపిస్తున్నారు 2002 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అపర్ణా కుమార్ ఐటీబీపీ టిమ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. 2005 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ రిధీమ్ అగర్వాల్ ఎస్డీఆర్ టీమ్‌కు డీఐజీగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు బృందాలు సమన్వయంతో కలిసి పనిచేయడంలో వీరిద్దరి పాత్రే కీలకం. ఎస్డీఆర్ఎఫ్ బృందం ప్రమాద స్థలానికి మొదటిగా చేరుకుందని, ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్‌లో ఎస్డీఆర్ఎఫ్ కీలకమైన పాత్ర పోషించిందని రిధిమ్ చెప్పారు. వీలైనంత ఎక్కువమందిని కాపాడేందుకు పాటుపడ్డామని, మిగతా ఏజెన్సీలతో కలిసి సమన్వయంతో పనిచేశామని చెప్పారు. చదవండి: 40 శవాల వెలికితీత.. ఇంకా దొరకని 164 మంది చదవండి: ఉత్తరాఖండ్ ముంగిట మరో ముప్పు -
ఉత్తరాఖండ్‌లో జల విలయం
డెహ్రాడూన్: హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకొని విలవిలలాడుతోంది. గంగా పరివాహక ప్రాంతాలు వరద ముప్పులో బిక్కుబిక్కుమంటున్నాయి. చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో నందాదేవి పర్వతం నుంచి హఠాత్తుగా మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది పోటెత్తింది. ఒక్కసారిగా రాళ్లు, మంచు ముక్కలతో కూడిన నీటి ప్రవాహం కిందకి విరుచుకుపడడంతో ధౌలిగంగ ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. దీంతో తపోవన్–రేణిలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 13.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. తపోవన్–విష్ణుగఢ్ ప్రాజెక్టు కూడా దెబ్బతిందని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. తపోవన్ వద్ద పనిచేస్తున్న 148 మంది, రిషిగంగ వద్ద 22 మంది మొత్తం 170 మంది కనిపించకుండా పోయినట్లు ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే చెప్పారు. కొన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగి సహాయ చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. నీళ్లలో మునిగిపోయిన ప్రాజెక్టు సొరంగ మార్గంలోకి ప్రాణాలకు తెగించి వెళ్లిన ఐటీబీపీ సిబ్బంది 16 మందిని కాపాడారు. మరో ఏడు మృతదేహాలను వెలికితీసినట్టుగా ఐటీబీపీ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోనికి వస్తున్నాయని సహాయ బృందాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య భారీగా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పొంగిపొరలుతున్న గంగా ఉపనదులు గంగా నదికి ఉపనదులైన ధౌలిగంగ, రిషి గంగ, అలకనందా పోటెత్తడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆందోళన నెలకొంది. పౌరి, తెహ్రి, రుద్రప్రయాగ, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాల్లోని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నింటినీ అధికారులు ఖాళీ చేయించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.‘‘చెవులు చిల్లులు పడేలా శబ్దం వినబడడంతో బయటకి వచ్చి చూశాం. ఎగువ నుంచి రాళ్లతో కూడిన నీటి ప్రవాహం అంతెత్తున ఎగిసిపడుతూ వస్తోంది. ధౌలిగంగా ఉగ్రరూపం, ఆ వేగం చూస్తే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. హెచ్చరించడానికి కూడా సమయం లేదు. నీటి ప్రవాహం పూర్తిగా ముంచేసింది. మేము కూడా కొట్టుకుపోతామనే భయపడ్డాం. దేవుడి దయ వల్ల బయట పడ్డాం’’అని సంజయ్ సింగ్ రాణా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఉత్తరాఖండ్ కోసం దేశం ప్రార్థిస్తోంది: ప్రధాని ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌తో మాట్లాడుతున్నానని తెలిపారు. దేశం యావత్తూ ఉత్తరాఖండ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. రూ. 4 లక్షల నష్టపరిహారం రిషిగంగ ప్రాజెక్టు టన్నెల్స్లోని నీటి ప్రవాహంలో చిక్కుకొని మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ సీఎం రావత్ రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో గంగా పరివాహక ప్రాంత గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వరద నీరు దిగువకి వస్తే సహాయ చర్యలపై యూపీ సర్కార్ చర్చించింది. రూ.2 లక్షల చొప్పున కేంద్ర పరిహారం ఉత్తరాఖండ్ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్(పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. క్షతగాత్రులకు 50వేల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సహాయక చర్యలు చేపట్టండి: సోనియా ఉత్తరాఖండ్ దుర్ఘటనలో గాయపడిన వారికి తక్షణమే సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, స్వచ్ఛంద సేవలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. మంచు చరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం సంభవించడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిగిలిన వారంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా సంతాపం తెలిపారు. నిలిచిపోయిన 200 మెగావాట్ల విద్యుత్ మంచు చరియలు విరిగిపడడంతో ముందు జాగ్రత్తగా ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, కోటేశ్వర్ హైడ్రో పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో 200 మెగావాట్ల కరెంటు గ్రిడ్‌కు అందలేదు. నేడు ఘటనా స్థలానికి గ్లేసియాలజిస్టులు మంచు చరియలు విరిగిపడడానికి గల కారణాలను అన్వేషించడానికి సోమవారం రెండు గ్లేసియాలజిస్టుల బృందాలు జోషీమఠ్–తపోవన్‌కు చేరుకోనున్నాయని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ తెలిపారు. రెట్టింపు వేగంతో కరుగుతున్న హిమాలయాలు హిమాలయాల్లో నందాదేవి మంచు చరియలు విరిగిపడి ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకోవడానికి కారణాలెన్ని ఉన్నప్పటికీ భారత్ సహా వివిధ దేశాలు మంచు ముప్పులో ఉన్నట్టుగా రెండేళ్ల క్రితమే ఒక అధ్యయనం హెచ్చరించింది. హిమాలయాల్లో మంచు రెట్టింపు వేగంతో కరిగిపోతున్నట్టుగా ఆ అధ్యయనం వెల్లడించింది. 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఏడాదికేడాది హిమాలయాల్లోని మంచు కొండలు నిట్టనిలువుగా ఒక అడుగు వరకు కరిగిపోతున్నట్టుగా 2019 జూన్‌లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అ«ధ్యయనాన్ని జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ ప్రచురించింది. 1975 నుంచి 2000 మధ్య కాలంలో కాస్త కాస్త కరిగే మంచు 2000 సంవత్సరం తర్వాత నిలువుగా ఉండే ఒక అడుగు మందం వరకు కరిగిపోతూ ఉండడంతో భవిష్యత్‌లో భారత్ సహా వివిధ దేశాలు జల ప్రళయాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆ అధ్యయనం హెచ్చరించింది. దాదాపుగా 40 ఏళ్ల పాటు భారత్, చైనా, నేపాల్, భూటాన్ తదితర దేశాల్లోని ఉపగ్రహ ఛాయాచిత్రాలను అధ్యయనకారులు పరిశీలించారు. పశ్చిమం నుంచి తూర్పు దిశగా 2వేల కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న 650 మంచుపర్వతాలకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను అధ్యయనం చేసి హిమాలయాల్లో మంచు ఏ స్థాయిలో కరిగిపోతోందో ఒక అంచనాకి వచ్చారు. 1975–2000 సంవత్సరం నాటి కంటే 2000–2016 మధ్య ఉష్ణోగ్రతలు సగటున ఒక్క డిగ్రీ వరకు పెరిగాయి. అయితే మంచు మాత్రం రెట్టింపు వేగంతో కరిగిపోవడం ప్రారంభమైందని అధ్యయన నివేదికను రచించిన జోషా మారర్ వెల్లడించారు. అంతేకాదు 21వ శతాబ్దం ప్రారంభం నాటికి ముందు ఏడాదికి సగటున 0.25 మీటర్ల మంచు కరిగితే అప్పటుంచి 0.5 మీటర్ల మంచు కురుగుతున్నట్టు తేలిందని చెప్పారు. 80 కోట్ల మంది వరకు వ్యవసాయం, హైడ్రోపవర్, తాగు నీరు కోసం హిమాలయాలపై ఆధారపడి జీవిస్తున్నారు. భవిష్యత్‌లో తీవ్రం నీటి కొరత ఉంటుందని హెచ్చరించింది. మంచు చరియలు ఎందుకు విరిగిపడతాయ్ ..? హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడానికి ఎన్నో కారణాలుంటాయి. మంచు కొండలు కోతకు గురి కావడం, అడుగు భాగంలో ఉన్న నీటి ఒత్తిడి పెరగడం, హిమనీ నదాల కింద భూమి కంపించడం వంటి వాటి కారణాలతో ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడతాయి. హిమనీ నదాల్లో నీటి ప్రవాహం భారీ స్థాయిలో అటు ఇటూ మళ్లినప్పుడు కూడా మంచు చరియలు విరిగిపడుతూ ఉంటాయి. నందాదేవి గ్లేసియర్‌లో సరస్సు ఉన్నట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోందని, ఆ సరస్సు పొంగి పొరలడంతో మంచు చరియలు విరిగి పడి ఉండవచ్చునని ఇండోర్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫరూక్ అజామ్ చెప్పారు. భారత్‌లోని హిమాలయాల్లో అత్యంత ఎల్తైన పర్వత ప్రాంతం కాంచనగంగలో ఈ నందాదేవి హిమనీనదం ఉంది. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఇది ప్రపంచంలోనే 23వ ఎత్తయిన పర్వత ప్రాంతం. వాతావరణంలో కలిగే విపరీత మార్పుల వల్ల కూడా నందాదేవిలో మంచు చరియలు విరిగిపడవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. చమోలీ వద్ద రక్షణ చర్యల్లో నిమగ్నమైన భద్రతా బలగాలు చమోలీ వద్ద కొట్టుకుపోయిన జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతం తపోవన్ వద్ద క్షతగాత్రులను మోసుకొస్తున్న ఐటీబీపీ జవాన్లు -
ఉత్తరాఖండ్‌కు మూడు రాజధానులు
-
ఉత్తరాఖండ్ రెండో రాజధానిగా గైర్‌సెయిన్
డెహ్రాడూన్: చమోలీ జిల్లాలోని గైర్‌సెయిన్ పట్టణాన్ని రాష్ట్ర రెండో రాజధానిగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆమోదం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్పల్కుమార్ సింగ్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. గైర్‌సెయిన్‌ను రెండో రాజధానిగా (వేసవి) మారుస్తామని మార్చి 4న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గైర్‌సెయిన్‌కు దక్కిన వేసవి రాజధాని హోదాను ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన వేలాది మంది ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. గైర్‌సెయిన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. తాము అధికారంలోక వస్తే గైర్‌సెయిన్‌ను వేసవి రాజధానిగా మారుస్తామంటూ 2017 అసెంబ్లీ ఎన్నికల దార్శనిక పత్రంలో బీజేపీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం డెహ్రాడూన్ నగరం ఉత్తరాఖండ్ పరిపాలనా రాజధానిగా కొనసాగుతోంది. -
మళ్లీ ఉత్తరాఖండ్ లో ప్రకృతి విలయం
కుంభవృష్టి, వరదలతో చమోలి జిల్లా అస్తవ్యస్తం 30 మంది మృతి..రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నెలవైన ఉత్తరాఖండ్ మళ్లీ ప్రకృతి విలయంతో అల్లాడుతోంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోంది. ఈ బీభత్సం ధాటికి చమోలి జిల్లాలో కనీసం 30 మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి అంతకంతకు చేజారుతుండటంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెంటనే స్పందించి జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను రాష్ట్రానికి పంపింది. ఉరుముతున్న అలకనంద నది గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అలకనంద నది ప్రమాదస్థాయిని ధాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 54 మిల్లీమీటర్ల వర్షం కురువడంతో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. మృతుల కుటుంబాలకు 2లక్షల పరిహారం రాష్ట్రంలోని వరద బీభత్సంపై సమీక్ష నిర్వహించిన సీఎం హరీశ్ రావత్ ఈ విలయంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. పిత్తరగఢ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చిక్కుకుపోయిన ప్రజలను కాపాడేందుకు సహాయక బృందాలను పంపినట్టు ఆయన తెలిపారు. మరోవైపు థాల్-మున్సియారి రోడ్డు వరదల ధాటికి తెగిపోవడంతో ఇరుపక్కల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వానలు, వరదల తాకిడికి పెద్ద ఎత్తున పంటపొలాలు ధ్వంసమయ్యాయి. వర్షం ఎంతకూ నిలువకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇంటికి పరిమితమయ్యారు. దీంతో చాలా జిల్లాల్లో ప్రజాజీవితం స్తంభించిపోయింది. -
ఉత్తరాఖండ్‌లో భూకంపం
చార్ధామ్ క్షేత్రాలున్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం సాయంత్రం 4.58 గంటల సమయంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4 పాయింట్లుగా నమోదైంది. చమోలి కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్లు విపత్తు నివారణ కేంద్రం అధిపతి పీయూష్ రౌటేలా తెలిపారు. -
ఉత్తరాఖండ్‌లో మళ్లీ భారీ వర్షాలు, విధ్వంసం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. విధ్వంసం సృష్టిస్తున్నాయి.ప్రధానంగా చమోలి జిల్లాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షాలు కురవడంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఉత్తరకాశీ జిల్లాలో కూడా పలు నివాస ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఆ ప్రాంతాల్లో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. హరిద్వార్ జిల్లాలో 24 మందితో వెళ్తున్న పడవ ఒకటి లక్సర్ సమీపంలో గంగానదిలో చిక్కుకుపోవడంతో కాసేపు అంతా ఆందోళన చెందినా, తర్వాత మాత్రం వారందరినీ రక్షించగలిగిగనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరద ప్రభావంతో దారుణంగా పాడైన రోడ్ల పునరుద్ధరణ పనులను బీఆర్ఓ, పీడబ్ల్యుడీ శాఖలు చేపడుతుండగా, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు ఆ పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలోని బాడ్కోట్ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 10.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హరిద్వార్‌లో గంగానది గత కొన్ని రోజులుగా ప్రమాద స్థాయికి సమీపంలో ప్రవహిస్తోంది. పౌరి జిల్లాలో శతాబ్దాల నాటి మఠం ఒకటి అలకనందా నది వరదలో కొట్టుకుపోయింది. అలకనందా నది ఒడ్డున ఎప్పుడో 1625 సంవత్సరంలో ఏర్పాటుచేసిన ఈ చారిత్రక కేశోరాయ్ మఠం నదిలో కొట్టుకుపోయినట్లు పౌరి జిల్లా విపత్తు నివారణ అధికారి రవ్నీత్ చీమా తెలిపారు. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పునాదులతో సహా మఠం మొత్తం కుప్పకూలినట్లు ఆమె చెప్పారు. ఇప్పుడక్కడ కేవలం ఒక గోడ మాత్రమే మిగిలింది. జిల్లాలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చమోలిలోని కమెడా ప్రాంతం నుంచి కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసేశారు. ఆ జిల్లాలోని దేవల్, తరాలి ప్రాంతాల్లో ఆరు ఇళ్లు కుప్పకూలాయి. అర డజనుకు పైగా వంతెనలు కొట్టుకుపోయాయి. ఉత్తరకాశీ జిల్లాలోని గునాల్ గ్రామంలో ఇళ్లు మునిగిపోతున్నాయి. దీంతో ఆ ఇళ్లలోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.