సాధారణంగా చాలా విషయాల్లో.. మొదటిదానికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో చిట్ట చివరి దానికీ అంతే ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ప్రాంతాల విషయంలో ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ దుకాణం కూడా అంతే ప్రత్యేకమైనది. చిత్రంలోని కొట్టు పేరు భారత్ చిట్టచివరి దుకాణం (హిందుస్థాన్ కీ అంతిమ్ దుకాణ్). పేరేంటి అలా ఉంది అనుకుంటున్నారా?
పేరులోనే ఉంది కథంతా. ఏంటంటే.. ఈ షాప్ భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలోని భారత్ భూభాగమైన ఉత్తరాఖండ్‌లోని... చమోలీ జిల్లాలో ఉంది. ఇదో టీ స్టాల్. దీన్ని చందేర్ సింగ్ బద్వాల్ అనే వ్యాపారి నడుపుతున్నాడు. ఆ గ్రామంలో మొట్ట మొదటి టీ షాపు ఇదే. 25 ఏళ్ల కిందట దీన్ని ప్రారంభించారట. చిన్న షాపే. కానీ 3,118 మీటర్ల (10,229 అడుగులు) ఎత్తులో ఉంది.
హిమాలయాల చెంత ఉన్న ఈ షాపు నుంచి చూస్తే అద్భుతమైన మంచు శిఖరాలు కనిపిస్తాయి. చైనా సరిహద్దుకి కొన్ని మీటర్ల దూరంలోనే ఈ షాపు ఉండటం విశేషం. అందుకే ఇక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ బద్వాల్ గారి టీ స్టాల్‌లో ఓ కప్పు చాయ్ కొట్టడంతో పాటు.. ఆ కొట్టు ముందర నిలబడి ఓ సెల్ఫీ కూడా దిగుతారు.
చదవండి: సముద్రంలో తేలియాడే నగరం.. పంటలు కూడా.. ఎక్కడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment