
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న టాటా సుమో అదుపు తప్పి 700 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులోని మొత్తం 12 మంది మరణించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను లోయ నుంచి పైకి తీసుకువచ్చారు. ఈ వాహనం జోషిమఠ్ నుంచి కిమాన గ్రామం వెళ్లే సమయంలో పల్ల జఖోల్ వద్ద ప్రమాదానికి గురైంది.
12 మంది మృతుల్లో 10 మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. లోయ 700 మీటర్ల లోతు ఉండటంతో టాటా సుమో ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ప్రయాణికుల మృతదేహాలు చల్లాచెదురుగా పడి ఉన్నాయి.
సీఎం దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
#Chamoli: जोशीमठ के पास हुए सड़क हादसे में कई लोगों की मौत, घटनास्थल का वीडियो आया सामने।#Uttarakhand #ViralVideo #UserGenerated pic.twitter.com/RWeWDgPWaA
— News Tak (@newstakofficial) November 18, 2022
#उत्तराखंड - चमोली में गहरी खाई में गिरा वाहन, 12 लोगों की गई जान, 10 पुरुष और 2 महिलाओं की हुई मौत. #Uttrakhand #RoadAccident #Chamoli pic.twitter.com/AXS0RP8w8S
— TheuttarpradeshNews.com (@TheUPNews) November 18, 2022
చదవండి: యూపీలో దారుణం.. యువకుడ్ని చితకబాది మొహంపై మూత్ర విసర్జన..