ఉత్తరాఖండ్‌: కరెంట్‌ షాక్‌తో 16 మంది దుర్మరణం | Uttarakhand Chamoli Electrocuted Accident Updates | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో ఘోరం.. ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి కరెంట్‌ షాక్‌తో 16 మంది దుర్మరణం

Published Wed, Jul 19 2023 1:33 PM | Last Updated on Wed, Jul 19 2023 8:05 PM

Uttarakhand Chamoli Electrocuted Accident Updates - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో బుధవారం ఘోరం జరిగింది. అలకనంద నది Alaknanda River చమోలి డ్యామ్‌ దగ్గర ట్రాన్స్‌ఫారమ్‌ పేలిన ఘటనలో పదహారు మంది మృత్యువాత పడ్డారు.  మృతుల్లో పోలీసు సిబ్బంది.. ముగ్గురు హోంగార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి.. బ్రిడ్జి గుండా కరెంట్‌ పాస్‌ అయ్యింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్నవాళ్లకు కరెంట్‌ షాక్‌ తగిలింది. కొందరు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడగా.. వాళ్లను చికిత్స కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్పీ పరమేంద్ర దోవల్‌ వెల్లడించారు. ఇదిలా ఉంటే..  నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనంద నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement