పుదుచ్చేరి నుంచి నెల్లూరు వెళు్తండగా పట్టుకున్న చెక్‌పోస్టు సిబ్బంది
టీడీపీ నాయకుడి మద్యం ఫ్యాక్టరీ నుంచి వస్తున్నట్టు అనుమానం
తడ (తిరుపతి జిల్లా): ఎన్నికల వేళ భారీ ఎత్తున మద్యం పట్టుబడుతోంది. తాజాగా బీవీపాళెం చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద బుధవారం పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్నారు. ఎస్‌ఈబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పుదుచ్చేరి నుంచి నెల్లూరు వైపు వెళుతున్న కేరళకు చెందిన మినీ లారీని తనిఖీ చేయగా మద్యం రవాణా బట్టబయలైంది.
పట్టుకున్న లారీని బీవీపాళెం సరిహద్దు ఉమ్మడి తనిఖీ కేంద్రంలోని ఎస్‌ఈబీ కార్యాలయానికి తరలించి సరుకు లెక్కించారు. లారీలో మొత్తం 300 కేసుల (14,400 బాటిళ్లు) క్వార్టర్ బాటిళ్ల మద్యం ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.7.42 లక్షలుగా ఉంటుందని తెలిపారు. దీంతోపాటు లారీ, కేరళకు చెందిన డ్రైవర్ మహ్మద్ ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడ్డ సరుకు పుదుచ్చేరిలోని బాలాజీ ఎంటర్ ప్రైజెస్, గ్లోబల్ బేవరేజెస్ పరిశ్రమ నుంచి వస్తున్న ‘ఆల్‌వేస్ సూపర్ స్ట్రాంగ్’ పేరుతో ఉన్న బ్రాందీ. దీనిని ఏప్రిల్ 30వ తేదీన తయారు చేసినట్టు సీల్ ఉంది. ఈ బ్రాండ్ నెల్లూరుకు చెందిన ఓ టీడీపీ మద్యం వ్యాపారిదిగా ఎస్‌ఈబీ సిబ్బంది గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment