చెక్‌పోస్టు వద్ద బెదిరింపులు: విలేకరులపై కేసు | Two Tv channel reporters booked | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టు వద్ద బెదిరింపులు: విలేకరులపై కేసు

Published Tue, Jan 12 2016 3:29 PM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM

Two Tv channel reporters booked

సూళ్లూరుపేట (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : నెల్లూరు జిల్లా తడ వద్ద ఉన్న అంతర్ రాష్ట్రీయ చెక్ పోస్టు వద్ద బెదిరింపులకు పాల్పడుతున్న పత్రికా విలేకరులపై పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. గత డిసెంబరు 9వ తేదీన చెక్‌పోస్టు వద్ద సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఈనాడు పత్రిక విలేకరి చంద్రమోహన్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి విలేకరి రమేష్ వారిని అడ్డుకుని కొన్ని లారీలను ముందుకు దాటించే ప్రయత్నం చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు సిబ్బందిని బెదిరించారు. దీనిపై చెక్‌పోస్టు అధికారి జగబంధు స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అనంతరం ఆరోపణలు నిజమని తేలటంతో ఇందుకు సంబంధించి ఇద్దరు విలేకరులపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్‌కుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement