జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌పై శుక్రవారం వేకువ జామున ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. రికార్డులను పరిశీలించడంతో పాటు ఆదాయం వివరాలను తనిఖీ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు వాహనాలను నిలిపివేశారు. ఇదే విధంగా ఏపీలోని పలు చెక్‌పోస్టుల్లోనూ తనిఖీలు జరుగుతున్నట్టు సమాచారం.