చిలమత్తూరు (హిందూపురం) : డ్రైవర్లు, రవాణాదారులు తమ సొంత అవసరాల నిమిత్తం రవాణా చేస్తున్న వస్తువులకు చెక్‌పోస్టు వాణిజ్య పన్నుల తనిఖీ కార్యాలయంలో (ఫారం 650, 651) ట్రాన్స్‌పోర్ట్ డిక్లరేషన్ లేదా వే బిల్లు ఇవ్వాల్సిన అవసరం లేదని పరిపాలనాధికారి రాజగోపాల్‌రెడ్డి బుధవారం తెలిపారు. సొంత అవసరాలు, ఇళ్లకు కావాల్సిన ఫర్నీచర్ తదితర సామగ్రి తీసుకెళ్తున్నపుడు నిబంధనలకు విరుద్ధంగా చెక్‌పోస్టులో అధికారి కానీ సిబ్బంది కానీ పన్నులు వసూలు చేస్తే 80082 77270 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.