transport tax
-
రవాణా రంగానికి అండగా ప్రభుత్వం
-
సొంత అవసరాల రవాణాకు పన్ను లేదు
చిలమత్తూరు (హిందూపురం) : డ్రైవర్లు, రవాణాదారులు తమ సొంత అవసరాల నిమిత్తం రవాణా చేస్తున్న వస్తువులకు చెక్‌పోస్టు వాణిజ్య పన్నుల తనిఖీ కార్యాలయంలో (ఫారం 650, 651) ట్రాన్స్పోర్ట్ డిక్లరేషన్ లేదా వే బిల్లు ఇవ్వాల్సిన అవసరం లేదని పరిపాలనాధికారి రాజగోపాల్‌రెడ్డి బుధవారం తెలిపారు. సొంత అవసరాలు, ఇళ్లకు కావాల్సిన ఫర్నీచర్ తదితర సామగ్రి తీసుకెళ్తున్నపుడు నిబంధనలకు విరుద్ధంగా చెక్‌పోస్టులో అధికారి కానీ సిబ్బంది కానీ పన్నులు వసూలు చేస్తే 80082 77270 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. -
లారీల సమ్మె విరమణ
హైదరాబాద్ : లారీ యజమానుల సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సచివాలయంలో గురువారం ఉదయం మంత్రులు మహేందర్ రెడ్డి, హరీష్ రావు లు లారీ యజమానుల సంఘాలతో చర్చలు జరిపారు. డిమాండ్ల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు మంత్రులు అంగీకరించారు. వాహన పన్ను, సింగిల్ స్టేట్ పర్మిట్ జారీ అంశాలపై మంత్రులు సానుకూలంగా స్పందించారు. మూడు వారాల్లోగా సమస్యల పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు సంఘం నేతలు ప్రకటించారు. తెలంగాణ సర్కార్ నిర్ణయం పట్ల లారీ సంఘాల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. -
లారీల సమ్మె విరమణ
-
లారీల సమ్మె యథాతథం
ప్రభుత్వంతో టీ. లారీ యజమానుల సంఘం చర్చలు విఫలం రవాణా పన్ను తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అత్యవసర సరుకు రవాణా వాహనాలకు మాత్రం మినహాయింపు సాక్షి, హైదరాబాద్: డిమాండ్లను పరిష్కరించాలంటూ మంగళవారం అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మె యథాతథంగా కొనసాగుతుందని తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రకటించింది. సమ్మె నివారణపై రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమైనట్లు తెలిపింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణ పన్ను తగ్గింపు సహా ఇతర డిమాండ్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవటంతో సమ్మెకు దిగుతున్నట్లు చెప్పింది. పాలు, నీళ్లు, మందులు లాంటి అత్యవసర సరుకు రవాణా వాహనాలు మినహా మిగతా 2.75 లక్షల సరుకు రవాణా వాహనాలు సమ్మెలో పాల్గొంటాయని సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ ధోరణిలో మార్పు రాకుంటే అత్యవసర సరుకు రవాణా వాహనాలను కూడా సమ్మెలోకి తెస్తామని, పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను కూడా దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అంతకుముందు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు చర్చించారు. ఈ సమావేశంలో మొత్తం 11 డిమాండ్లను సంఘం ప్రతినిధులు ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో త్రైమాసిక పన్నును జనాభా దామాషా పద్ధతిలో 58:42 నిష్పత్తిలో తగ్గించాలని, రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పన్ను తీసుకుని రెండు రాష్ట్రాల మధ్య లారీలు తిరిగేందుకు వెసులుబాటు కల్పిస్తూ కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ వీటిపై సీఎం స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున తానేమీ చెప్పలేనని సునీల్‌శర్మ తేల్చి చెప్పారు. మిగతా డిమాండ్లపై వారం గడువు కోరారు. అయితే మిగతా వాటికి సంబంధించి గతంలోనే ఉత్తర్వులు వెలువడినందున కొత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందన్న సంఘం ప్రతినిధులు చర్చలు విఫలమైనట్లు చెబుతూ బయటకు వచ్చారు. -
రవాణా పన్నుపై హైకోర్టు ఉత్తర్వులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రిజిష్టరై అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే ప్రైవేటు రవాణా వాహనాలన్నీ తాము చెల్లించాల్సిన పన్ను మొత్తానికి హామీ పత్రాలు సమర్పించాలంటూ గత వారం తామిచ్చిన తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు శనివారం వరకు పొడిగించింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ నుంచి వచ్చే రవాణా వాహనాలపై పన్ను విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఈ.మనోహర్ వాదనలు వినిపిస్తూ, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పన్ను విధింపు ఉత్తర్వులు లోపుభూయిష్టంగా ఉన్నాయని, ఎప్పటి నుంచి పన్ను వసూలు చేస్తారు..? ఎంత మొత్తం మేర పన్ను చెల్లించాలి..? తదితర వివరాలను ఆ ఉత్తర్వుల్లో పొందుపరచలేదన్నారు. తరువాత తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, పన్నుల వివరాలను జీవోలో పేర్కొనకపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రవాణా చట్టాన్ని తమ రాష్ట్రానికి అన్వయింప చేసుకున్నామని, అందువల్ల అందులో ఉన్న విధంగానే పన్నులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, గత వారం తాము జారీ చేసిన తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులను శనివారం వరకు పొడిగిస్తున్నామని, శుక్రవారం పూర్తిస్థాయి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. -
అదనపు ఆదాయంపై ‘బెస్ట్’ దృష్టి
నగరవాసులపై ‘ట్రాన్స్‌పోర్టు ట్యాక్స్’ భారం మోపే యోచన సాక్షి, ముంబై: నష్టాల్లో కూరుకుపోయిన బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ ఆదాయం పెంపు వేటలో పడింది. ఇందులోభాగంగా ముంబైకర్లపై ‘ట్రాన్స్‌పోర్టు ట్యాక్స్’ భారం మోపాలని యోచిస్తోంది. దీన్ని అమలు చేసేందుకు కార్పొరేషన్ చట్టంలో మార్పునకు సంబంధించిన ప్రతిపాదనను ఆ సంస్థ పరిపాలనా విభాగం సిద్ధం చేసింది. ట్రాన్స్‌పోర్టు ట్యాక్స్ వసూలు విధానాన్ని అమలు చేస్తే బెస్ట్ సంస్థకు అదనపు ఆదాయం వస్తుంది. అదే జరిగితే ముంబైకర్ల జేబులకు చిల్లులు పడడం మాత్రం ఖాయం. నగరంలో సేవలందిస్తున్న బెస్ట్ సంస్థకు అనేక రూట్లలో కనీస ఆదాయం కూడా రావడం లేదు. దీంతో ప్రతి ఏడాదీ నష్టాలవుతోంది. చేసిన అప్పులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ కారణంగా బెస్ట్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఇప్పటికే ఈ సంస్థ రూ.మూడున్నర వేల కోట్ల మేర నష్టాల్లో నడుస్తోంది. పైగా అప్పులు కూడా ఉన్నాయి. ఇలా సంస్థపై మొత్తం రూ. ఏడు వేల కోట్ల వరకూ భారం ఉంది. గతంలో విద్యుత్ శాఖ ద్వారా వచ్చిన ఆదాయాన్ని రవాణా విభాగానికి మళ్లిస్తూ కాలం గడుపుతోంది. అయితే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ విధించిన ఆంక్షల కారణంగా దానికీ గండిపడింది. దీనిపై కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోర్టు సూచించింది. దీంతో తమకు రూ.160 కోట్ల మేర ఆర్థిక సహాయం అందజేయాలంటూ బీఎంసీకి బెస్ట్ సంస్థ విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి కనీస చార్జీల్లో రెండు రూపాయలు, ఒకవేళ సహాయం అందిస్తే రూపాయి పెంచుతామని స్పష్టం చేసింది. దీనిపై కూడా ఎటువంటి స్పష్టత రాకపోవడంతో చేసేది లేక ప్రయాణికులపై ట్రాన్స్‌పోర్టు ట్యాక్సు విధించాలని యోచిస్తోంది. -
అనుకున్నంతా.. అవుతోంది!!
భయపడినట్లే జరుగుతోంది. రాష్ట్ర విభజన సమయంలో పలువురు వ్యక్తం చేసిన ఆందోళనలన్నీ నిజమేనని క్రమంగా బయటపడుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చే వాహనాలన్నీ రవాణా పన్ను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం, రాజధాని నగరాన్ని తక్షణమే సీమాంధ్ర ప్రాంతానికి తరలించుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చెప్పడం లాంటివి చూస్తుంటే సీమాంధ్ర ప్రాంత వాసులు వ్యక్తం చేసిన భయాలు ఒక్కొక్కటీ నిజం అవుతున్నాయనిపిస్తుంది. వాస్తవానికి 2015 వరకు రవాణాపన్ను విధించకూడదని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నా.. ఈలోపే ఈ పన్ను విధించాలని తలపెట్టడం, నిర్ణయించడం రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉంది. ఏపీకి కేటాయించిన పాత అసెంబ్లీ హాల్ ఓ చారిత్రక భవనమని, అందువల్ల దానికి మరమ్మతులు చేయడం సరికాదని రామలింగారెడ్డి అన్నారు. మరమ్మతులు చేయడాన్ని సీమాంధ్రుల ఆగడంగా అభివర్ణించిన ఆయన.. రాజధానిని తక్షణమే తరలించుకోవాలంటూ హుకుం జారీచేశారు. ఎంసెట్‌కు సంబంధించి ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఇప్పుడే కౌన్సెలింగ్ నిర్వహించకూడదని, తాము తలపెట్టిన 'ఫాస్ట్' (ఫైనాన్షియల్ ఎయిడ్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకం మార్గదర్శకాలు రూపొందించడానికి సరిపడగా అధికారులు లేరని, అందువల్ల ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను అక్టోబర్ వరకు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, ఇలా చేయడం వల్ల విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోవాల్సి వస్తుందని, చివరకు వారి పీజీ ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలపై కూడా దీని ప్రభావం పడుతుందన్నది విద్యావేత్తల అభిప్రాయం. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఇప్పటికే విద్యుత్తు, కృష్ణా జలాల లాంటి విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలను ఆపాలనడం, రవాణా పన్ను విధిస్తామని చెప్పడం, సీమాంధ్రులను రాజధాని వెంటనే తరలించుకుని వెళ్లిపోవాలని చీదరించుకోవడం లాంటివి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని సీనియర్ రాజకీయ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
గ్రేటర్‌కు కొత్త రూపు
మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు రవాణా పన్ను మినహాయింపుతో 1.20 లక్షల మంది ఆటోడ్రైవర్లకు లబ్ధి ఉద్యమ కేసుల ఎత్తివేతపై స్పందన మంత్రి వర్గం నిర్ణయాలపై హర్షం సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న పలు నిర్ణయాలపై వివిధ వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌కు కొత్త హంగులు, భద్రత, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో విద్యార్థులు, ఇతరులపై నమోదైన కేసుల ఎత్తివేత వంటి నిర్ణయాలపై స్పందన వ్యక్తమైంది. ముఖ్యంగా ఆటోలపై రవాణా పన్ను మినహాయింపు నిర్ణయం ఆటో డ్రైవర్లలో ఆనందోత్సాహాలు నింపింది. పలుచోట్ల బుధవారం రాత్రి సంబరాలు నిర్వహిం చారు. మంత్రివర్గం నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 1.20 లక్షల ఆటో కార్మికులకు లబ్ధి చేకూరనుంది. గ్రేటర్ పరిధిలో ఆటో కార్మికులు ఏటా ఈ పన్ను రూపేణా రూ.5.28 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. మంత్రివర్గ నిర్ణయంతో తాజాగా ఈ మొత్తం మేరకు మినహాయింపు లభించినట్లయింది. అలాగే నగరంలోని 10 వేల ట్రాలీ ఆటోలు నడుపుతున్న కార్మికులకు కూడా రూ.54 లక్షల మేర లబ్ది చేకూరనుంది. అయితే, రవాణా పన్ను మినహాయింపు కంటే ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చి ఉంటే మరింత లబ్ధి చేకూరి ఉండేదని కొన్ని ఆటో సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో తీసుకున్న వివిధ నిర్ణయాల దరిమిలా అవి నగరంపై చూపే ప్రభావం వివరాలిలా.. హైదరాబాద్ ‘గ్లోబల్ సిటీ’గా రూపుదిద్దుకోనుంది. అంతర్జాతీయ స్థాయి అధునాతన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన మెరుగైన పారిశుధ్య వ్యవస్థ.. మాస్టర్‌ప్లాన్‌కు కొత్తరూపు.. మార్పుచేర్పులతో నగరం రూపురేఖల్ని మార్చేలా విధాన నిర్ణయాలు పట్టణాభివృద్ధి అంశాల్లో నైపుణ్యం కలిగిన జాతీయ స్థాయి సంస్థల లేదా అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్ల సేవల వినియోగం జంట పోలీసు కమిషనరేట్లలో కొత్త వాహనాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్.. పోలీసింగ్‌కు ఆధునిక రూపు మంత్రివర్గం నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్‌లో 103 కల్లు దుకాణాలు తెరుచుకోనున్నాయి. వీటిపై ఆధారపడిన పలువురికి ఉపాధి లభించనుంది గ్రేటర్ లోని ఘన వ్యర్థాల నిర్వహణకు రెండు వేల ఎకరాలు అవసరమని గుర్తింపు.. దీనిపై త్వరలోనే నిర్ణయం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం అక్రమాలు, ఆక్రమణల తొలగింపులో అధికారులకు పూర్తి స్థాయి సహకారం దేవాదాయ భూముల పరిరక్షణ.. జిల్లా స్థాయిలో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు నిర్ణయం. అన్యాక్రాంతమైన భూముల రక్షణకు, వక్ఫ్ భూముల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు