నేరడిగొండ : అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆందోళన చేపట్టారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంబేకర్ పండరి మద్దతు తెలిపి మాట్లాడారు. అర్హుల పింఛన్లు రద్దు చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
అర్హులందరికీ పింఛన్లు అందేవరకూ ఉద్యమిస్తామన్నారు. అనంతరం ఎంపీడీవో మహ్మద్ రియాజొద్దీన్‌కు పలువురు పింఛన్ల కోసం దరఖాస్తులు అందజేశారు. ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ మండల అధ్యక్షులు గోనే అడెల్లు, సోలంకి జగన్ సింగ్, నాయకులు షేక్ మహబూబ్, రెహ్మతుల్లా, నర్సయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ల కోసం ఆందోళన
Published Tue, Nov 25 2014 2:23 AM | Last Updated on Sat, Apr 6 2019 9:31 PM
Advertisement