the disabled
-
పెన్షన్... టెన్షన్...
-
ఆసరా కోసం ఆందోళన
నిజామాబాద్‌లో మొక్కుబడి జాబితాలో పేరు లేదని ఆందోళన నెట్వర్క్: వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవితాలకు ఆసరా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఆసరా పింఛన్ల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలుజిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో పింఛన్ల తంతు మొక్కుబడిగా సాగింది. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం ఫాజుల్‌నగర్‌లో పంచాయతీ కార్యదర్శిని, సీనియర్ అసిస్టెంట్‌ను గదిలో నిర్బంధించారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలో గ్రామపంచాయతీని ముట్టడించారు. భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌లో ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్, పంచాయితీ కార్యదర్శి, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను గ్రామ పంచాయతీలో మూడు గంటల పాటు నిర్బంధించారు. ఇదే మండలం ముస్తఫాపూర్, గొల్లపల్లి గ్రామాలకు చెందిన బాధితులు ధర్నా చేశారు. ఇబ్రహీంపట్నం ఎర్దండిలో పింఛన్‌దారుల నుంచి కాగితాల ఖర్చులకంటూ రూ.వంద చొప్పున వసూలు చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో సుమారు 1,000 మంది పింఛన్లు గల్లంతయ్యాయి. గతంలో పింఛన్లు పొందుతూ అన్ని అర్హతలున్న వారి పేర్లు జాబితాలో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. బాధితులంతా బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించా రు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. జిల్లాలో మొత్తం 3,13,831 మంది దరఖాస్తు చేసుకోగా, 2,14,605 మందిని అర్హులుగా గుర్తించామని, తొలిరోజున 1.92 ల క్షల మందికి పంపిణీ చేశామని కలెక్టర్ ఇలంబరితి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచందా మండలం రాచాపూ ర్ పంచాయతీ పరిధిలోని కొత్తపతి(కె) గ్రామస్తులు 30 మంది ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల ముందు బుధవారం ఆందోళన చేశారు. జాబితాలో పేర్లు లేకపోవడంతో కెరమెరి మండలం గోయగాం, సావర్‌ఖేడ్ గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశా రు. కాసిపేట మండలంలో బుధవారం చేపట్టాల్సిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారానికి వాయిదా వేశారు. నెన్నెల మండల పరిధిలోని పలు గ్రామాల్లోనూ పెన్షన్ల పంపిణీ జరగలేదు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో పలువురి పేర్లు జాబితాలో లేకపోవడంతో మున్సిపల్ కమిషనర్ కుంచె కుమారస్వామి రెండ్రోజుల్లోగా పెన్షన్లు అందజేస్తానని హామీ ఇచ్చారు.నిజామాబాద్ జిల్లాలో ఆర్భాటంగా పంపిణీకి శ్రీకారం చుట్టినా.. 20 శాతం మంది కి కూడా పంపిణీ చేయలేదు. బాన్సువాడ నియోజకవర్గంలో ఒక్క వర్ని మండలంలో మాత్ర మే పింఛన్లు పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక్క ఎల్లారెడ్డి మినహా మిగిలిన ఐదు మండలాల్లో పంపిణీ వాయిదా పడింది. బోధన్‌లో పింఛన్ల పంపిణీ గురువారం నుంచి చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆర్మూర్ పట్టణంలో పింఛన్ల కోసం సాయంత్రం వరకు నిరీక్షించారు. వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ కాలేదు. చిట్యా ల, డోర్నకల్, మహబూబాబాద్, నెల్లికుదురు, ఏటూరునాగారం, తొర్రూరు, నర్సంపేటతో పాటు నగరంలో అధికారులు సకాలంలో రాకపోవడంతో లబ్ధిదారులు నిరసన తెలిపారు. మంగపేటలో పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు. నర్సింహులపేట మండలం రేపోణి గ్రామంలో తమ కుటుంబాలకు చెందిన వారికి పింఛన్లు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరు వ్యక్తులు వీఆర్వో రమేష్‌పై దాడికి ప్రయత్నించారు. జాబితాలో పేరు లేదని ఆత్మహత్య గార్ల: పింఛన్ల జాబితాలో పేరు లేదని మనస్తాపంతో ఖమ్మం జిల్లా గార్ల మండలం సీతంపేటకు చెందిన దైదా సత్యనారాయణరెడ్డి(65) ఆత్మహత్య చేసుకున్నాడు. సత్యనారాయణరెడ్డి మూడేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నాడు. మంగళవారం కొత్త జాబితా ప్రకటించగా, అందులో సత్యనారాయణరెడ్డి పేరు లేదు. దీంతో మనోవేదనకు గురై బుధవారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. పింఛన్ కోసం వెళ్తూ మృత్యుఒడికి.. సిరిసిల్ల : కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో పింఛన్ కోసం వెళ్తూ బండారి కాంతమ్మ(65) బుధవారం మృతి చెందింది. సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన కాంతమ్మ పింఛన్ కోసం రెండోవార్డులో ఏర్పాటు చేసిన పంపిణీ పాయింట్‌కు వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న సైకిలిస్ట్ ఆమెను ఢీకొట్టాడు. రోడ్డుపై పడిపోయిన కాంతమ్మను స్థానికులుఆస్పత్రికి తీసుకెళ్లగా రాత్రి చనిపోయింది. -
పెన్షన్... టెన్షన్...
మొక్కుబడిగా పింఛన్ల పంపిణీ బ్యాంకుల్లో జమకాని నగదు మంత్రుల కోసం మరి కొన్ని చోట్ల వాయిదా లబ్ధిదారుల పడిగాపులు సిటీబ్యూరో: నగరంలో బుధవారం చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారింది. అనేక ప్రాంతాల్లో విచారణ పూర్తి కాకపోవడం... అందరికీ మంజూరు కాకపోవడం... ప్రజల నిరసనలతో ఈ కార్యక్రమానికి ఆటంకాలు ఎదురయ్యాయి. రోజంతా ఎదురు చూసి విసిగి వేసారిన లబ్ధిదారులు నిరాశతో ఇంటిముఖం పట్టారు. గ్రేటర్‌లోని మారేడుపల్లి, సికింద్రాబాద్, ముషీరాబాద్ మండలాలు, ఎల్బీనగర్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీ ప్రక్రియను ప్రారంభించలేదు. మారేడుపల్లి, ముషీరాబాద్‌లకు సంబంధించి బ్యాంకుల్లో సంబంధిత మొత్తం జమ కాకపోవటంతో పంపిణీ చేయలేదు. సికింద్రాబాద్, మరికొన్ని ప్రాంతాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవటంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 10 నుంచి రెండు నెలల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించటంతో గ్రేటర్‌లోని పింఛన్ కేంద్రాల వద్ద లబ్ధిదారులు బుధవారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గంటల తరబడి ఎదురు చూశారు. అధికారులు రాకపోవటంతో ఆందోళనకు గురయ్యారు. ఒక దశలో ఆగ్రవేశాలు వ్యక్తంచేశారు. కొన్ని కేంద్రాలలోనైతే నిరసనలకు దిగారు. ఈ పరిస్థితి సమూర్నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, మారేడుపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్ జిల్లాలో పింఛన్ల పంపిణీకి 130 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 30 చోట్ల పంపిణీ చేయలేదు. హైదరాబాద్ జిల్లాలోని 16 మండలాల పరిధిలో త హశీల్దారుల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కొనసాగుతుండగా.. శివారు ప్రాంతాల బాధ్యతను జీహెచ్ఎంసీ అధికారులు తీసుకున్నారు. అయితే వారు దిల్షుక్నగర్ మినహాయించి ఎక్కడా పంపిణీ చేయలేదు. నగరంలో 7,900 మందికి... నగరంలో బుధవారం 7,900 మందికి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ జిల్లాలోని 13 మండలాల పరిధిలో 6,900 మందికి... శివారు ప్రాంతాల్లో వెయ్యి మందికి అందజేసినట్లు అధికారవర్గాల సమాచారం. ఈ కార్యక్రమం ఈ నెల 15 వరకు కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు పింఛన్లు అందుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని నందినగర్ గ్రౌండ్లో పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆనందం వ్యక్తం చేశారు. షేక్‌పేట మండల పరిధిలో బుధవారం మూడు చోట్ల అర్హులకు పింఛన్లు పంపిణీ చేశారు. అక్కడ 800 మందికి వీటిని అందజేశారు. బహదూర్‌పురా మండలంలో అత్యధికంగా పంపిణీచేసినట్లు తెలుస్తుంది. అమీర్‌పేట, అంబర్‌పేట, చార్మినార్, పాతబస్తీల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. హైదరాబాద్ జిల్లాలో దీన్ని కలెక్టర్ ముఖేష్‌కుమార్ పర్యవేక్షించారు. ఎన్ని వింతలో... ఆసరా కార్డుల్లో వింతలు చోటు చేసుకున్నాయి. కుత్బుల్లాపూర్ మండలంలోని కొంపల్లిలో ఇద్దరు వితంతువులకు జారీ చేసిన ఆసరా కార్డులపై యువకుడు, పాఠశాల విద్యార్థినిల ఫొటోలు ముద్రించారు. దీంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు. గుడిపల్లి ప్రమీల(38) కార్డుపై యువకుడి ఫొటో దర్శనమివ్వగా.... బాలోని నీరజ(33) కార్డుపై చిన్నారి ఫోటో ఉంది. ఈ విషయంపై ఎంపీడీఓ కె.అరుణను ‘సాక్షి’ వివరణ కోరగా... అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న ఎవరిదో ఒక ఆధార్ నెంబరు ఇస్తే నోట్ చేసుకుని వచ్చి కంప్యూటర్లో పొందుపరిచారని తెలిపారు. ఈక్రమంలో తప్పులు దొర్లాయని అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. ఉప్పల్‌లో సర్కిల్లోని వెంకట్‌రెడ్డి నగర్, రామాం తానపూర్లకు చెందిన వికలాంగులు ఉపేంద్ర (59), జి.మాణిక్యం(44)లకు జారీ చేసిన ఆసరా కార్డుైలపై ‘వితంతువు’గా ముద్రించారు. ఇది చూసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ఒ క్కో కార్డును పరిశీలించి సంతకాలు పెట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలిసింది. -
లబ్ధిదారులందరికీ పింఛన్లు
- జిల్లాకు 2లక్షల 5 వేలు మంజూరు - జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ జక్రాన్‌పల్లి :అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్లను అందజేస్తామని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. జిల్లాకు రెండు లక్షల 5వేల మందికి ఆసరా పింఛన్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మండలంలోని పడకల్,మనోహరాబాద్,జక్రాన్‌పల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. జక్రాన్‌పల్లి మండల పరిషత్తు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పింఛన్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు కలెక్టర్‌కు పింఛన్లు రావడంలేదని విన్నవించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వృద్ధులు,వికలాంగులు ఎవరు కూడా నిరుత్సాహ పడవద్దన్నారు. పింఛన్లు రావని ఎవరు అపోహలకు గురికావద్దన్నారు. అర్హులైన లబ్ధిదారులకు తప్పనిసరిగా ఆసరా పింఛన్లను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో ఆసరా పింఛన్లు,ఆహార భద్రత కార్డులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలోఎలాంటి వివరాలు లేకుండా ఐకేపీ ఏపీఎం శ్యామ్ కార్యాలయానికి రావడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మనోహరాబాద్ శివారులో గల విమానాశ్ర యం ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎయిర్‌పోర్టుకు స్థలం అనుకూలంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా పడకల్లో పరిశ్రమల స్థాపన కోసం 410 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఆరోగ్య సిబ్బందిపై ఆగ్రహం.. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అధికారుల హాజరు పట్టికను పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో, మెడికల్ ఆఫీసర్-1 సంతోష్‌కుమార్ వర్ని క్యాంపులో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. మరో మెడికల్ ఆఫీసర్ విజయ్‌కుమార్ సెలవులో ఉన్నారని చెప్పారు. కాగా సీనియర్ అసిస్టెంట్ సురేందర్‌రెడ్డి మాత్రం సెలవు లేకపోయినా, సీఎల్ వేసుకొని వెళ్లడంతో, ఎవరి అనుమతి లేకుండా సీఎల్ వేసుకోవ డం ఏంటని సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీవో యాదిరెడ్డి,జడ్పీటీసీ సభ్యురాలు తనుజారెడ్డి,సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోర్త రాజేందర్,మనోహరాబాద్ సర్పంచ్ తిరుపతిరెడ్డి, అధికారులు ఉన్నారు. -
మా ఓట్లతో గద్దెనెక్కి..మా పొట్ట కొడతారా?
బత్తలపల్లి : మా ఓట్లతో గద్దెనెక్కి..మా పొట్ట కొడతారా?..అంటూ పలువురు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు కోల్పోయినవారు, సీఎస్పీ స్వాహా చేయడంతో పింఛను అందని బాధితులు మండల కేంద్రంలో శుక్రవారం రాస్తారోరో చేశారు. కదిరి-అనంతపురం జాతీయ రహదారిపై బైఠాయించి గంటసేపు నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు వీరికి మద్దతుగా నిలిచారు. టీడీపీకి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వృద్దులు పట్ల ఆటవికంగా వ్యవహరిస్తున్న టీడీపీకి బుద్ధి చెబుతామంటూ నినాదాలు చేశారు. పలువరు వృద్ధులు మాట్లాడుతూ ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, భూములున్నాయంటూ పింఛను ఎగురగొట్టేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. మంజూరైన పింఛను మొత్తాన్ని సీఎస్పీ స్వాహా చేశారని డీ చెర్లోపల్లికి చెందిన వృద్ధులు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఎంపీపీ కోటి సూర్యప్రకాష్‌బాబు, జెడ్పీటీసీ అక్కిం నరసింహులు, సింగిల్ విండో అధ్యక్షుడు కేశనపల్లి వెంకటచౌదరి, మండల కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, గుర్రం శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడారు. డి.చెర్లోపల్లిలో టీడీపీ నాయకుడు రామమూర్తినాయుడు సీఎస్పీ అవతారం ఎత్తి వృద్ధుల పింఛన్ ను స్వాహా చేశాడని ఆరోపించారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి, పింఛన్‌దారులకు డబ్బు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పింఛన్లను పునరుద్ధరించాలన్నారు. ఎస్ఐ శాంతీలాల్, ఎంపీడీఓ బండి నాగరాజు, ఈఓ పీఆర్డీ లక్ష్మీబాయి ఆందోళనకారులతో మాట్లాడారు. డి.చెర్లోపల్లిలో పింఛన్ సొమ్ము కాజేసినట్లు ప్రజావాణిలో పిర్యాదు చేశారన్నారు. డీఆర్డీఏ అధికారులతో చర్చించి అక్విటెన్స్లు తెప్పించి విచారించగా సంతకాలు తమవి కాదని పింఛన్‌దారులు చెప్పినట్లు తెలిపారు. దీనిపై స్టేట్మెంట్ రికార్డు చేసి చర్యలు తీసుకోవాలని నివేదికలు పంపినట్లు సంబంధిత అధికారులు వివరిచారు. అనంతరం ధర్మవరం రూరల్ సీఐ విజయభాస్కర్గౌడు వచ్చి నేతలతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. రాస్తారోకోతో ఇరువైపులా వాహనాల రాకపోకలు స్తంభించాయి. వైఎస్సార్ సీపీ నాయకులు, సర్పంచ్‌లు సంజీవు, సానే సూర్యనారాయణరెడ్డి, ఎంపీటీసీలు మాతంగి రామాంజనేయులు, వడ్డె క్రిష్టప్ప, ముష్ఠూరు నరసింహారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, వెంకటరెడ్డి, జయరామిరెడ్డి, ఈడిగ కాశప్ప, మాల్యవంతం పరేష్, వేణు, మాజీ డీలర్ సూరీ, అనంతసాగరం క్రిష్ట, డి.చెర్లోపల్లి యల్లప్పనాయుడు, రామకృష్ణ, చల్లా క్రిష్టా, ముసలయ్య, నారాయణస్వామి, నరసింహులునాయుడు, నారప్పనాయుడు, పుల్లానాయుడు, రామానాయుడు, పురుషోత్తంచౌదరి, మనోహరరెడ్డి, ప్రభాకరరెడ్డి, శ్రీరాములు, చెన్నారెడ్డి, చెన్నక్రిష్ణారెడ్డి, బాలకృష్ణారెడ్డి, మాజీ డీలర్లు రామకృష్ణారెడ్డి, ఆదెప్ప, నాగభూషణ, బిల్లే సూరీ, శంకర్, బేల్దారి నరసింహులు పాల్గొన్నారు. -
పింఛన్ల కోసం ఆందోళన
నేరడిగొండ : అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆందోళన చేపట్టారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంబేకర్ పండరి మద్దతు తెలిపి మాట్లాడారు. అర్హుల పింఛన్లు రద్దు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అర్హులందరికీ పింఛన్లు అందేవరకూ ఉద్యమిస్తామన్నారు. అనంతరం ఎంపీడీవో మహ్మద్ రియాజొద్దీన్‌కు పలువురు పింఛన్ల కోసం దరఖాస్తులు అందజేశారు. ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ మండల అధ్యక్షులు గోనే అడెల్లు, సోలంకి జగన్ సింగ్, నాయకులు షేక్ మహబూబ్, రెహ్మతుల్లా, నర్సయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు. -
మండిపడ్డ పండుటాకులు
జన్నారం : అర్హుల పింఛన్లు కూడా తొలగించారని మండలంలోని చింతగూడ, రోటిగూడ గ్రామాలకు చెందిన సుమారు 300 మంది వృద్ధులు, వితంతులు, వికలాంగులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. చింతగూడ గ్రామ ప్రధాన రహదారిపై రెండు గంటలకుపైగా బైటాయించి ఆందోళన చేశారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎస్సై స్వామి సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంపీడీవో, తహశీల్దార్లు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పే వరకు వెళ్లేది లేదని వారు భీష్మించుకు కూర్చున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాదవత్ సుధాకర్‌నాయక్ మాట్లాడుతూ పేదల పొట్టలు కొట్టి పెద్దలకు ఈ ప్రభుత్వం దోచి పెడుతుందని విమర్శించారు. గతంలో ఇచ్చిన పింఛన్లను తొలగించి వృద్ధుల ఉసురుపోసుకుంటుందన్నారు. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువదని పేర్కొన్నారు. ఎస్సై కలుగజేసుకుని ఆందోళనకారులను పక్కకు పంపించారు. తహశీల్దార్ రవీందర్ అక్కడికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బద్రినాయక్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట.. మండలంలోని కవ్వాల్, ఇందన్పల్లి, కామన్పల్లి, దేవునిగూడ గ్రామాలకు చెందిన వృద్ధులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైటాయించారు. అరగంటపాటు ఆందోళన చేశారు. వీరికి కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం పార్టీలు మద్దతు తెలిపాయి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కనికరం రాజన్న మాట్లాడుతూ పింఛన్ తొలగించి ప్రభుత్వం పేదల ఉసురుపోసుకుంటుందన్నారు. పింఛన్లు తొలగించి ముసలి వాళ్లకు ఆసర లేకుండా చేసిందన్నారు. అధికారుల నుండి స్పందన రాకపోవడంతో అంగడీబజార్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. గంటపాటు రాస్తారోకో చేశారు. ఎస్సై స్వామి కలగజేసుకొని అధికారులతో మాట్లాడిస్తామని నచ్చజెప్పి వారిని తిరిగి కార్యాలయాలకు తీసుకెళ్లారు. ఎంపీడీవో శేషాద్రి ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు అంజన్న, నాయకులు గోపాల్, కొండగొర్ల లింగన్న , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్‌నాయక్, టీడీపీ నాయకుడు ప్రభాకర్, సర్పంచ్ వెంకటరాజం పాల్గొన్నారు. కాగజ్‌నగర్ కమిషనర్‌ను నిర ్బంధించిన కౌన్సిలర్లు కాగజ్‌నగర్ రూరల్ : పింఛన్ల పంపిణీపై నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ కంచె కుమారస్వామిని కౌన్సిలర్లు ఆయన కార్యాలయంలో నిర్భంధించారు. ఈ నెల 8న ప్రభుత్వం ఆసరా పథకం పేరుతో నూతన పింఛన్లు మంజూరు చేయగా కొంత మందికి మాత్రమే లబ్ధి చేకూరిందని కౌన్సిలర్లు కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆసరా పేరుతో అందరికీ పింఛన్లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం మంజూరులో ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. అట్టహాసంగా పథకాన్ని ప్రారంభించి కొంత మంది లబ్ధిదారులకు ఎందుకు విస్మరించారన్నారు. తమ వార్డుల్లో అర్హులైన నిరుపేదలు ఉన్నా వారికి పింఛన్లు మంజూరు చేయకపోవడంతో అర్హులు నిరాశకు గురవుతున్నారన్నారు. కొంత మందికి మాత్రమే పింఛన్లు మంజూరు చేయడంతో తామూ సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం ఏ ప్రాతిపాదికన పింఛన్లు మంజూరు చేస్తోందో ప్రజలకు స్పష్టం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్‌ను కార్యాలయంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీవో నెంబర్ 17 ప్రకారం అర్హులైన వారందికీ పింఛన్లు మంజూరు చే స్తామని చెప్పడంతో కౌన్సిలర్లు శాంతించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సిందం శ్రీనివాస్, దేశ్‌ముఖ్ శ్రీనివాస్, కనుకుంట్ల శివప్రసాద్, రాజేందర్, నియాజుద్దిన్, జానిమియా, నాయకులు షబ్బీర్‌హుస్సేన్, పంజాల మురళీగౌడ్, శ్రీరాం, మహేశ్, దెబ్బటి శ్రీనివాస్, సలీం పాల్గొన్నారు. -
పింఛను మంటలు
పెన్షన్ల లబ్ధిదారుల ‘సర్వే’లో నిబంధనలను తుంగలో తొక్కిన ప్రభుత్వం అర్హతలున్నా 84,617 మందినిఅనర్హులుగా చిత్రీకరించిన వైనం నోటికాడ ముద్దను లాగేయడంతో వృద్ధులు, వికలాంగుల ఆకలికేకలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఖజానాపై భారాన్ని తగ్గించుకోవడం కోసం కాటికి కాలు చాపిన పండుటాకులు.. ఊతం లేని వికలాంగులు.. దిక్కులేని వితంతువుల నోళ్లను ప్రభుత్వం కొట్టింది. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఇస్తోన్న పింఛన్లలో కోత విధించింది. అనర్హుల ఏరివేత కోసం చేపట్టిన సర్వేలో నిబంధనలను యథేచ్ఛగా తుంగలోతొక్కింది. నిబంధనలను వక్రీకరించి అర్హులను అనర్హులుగా చిత్రీకరించి.. అధికార టీడీపీ నేతల కనుసన్నల్లో పింఛన్ల లబ్ధిదారుల జాబితా నుంచి 84,617 మందిని తొలగించేసింది. జిల్లాలో అనర్హులను జాబితా నుంచి తొలగించడం వల్ల ఖజానాకు నెలకు రూ.8.61 కోట్లు.. ఏడాదికి రూ.103.32 కోట్లు మిగులుబాటు అవుతుందని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు జబ్బలు చరుచుకుంటుండడంపై సామాజికవేత్తలు విస్తుపోతున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత. సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెబుతోన్న టీడీపీ అధినేత చంద్రబాబు గద్దెనెక్కగానే కోతలకు తెరతీశారు. ఇదే క్రమంలో పెన్షన్ల భారాన్ని తగ్గించుకోవడానికి ఎత్తు వేశారు. అనుకున్నదే తడవుగా అధికారులు, సామాజిక కార్యకర్తల ముసుగులో టీడీపీ కార్యకర్తలతో కమిటీ వేసి.. తస్మదీయులు అర్హులైనా అనర్హులుగా చిత్రీకరించి పెన్షన్ల లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని కనుసైగలు చేశారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. పింఛనుదారుల్లో అనర్హులుగా గుర్తించడానికి ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. రెండున్నర ఎకరాల మాగాణి, ఐదెకరాల మెట్ట భూమి ఉన్న వారు పింఛను పొందడానికి అనర్హులు. మూడు గదులకు మించి శ్లాబ్ ఇల్లు.. కారు ఉన్న వారు కూడా అనర్హులే. ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగంతో సహా ఎలాంటి ఉద్యోగం చేస్తూ జీతం లేదా ఉద్యోగానికి సంబంధించి పింఛను పొందుతున్న వారు కూడా అనర్హులే.. నెలవారీ జీతం పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగం చేసే వారు సైతం అనర్హులే. వృద్ధాప్య పెన్షన్‌దారులకు కనీస వయస్సు 65 సంవత్సరాలు.. వితంతువులకు కనీస వయస్సు 16 ఏళ్లు. వికలాంగులకు కనీస అంగవైకల్యం 40 శాతం కలిగి ఉన్న వాళ్లే అర్హులు. ఆధార్ సీడింగ్ చేసుకోని వారూ అనర్హులే. కానీ.. ఈ నిబంధనలను సర్వేకమిటీ తుంగలో తొక్కిం ది. అన్ని అర్హతలున్నా అనర్హులుగా చిత్రీకరిస్తూ 54,254 మంది వృద్ధులు, 22,108 మంది వితంతువులు, 3,330 వికలాంగులు, 1,673 మంది చేనేత కార్మికులు, 2,786 మంది అభయహస్తం, 16 మంది గీత కార్మికులను పెన్షన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం గమన్హాం. తప్పులతడకగా లబ్ధిదారుల సర్వే! పింఛను లబ్ధిదారులపై నిర్వహించిన సర్వే తప్పులతడకగా అధికారవర్గాలే అభివర్ణిస్తుండడం గమనార్హం. కమిటీలో టీడీపీ కార్యకర్తలు ఉండడం.. ఆ పార్టీ అగ్రనేతలు ఒత్తిడి తేవడంతో సర్వే మొత్తం వారి కనుసన్నల్లోనే సాగిందని రెవెన్యూశాఖకు చెందిన ఓ కీలకాధికారి ఇటీవల బాహాటంగా వ్యాఖ్యానించడం సంచలనం రేపుతోం ది. తిరుపతి మండలం ఎమ్మార్పల్లెకు చెందిన వికలాం గుడు బాలకృష్ణను సకలాంగుడుగా తేల్చడమే అందుకు తార్కాణం. భూమి లేకున్నా ఉన్నట్లు.. ఇళ్లు లేకున్నా ఉన్నట్లు తిమ్మిని బిమ్మిని చేసి అనర్హులుగా చిత్రీకరించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పింఛను లబ్ధిదారుల జాబితాలో ఉంటే.. ఒకరి పేరును నిర్ధాక్షిణ్యంగా తొలగిం చారు. ఇదే పద్ధతిలో 84,617 మందిని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. నెలనెలా వృద్ధాప్య, వితం తు, గీత, నేత కార్మికులు రూ.వెయ్యి.. వికలాంగులు రూ.1500 పింఛను వస్తుందని ఆశించారు. కానీ.. ఉన్న పింఛనే పీకేయడంతో తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు రోడ్డెక్కుతున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా పింఛను జాబితా నుంచి తొలగించిన వృద్ధులు, వికలాం గులు, వితంతువులు ఆందోళనలు చేయడమే అందుకు తార్కాణం. -
పింఛన్లు తొలగిస్తే చర్యలు తప్పవు
నిండ్ర: వుండలంలో అర్హులైన పేదలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు తొలగిస్తే చర్యలు తప్పవని నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా అధికారుల ను హెచ్చరించారు. శుక్రవారం ఆమె మండలంలోని అత్తూరు గ్రావుంలో నిర్వహించిన జన్మభూమి-వూ ఊరు కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ప్రతి గ్రామంలో నిరుపేదలను గుర్తించి అర్హులైన వారికి పింఛన్లు వచ్చేలా చూడాలన్నారు. అలాకాకుండా అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులు పింఛన్ల జాబితా నుంచి అర్హుల పేర్లను తొలగిస్తే చూస్తూ ఊరుకునేదిలేదని ఆమె హెచ్చరించారు. పేదలకు ఇప్పటికీ గుర్తున్న నాయకులు ఇద్దరేనని, వారు ఎన్టీఆర్, వైఎస్.రాజశేఖర రెడ్డి అని గుర్తుచేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కను నాటారు. వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జన్మభూమి ప్రత్యేకాధికారి రవికూవూర్, ఎంపీపీ వసంతవ్ము, జెడ్పీటీసీ వూలతి, ఎంపీడీవో సతీష్, సర్పంచ్ లోకేష్, ఎంపీటీసీ కవిత, తహశీల్దార్ బాబు, వైఎస్సార్ సీపీ నాయకులు చక్రపాణిరెడ్డి, వునోహర్‌నాయుడు, వుురళీనాయుుడు, శ్యామ్‌లాల్ పాల్గొన్నారు. నగరిలో.. ప్రజల పక్షాన పోరాడుతామని ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. మేళపట్టు గ్రామంలో జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలు ఎంతవరకు అమలుచేసిందని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలకు లక్షవరకు అందిస్తే ఒక్కొక్క మహిళకు పదివేల రూపాయలు మాత్రమే లభిస్తుందన్నారు. ఇది కాస్త వడ్డీ కిందకు బ్యాంకులు జమచేసుకుంటే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలుగుతమ్ముళ్లు చెప్పినట్లుగా అధికారులు తలొగ్గి పనిచేయడం సిగ్గుచేటన్నారు. సభలో రభస ఎంపీడీవో సీతమ్మ గ్రామసభకు అధ్యక్షత వహించారు. ముందుగా సర్పంచ్ మధుసూదన్‌కు, ఆ తర్వాత వరుసగా టీడీపీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, కో-ఆప్షన్ మెంబర్లకు పలుమార్లు అడిగి మైకు అందించి మాట్లాడించారు. వారు చంద్రబాబు పాలన గురించి పదేపదే మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే రోజా తన ప్రసంగంలో ముఖ్యమంత్రి సందేశపత్రాన్ని చేతపట్టి వాటిలోని అంశాలకు వివరణ ఇస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఏవిధంగా లబ్ధిచేకూరాయన్న విషయాలను తెలియజేశారు. దీని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు రోజా ప్రసంగాన్ని అడ్డుకొని గొడవకు దిగారు. సింగిల్ విండో అధ్యక్షుడు బాల సురేష్, ఎంపీటీసీ హరిబాబు వేదిక వద్ద వీరంగం సృష్టించారు. అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ప్రభుత్వం మాది అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ సవాళ్లకు దిగారు. సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు తక్కువమంది ఉండటంతో వారిని నిలువరించడం కష్టసాధ్యమైంది. పలమనేరులో జన్మభూమి రచ్చరచ్చ పలమనేరు: పలమనేరు పురపాలక సంఘంలో శుక్రవారం జరిగిన జన్మభూమి- మా ఊరు గ్రామసభలు రచ్చరచ్చగా మారాయి. పట్టణంలోని సీఎస్ఐ కాంపౌండ్‌లో నిర్వహించిన 8వ వార్డుసభలో వైఎస్ఆర్సీపీ చెందిన మున్సిపల్ వైస్‌చైర్మన్ చాంద్‌బాషాకు పూలమాల వేయకపోగా.. వేదికపై ఉన్న అధికారులను పక్కకు పొమ్మని తెలుగుతమ్ముళ్లు టీడీపీ ఇన్చార్జ్ని కుర్చోబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో ప్రోటోకాల్ వివాదం తెరమీదికొచ్చింది. ఇరుపార్టీల నాయకులు వాగ్వాదాలకు దిగారు. ఈ సంఘటనకు నిరసనగా వైస్ చైర్మన్ వార్డు సభను బహిష్కరించి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులతో కలసి జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. పోలీసులు వీరి ధర్నాను అడ్డుకుని వివాదం పెద్దది కాకుండా చూశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి కౌన్సిలర్లతో కలసి ప్రోటోకాల్ వివాదం, తెలుగు తమ్ముళ్ల హంగామాపై సీఐ బాలయ్య దృష్టికి తీసుకెళ్ళారు. అక్కడికి చేరుకున్న డిఎస్పీ హరినాథ రెడ్డి కమిషనర్ వెంకటేశ్వరరావ్ను స్టేషన్‌కు పిలిపించి ఈ సంఘటనపై పూర్తిగా విచారించారు. నేటి నుంచి జరిగే వార్డుసభల్లో వీడియో రికార్డింగ్ చేపట్టాలని కమిషనర్‌ను ఆదేశించారు. జన్మభూమి వద్ద గొడవలు సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఐలను ఆదేశించారు. అధికారులు సైతం ప్రోటోకాల్‌ను పటిష్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు. ఆయన వెంట వైస్ చైర్మన్ చాంద్‌బాషా పలువురు కౌన్సిలర్లు ఆ పార్టీ నాయకులు సివి కుమార్, హేమంత్‌కుమార్ రెడ్డి మైనారిటీ నాయకులు రహీంఖాన్, కమాల్, ఖాజా, శ్యామ్, చెంగారెడ్డి, ప్రహ్లాద తదితరులు పాల్గొన్నారు. -
సదరం..‘పరీక్ష'
కర్నూలు(హాస్పిటల్): వికలత్వ ధ్రువీకరణ పత్రం పొందాలంటే చుక్కలు చూడాల్సిందే. డివిజన్ పరిధిలోని ప్రాంతాల నుంచి తరలివచ్చే వృద్ధులు.. వికలాంగులు.. మానసిక వికలాంగులు ఎంతో ఆశతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకుంటున్నా.. ఇక్కడ వారి ‘ఓపి’కను పరీక్షిస్తున్నారు. కనీస సదుపాయాలు లేకపోవడం.. అరొకర సిబ్బంది.. దళారుల కారణంగా ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఆసుపత్రిలోని 41వ నెంబర్ ఓపీని సదరం క్యాంపు నిర్వహణకు వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం వందలాదిగా తరలివచ్చిన వికలాంగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రత్యేక కౌంటర్లు లేకపోవడం.. గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఎండ తీవ్రత కారణంగా వారి అవస్థలు వర్ణనాతీతం. కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో లేక దాహంతో అలమటించారు. కంప్యూటర్ ఆపరేటర్ల కొరతతో వందల సంఖ్యలో తరలివచ్చే వారి నుంచి దరఖాస్తులను తీసుకోవడం.. కంప్యూటర్లో నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యాంపు వద్దే పడిగాపులు కాయాల్సి రావడంతో బాత్రూం, మరుగుదొడ్ల సమస్యతో అల్లాడిపోయారు. ఓపీ వద్ద దళారులను నమ్మి మోసపోవద్దనే పోస్టర్లు అతికించినా.. వీరి పాత్రే కీలకంగా ఉంటోంది. మీకు వికలత్వ శాతం తక్కువగా ఉంది.. పింఛన్‌కు అనర్హులవుతారు.. రూ.800 ఇస్తే వికలత్వ శాతం ఎక్కువ వచ్చేలా చూస్తామంటూ నమ్మబలుకుతున్నారు. మరికొందరు సంఘాల పేరిట 20 నుంచి 30 దరఖాస్తులతో కార్యాలయంలోకి వచ్చి తమపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరు కూడా లబ్ధిదారుల నుంచి దరఖాస్తుకు రూ.500 చొప్పున వసూలు చేస్తుండటం గమనార్హం. పింఛన్ పొందాలంటే సదరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కావడం.. ఇక్కడ చూస్తే పరిస్థితి గందరగోళంగా ఉండటం వికలాంగులను కలచివేస్తోంది. -
పింఛన్లు పీకేశారు
ఒంగోలు టౌన్ : వారంతా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు. నెలనెలా వచ్చే పింఛనే ఆధారం. అలాంటి పింఛన్‌ను సర్వే పేరుతో పీకేశారు. అప్పటివరకూ అందుకున్న పింఛన్లకు వారిని అనర్హులను చేశారు. జాబితాల్లో ఉన్న పేర్లను ఏకపక్షంగా తొలగించారు. తమకు జరిగిన అన్యాయం గురించి వారంతా మండల అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో ఏకంగా ధ్రువీకరణ పత్రాలు తీసుకుని స్థానిక ప్రకాశం భవనం ఆవరణలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. కలెక్టర్ విజయకుమార్‌ను కలిసి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఆ వివరాల ప్రకారం... చీమకుర్తి మండలం పీ నాయుడుపాలెం గ్రామంలో ఆ గ్రామ కమిటీ పింఛన్ల పరిశీలన కార్యక్రమం చేపట్టింది. అయితే ఆ గ్రామ సర్పంచ్, కార్యదర్శులు ఏకపక్షంగా వ్యవహరించి 75 మంది అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పేర్లను తొలగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికామన్న కారణంతోనే పింఛన్ల జాబితా నుంచి తమపేర్లు తొలగించారంటూ బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంతమంది పింఛన్లు తొలగించారా:కలెక్టర్ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెద్ద సంఖ్యలో కలెక్టర్‌ను కలిసి తమ పింఛన్లు తొలగించారని చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు. ఇంతమంది పింఛన్లు తొలగించారా అని అవాక్కయ్యారు. సర్వే నిర్వహించి తమ పేర్లను తొలగించారంటున్న బాధితుల్లో కొంతమంది 90 శాతం వరకూ అంగవైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్లు చూపించడంతో వారి పింఛన్ల తొలగింపునకు కారణాలు తెలియజేయాలని డీఆర్డీఏ పీడీ పద్మజను ఆదేశించారు. ప్రతిఒక్కరినీ విచారించి నివేదికలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. -
అయ్యా.. పింఛన్..!
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : మూడు నెలల నుంచి పింఛన్ రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అరిగోస పడుతున్నారు. పింఛన్ కోసం ఎండలో కాళ్లకు బొబ్బలు పెట్టంగా.. వందలాది రూపాయలు రవాణా చార్జీలు భరిస్తూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా అధికారులు కనికరించడం లేదు. మా కష్టం పగవాడికి కూడా రావొద్దని పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ విధానం.. గతంలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో మున్సిపల్ అధికారులు పింఛన్ డబ్బులు పంపిణీ చేసేవారు. నెల మొదటి వారంలోనే ఆయా కార్యాలయాల వద్ద వారి పేర్లకు అనుగుణంగా సంతకాలు, వేలి ముద్రలు తీసుకొని పింఛన్ ఇచ్చేవారు. ఆ తర్వాత డీఆర్డీఏ నుంచి సీఎంఎస్వోలు కొన్ని రోజులపాటు పంపిణీ చేశారు. మృతిచెందినవారు, ఊరు వదిలి వెళ్లిపోయినవారు, పలువురు అనర్హులు పింఛన్లు పొందుతున్నారని సర్కారు దృష్టికి రావడంతో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం యాక్సెస్ బ్యాంక్, ఫినో కంపెనీ ఆధ్వర్యంలో జిల్లాలోని 18 మండలాలు, పోస్టల్ ద్వారా 34 మండలాలు, ఏడు మున్సిపాలిటీల్లో ఐసీఐసీఐ బ్యాంక్, మణిపాల్ ఆధ్వర్యంలో బయోమెట్రి క్ విధానంలో పింఛన్ పంపిణీ విధానానికి తెర లేపారు. కష్టాలు మొదలు.. బయోమెట్రిక్ విధానంతో పింఛన్‌దారుల కష్టాలు మొదలయ్యాయి. ప్రధానంగా పలువురికి ఆధార్‌కార్డు లేకపోవడం, ఆధార్ కార్డు ఉన్నా అనుసంధానం కాకపోవడం, బయోమెట్రిక్ విధానంలో వృద్ధుల వేలి ముద్రులు నమోదు కాకపోవడం కారణంగా బ్యాంక్ ఖాతాలు తెరవలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే బ్యాంక్ కరస్పాండెంట్లు ప్రతినెల పింఛన్ వివరాలు ఎంపీడీవోకు అందజేయాలి. ఎంపీడీవోలు డీఆర్డీఏ కార్యాలయానికి సదరు వివరాలు పంపిస్తారు. ఈ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో పింఛన్లు అందుతున్నాయా లేదా అన్న వివరాలు కూడా తెలియలేదు. దీంతో నెలనెల పింఛన్ అందకపోవడంతో లబ్ధిదారులకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. వృద్ధుల వేళ్లు అరిగిపోవడం, బయోమెట్రిక్ విధానంలో వేలి ముద్రలు చూపించకపోవడంతో వారి పింఛన్‌ను ఇవ్వడం లేదు. గాడిలోపడని ఐరీస్ ఆధార్ ద్వారా సేకరించిన ఐరీష్ (కంటిపాపలు) విధానంలో నమోదు చేసుకొని పింఛన్ పంపిణీ చేస్తామని అధికారులు చెప్పినా ఆ ప్రక్రియ ఇంకా గాడిలో పడటం లేదు. పెలైట్ ప్రాజెక్టు కింద బోథ్, ఆదిలాబాద్, లక్ష్మణచాంద, నేరడిగొండ, కుంటాల, ఇచ్చోడ మండలాల్లోని పది గ్రామాల్లో ఐరీష్ విధానాన్ని చేపట్టారు. అక్కడ విజయవంతమైతే మిగతా మండలాల్లోనూ అమలు చేస్తామని అధికారులు అంటున్నారు. మరోపక్క బ్యాంక్ కరస్పాండెంట్లకు ఇచ్చిన మిషన్లు గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక పనిచేయకపోవడం, బ్యాటరీ బ్యాకప్ రాకపోవడం, కరస్పాండెంట్లకు ఈ ఆపరేటింగ్ విధానంపై అవగాహన లేకపోవడంతో సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని సుమారు సగం మంది పింఛన్‌దారులకు పింఛన్లు అందని పరిస్థితి నెలకొంది. ఇచ్చేది అరకొరే.. జిల్లాలో 2,62,004 మంది లబ్ధిదారులు వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. అందులో వృద్ధాప్య 1,35,750, చేనేత 537, వికలాంగులు 26,964, వితంతువులు 79,921, కల్లుగీత కార్మికులు 283, అభయహస్తం కింద 18,549 మంది ప్రతినెల పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా రూ.200, వికలాంగులు, అభయహస్తం పింఛన్‌దారులకు ప్రతి నెల రూ. 500 పింఛన్ కింద అందజేస్తారు. ఈ లెక్కన ప్రతినెల రూ.7.75 కోట్లు పింఛన్ల రూపంలో డీఆర్డీఏ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొదట చేపట్టిన 34 మండలాల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా 1,50,179 మందికి రూ.4.35 కోట్లు పింఛన్ నగదు అందజేస్తున్నారు. అయితే మొదట చేపట్టిన ఈ ప్రక్రియలోనూ ఇప్పటికీ పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ విధానం అమలుకు నోచుకోలేదు. 18 మండలాల్లో చేపట్టిన బయోమెట్రిక్ విధానంలో ఇంకా బాలారిష్టాలు దాటలేదు. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడ ం లేదు. నెలనెలా పింఛన్లు తీసుకోకపోతే మూడో నెల తర్వాత డబ్బులు వెనక్కి వెళ్లిపోతాయి. ఆ నెలకు సంబంధించిన పింఛన్ మాత్రమే వస్తుంది. పింఛన్‌దారులు తపాలా కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ యంత్రంలో వేలి ముద్ర వేసే పింఛన్ వస్తుంది. విధానం గాడిలో పడకపోవడంతో కష్టాలెప్పుడు దూరమవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. -
రుణాలివ్వకుండా రికార్డు!
విశాఖపట్నం, న్యూస్‌లైన్: 2013-14 ఆర్థిక సంవత్సరం ముగిసింది. కానీ బీసీ, ఎస్సీ, మైనార్టీ, వికలాంగులకు రుణాలు మాత్రం అందలేదు. ఈ ఆర్థిక సంవత్సరం కార్యాచరణ ప్రణాళిక ఆలస్యంగా ఖరారు కావడం లబ్ధిదారుల కొంపముంచింది. ఏటా కోట్లాది రూపాయల మేరకు రుణాలిచ్చే బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు, బ్యాంకులు ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆఖరి నెలయిన మార్చిలో రుణాలు మంజూరవుతాయనుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు తగిలింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీలను రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు పెంచారు. లబ్ధిదారుని వాటా రద్దు చేశారు. రుణాల కోసం ఎన్నికల కోడ్ ముగిసేవరకు నిరీక్షణ తప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బీసీ కార్పొరేషన్లో... రాజీవ్ అభ్యుదయ యోజన పథకం కింద జీవీఎంసీ, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల పరిధిలో 2445 యూనిట్లు లక్ష్యం. సబ్సిడీ కింద 6.71కోట్లు అందజేయాల్సి ఉంది. బ్యాంకులు రూ.6.71కోట్లు రుణాలుగా ఇవ్వాల్సి ఉంది ఇప్పటి వరకు ఆన్లైన్లో 1912 మంది దరఖాస్తుల వివరాలు నమోదు చేశారు. వీరిలో 1328 మందికి రుణాలు మంజూరయ్యాయి. ఎవరికీ సబ్సిడీలు, రుణాలివ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్లో.. ఈ ఏడాది 1503 యూనిట్లు లక్ష్యంగా ఉంది. రూ.13.80కోట్ల మేరకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 980 దరఖాస్తులొచ్చాయి. ఇందులో 705 మందికి అర్హత ఉన్నట్టు గుర్తించారు. జీవీఎంసీ పరిధిలో 498 యూనిట్ల ఏర్పాటు లక్ష్యంగా ఉంది. ఇప్పటివరకు ఆన్లైన్లో 89 దరఖాస్తులు రాగా, 61 మందికి రుణాలు మంజూరు చేశారు. ఎవరికీ సబ్సిడీలు, రుణాలందలేదు సెట్విస్లో 410 మందికి రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో రాజీవ్ యువశక్తి పథకం కింద 510 యూనిట్ల స్థాపన లక్ష్యం కాగా, రూ.6.10కోట్ల మేరకు రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యంగా ఉంది. 920 వరకు దరఖాస్తులు రాగా, 610 మందికి అర్హత ఉన్నట్టు తేల్చారు. వీరిలో 410 మంది లబ్ధిదారులకు రూ.30వేల వంతున సబ్సిడీలు విడుదల చేశారు. వీరికి బ్యాంక్ రుణాలు అందజేశారు. మరో 200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. వికలాంగుల సంక్షేమశాఖలో.. గత ఆర్థిక సంవత్సరంలో 50 యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం రూ.50లక్షలు కేటాయించింది. ఇప్పటివరకు 60 దరఖాస్తులొచ్చాయి. ఇందులో 30 దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. 16 మందికి మాత్రమే సబ్సిడీ అందింది. బ్యాంక్ రుణాలు ఇంకా ఇవ్వాల్సి ఉంది. -
విల‘పింఛన్’
సాక్షి, మంచిర్యాల : సర్కారు నిర్ణయాలతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అవస్థలు పడుతున్నారు. పూటకో విధానం అమలు చేయడంతో గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. గతంలో స్మార్ట్‌కార్డుల ద్వారా పంపిణీ చేస్తామని, అనంతరం ఆధార్, రేషన్ కార్డుల ఎన్రోల్మెంట్ అంటూ తిప్పుకున్నారు. ప్రస్తుతం పింఛన్ల పంపిణీలో అక్రమాలను నిరోధించడానికి బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానంతో చేతుల వేళ్లు లేనివారు.. వంకరగా ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారు. వీరికోసం ప్రస్తుతం మళ్లీ ఐరీష్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కవిధానం సక్రమంగా అమలు చేయకపోవడంతో పింఛన్‌కు వచ్చిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎండనకా.. వాననకా పింఛన్ కోసం బారులు తీరుతున్నారు.. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.. ఉదయం నుంచి సాయంత్రం అధికారుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయినా బాధలు తీరడం లేదు.. వీరి గోస ప్రభుత్వానికి తగలడం లేదు. అక్రమాల పర్వం జిల్లా వ్యాప్తంగా 2,75,639 మందికి ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. ఇందులో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఉన్నారు. 65 ఏళ్ల పైబడి వయస్సు ఉన్న వారితోపాటు అభయహస్తం కింద 60 ఏళ్ల వయస్సు ఉన్న వారికి వృద్ధాప్య పెన్షన్ కింద ప్రతినెలా రూ.200, 40 శాతం అంగవైకల్యం ఉన్న వారికి రూ.500, వితంతువులకు రూ.500 చొప్పున డీఆర్డీఏ అందిస్తోంది. ప్రభుత్వం పెన్షన్ రూపంలో అర్హులకు అందిస్తున్న ఆర్థికసహాయాన్ని చూసి కొందరు దళారులు, ఉద్యోగులు అనర్హులనూ జాబితాలో చేర్చి అక్రమంగా పింఛన్ పొందుతున్నారు. పలుచోట్ల అర్హులకు అందించాల్సిన పింఛన్ కాజేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం అనర్హులను గుర్తించడంతోపాటు వారి పెన్షన్లు రద్దు చేసేందుకు రెండు నెలల క్రితం బయోమెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టింది. పింఛన్‌దారులు ప్రతినెల వారి చేతి బొటన వేలిముద్ర ఆ పరికరంపై పెడితే యంత్రం వారి వేలిముద్ర స్కాన్ చేసుకుంటుంది. వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు వస్తాయి. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ వేలి ముద్రలు చెరిగిపోయి ప్రమాదాల్లో చేతులు పోయిన వారికి మాత్రం సమస్యలు మొదలయ్యాయి. వృద్ధులు పరికరంపై వేలిముద్ర పెడితే స్కాన్ కావడం లేదు. చేయిలేని వాళ్లు వేలిముద్రలు వంకర ఉన్న వాళ్లు తమ వేలి ముద్రలు స్కాన్ చేయించుకోలేని పరిస్థితి. దీంతో వీరికి పెన్షన్ నిలిచింది. ఇలాంటి వాళ్లు జిల్లా వ్యాప్తంగా 15 వేల మంది వరకు ఉంటారని అంచనా. తెరపైకి ‘ఐరీష్’ వేలిముద్రలు చెరిగిపోయిన వృద్ధులు, చేతివేళ్లు లేని వాళ్లకు రెండు నెలల నుంచి పింఛన్ అందక అవస్థ లు పడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ఐరీష్ విధానంలో ఇవ్వాలని ఆలోచిస్తోం ది. ఐరీష్ ద్వారా కంటి స్కాన్ చేసి పెన్షన్ ఇస్తారు. అధికారులు ఇప్పటికే జిల్లాలోని ఏదైన గ్రామంలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించా రు. ఓ విధంగా ఆలోచిస్తే ఈ ప్రక్రియ బాగానే ఉ న్నా ఐరీష్తోనూ వృద్ధులకు ఇబ్బందులు తప్పేట ట్లు లేవు. ఇప్పటికే ఆధార్ కార్డు దరఖాస్తు సమయంలో చాలామంది వృద్ధులకు కళ్లు స్కాన్ కాక ఇబ్బందులు తలెత్తాయి. కళ్లు కూడా స్కాన్ కాక పో తే ఎలా అని పలువురు వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. బయోమెట్రిక్ పద్ధతిలో చేతి బొటన వేలు స్కాన్ కాని వారి కోసం ఐరీష్ విధానం అమలు చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభించి.. అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామని చెప్పారు. -
పింఛన్ల కోసం లబ్ధిదారుల పాట్లు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ప్రతినెలా ఇచ్చే అరకొర పింఛన్ల కోసం వృద్ధులు, వితంతువులు, వికలాంగులు నానా అగచాట్లు పడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ఉద్యోగులతో సమానంగా ప్రతినెలా ఒకటి, రెండు తేదీల్లోనే తలుపు తట్టి మరీ పింఛన్లు అందించేవారు. ప్రస్తుతం పోస్టాఫీసులకు అప్పగించడం, వాటికి తోడు ఆధార్ అనుసంధానం, పీఓటీడీ (పాయింట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ డివైస్) పరికరాలు పెట్టి వేలిముద్రలు సరిచూస్తుండటంతో లబ్ధిదారుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. అన్ని గ్రామాల్లో పోస్టాఫీసులు లేకపోవడంతో పింఛన్ల కోసం 5 నుంచి పది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది. వృద్ధులు, వికలాంగులకు అది మరింత భారంగా మారుతోంది. జిల్లాలో మొత్తం 3,13,569 మంది పెన్షన్ అర్హులున్నారు. వీరిలో 33,269 మంది వికలాంగులు, 127 మంది కల్లుగీత కార్మికులు, 1,72,671 మంది వృద్ధులు, 6,722 మంది చేనేత కార్మికులు, 82,958 మంది వితంతువులు, 17,764 మంది అభయహస్తం పెన్షన్‌దారులున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సబ్పోస్టుమాస్టర్లు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని ఒంగోలు నగరం, కందుకూరు, చీరాల, మార్కాపురం పట్టణాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా మణిపాల్ బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ పెన్షన్లను పంపిణీ చేస్తోంది. వీరికి రూ 10,17,60,200లను ప్రతి నెలా చెల్లిస్తున్నారు. వీరిలో 65 వేల మందికి పైగా వృద్ధులకు, వితంతువులకు ఆధార్ కార్డులు లేవు. దీంతో జనవరి నుంచి వీరికి పెన్షన్లు అందవు. గతంలో ఐకేపీ డీపీఎం సంతకం చేస్తే ఆధార్ కార్డు లేకపోయినా పెన్షన్లు అందించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చీరాల నియోజకవర్గ పరిధిలో దేశాయిపేట పంచాయతీలో ఒకటో వార్డు పింఛన్‌దారులు పోస్టాఫీసుకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అదేవిధంగా పాతరెడ్డిపాలెం, ఊటుకూరు సుబ్బయ్యపాలెం, బొచ్చులవారిపాలెం, కొత్తపాలెం గ్రామాలకు చెందిన పింఛన్‌దారులు రామన్నపేట, వేటపాలెం పోస్టాఫీసులకు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో పెద్దదోర్నాల మండలంలో వృద్ధుల వేలిముద్రలను పీఓటీడీ యంత్రాలు అంగీకరించకపోవడంతో మండల ఏపీ ఆన్లైన్ కోఆర్డినేటర్ సమక్షంలో పింఛన్లు తీసుకోవాల్సి వస్తోంది. నెట్‌వర్క్‌లో సైతం తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. త్రిపురాంతకంలో విద్యుత్ కోత, సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో సర్వర్లు పనిచేయక పింఛన్ల కోసం లబ్ధిదారులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. దర్శి నియోజకవర్గంలో 22514 మంది పింఛన్‌దారులుండగా వారిలో 5622 మందికి ఆధార్ కార్డులు లేక రెండు నెలలుగా పింఛన్లు పొందలేకపోతున్నారు. ముండ్లమూరు మండలంలో వేములబండ, రమణారెడ్డిపాలెం, అయోధ్యనగర్, రాజగోపాలరెడ్డి నగర్, పలుకురాళ్ల తండా, నందమూరి నగర్, బసవాపురం, జగత్నగర్, శ్రీనివాసా నగర్, తమ్మలూరు, సుంకరవారిపాలెం గ్రామాల పింఛన్‌దారులు నాలుగు కిలోమీటర్లు కాలినడకన పోస్టాఫీసుకు వెళ్లి పింఛన్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. గిద్దలూరు పోస్టాఫీసులో పింఛన్లు తీసుకునేందుకు గురువారం వచ్చిన వృద్ధులు పలువురు జాబితాలో పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరు మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో రోజుకు నలుగురైదుగురికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేసి మిగిలిన వారికి తరువాత రండి అంటూ రోజుల తరబడి తిప్పుకుంటున్నారు. కొండపి నియోజకవర్గం టంగుటూరు పంచాయతీ పరిధిలోని 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రావివారిపాలెం, బాపూజీ కాలనీ, వెంకటాయపాలెం వారు టంగుటూరు పోస్టాఫీసుకు రావాల్సిందే. కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలంలో కొత్తగా 615 మంది దరఖాస్తు చేసుకున్నా..వారికి ఇంకా మంజూరు కాలేదు. పీఓటీడీ మిషన్లకు సిగ్నల్ అందక అవస్థలు పడుతున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని చినగంజాం మండలంలో కొందరికి ఆగస్టు నెల పింఛన్లు కూడా రాక ఇబ్బంది పడుతున్నారు. యద్దనపూడి మండలంలో పోస్టాఫీసుల వద్ద పీఓటీడీ మిషన్లకు సిగ్నల్స్ సరిగా అందక లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. కరెంటు కోతల కారణంగా చార్జింగ్ లేదనే సాకుతో లబ్ధిదారులను ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉండేలా చేస్తుండటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఒంగోలు నగరంలో పింఛన్ల కోసం వృద్ధులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వ స్తోంది. ప్రతినెలా 7వ తేదీలోపు పింఛన్లు అందించాల్సి ఉన్నా..15వ తేదీ వరకూ ఇస్తున్నారు. నగర పరిధిలో ఆధార్ కార్డులు లేక వెయ్యి మంది జనవరి నుంచి పింఛన్లు కోల్పోయారు. సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని చీమకుర్తిలో పింఛన్‌దారులు ఎక్కడ పింఛన్లిస్తారో స్పష్టత లేక పోస్టాఫీసులు, మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉన్న పనితోనే సతమతమవుతుంటే పింఛన్ల పంపిణీ పేరుతో తమపై అదనపు భారం మోపుతున్నారని గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇచ్చే జీతం తక్కువ..పనిభారం ఐదు రెట్లు పెంచి తమ శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.