నిండ్ర: వుండలంలో అర్హులైన పేదలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు తొలగిస్తే చర్యలు తప్పవని నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా అధికారుల ను హెచ్చరించారు. శుక్రవారం ఆమె మండలంలోని అత్తూరు గ్రావుంలో నిర్వహించిన జన్మభూమి-వూ ఊరు కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ప్రతి గ్రామంలో నిరుపేదలను గుర్తించి అర్హులైన వారికి పింఛన్లు వచ్చేలా చూడాలన్నారు. అలాకాకుండా అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులు పింఛన్ల జాబితా నుంచి అర్హుల పేర్లను తొలగిస్తే చూస్తూ ఊరుకునేదిలేదని ఆమె హెచ్చరించారు.
పేదలకు ఇప్పటికీ గుర్తున్న నాయకులు ఇద్దరేనని, వారు ఎన్టీఆర్, వైఎస్.రాజశేఖర రెడ్డి అని గుర్తుచేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కను నాటారు. వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జన్మభూమి ప్రత్యేకాధికారి రవికూవూర్, ఎంపీపీ వసంతవ్ము, జెడ్పీటీసీ వూలతి, ఎంపీడీవో సతీష్, సర్పంచ్ లోకేష్, ఎంపీటీసీ కవిత, తహశీల్దార్ బాబు, వైఎస్సార్ సీపీ నాయకులు చక్రపాణిరెడ్డి, వునోహర్‌నాయుడు, వుురళీనాయుుడు, శ్యామ్‌లాల్ పాల్గొన్నారు.
నగరిలో..
ప్రజల పక్షాన పోరాడుతామని ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. మేళపట్టు గ్రామంలో జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలు ఎంతవరకు అమలుచేసిందని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలకు లక్షవరకు అందిస్తే ఒక్కొక్క మహిళకు పదివేల రూపాయలు మాత్రమే లభిస్తుందన్నారు. ఇది కాస్త వడ్డీ కిందకు బ్యాంకులు జమచేసుకుంటే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలుగుతమ్ముళ్లు చెప్పినట్లుగా అధికారులు తలొగ్గి పనిచేయడం సిగ్గుచేటన్నారు.
సభలో రభస
ఎంపీడీవో సీతమ్మ గ్రామసభకు అధ్యక్షత వహించారు. ముందుగా సర్పంచ్ మధుసూదన్‌కు, ఆ తర్వాత వరుసగా టీడీపీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, కో-ఆప్షన్ మెంబర్లకు పలుమార్లు అడిగి మైకు అందించి మాట్లాడించారు. వారు చంద్రబాబు పాలన గురించి పదేపదే మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే రోజా తన ప్రసంగంలో ముఖ్యమంత్రి సందేశపత్రాన్ని చేతపట్టి వాటిలోని అంశాలకు వివరణ ఇస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఏవిధంగా లబ్ధిచేకూరాయన్న విషయాలను తెలియజేశారు.
దీని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు రోజా ప్రసంగాన్ని అడ్డుకొని గొడవకు దిగారు. సింగిల్ విండో అధ్యక్షుడు బాల సురేష్, ఎంపీటీసీ హరిబాబు వేదిక వద్ద వీరంగం సృష్టించారు. అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ప్రభుత్వం మాది అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ సవాళ్లకు దిగారు. సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు తక్కువమంది ఉండటంతో వారిని నిలువరించడం కష్టసాధ్యమైంది.
పలమనేరులో జన్మభూమి రచ్చరచ్చ
పలమనేరు: పలమనేరు పురపాలక సంఘంలో శుక్రవారం జరిగిన జన్మభూమి- మా ఊరు గ్రామసభలు రచ్చరచ్చగా మారాయి. పట్టణంలోని సీఎస్‌ఐ కాంపౌండ్‌లో నిర్వహించిన 8వ వార్డుసభలో వైఎస్‌ఆర్‌సీపీ చెందిన మున్సిపల్ వైస్‌చైర్మన్ చాంద్‌బాషాకు పూలమాల వేయకపోగా.. వేదికపై ఉన్న అధికారులను పక్కకు పొమ్మని తెలుగుతమ్ముళ్లు టీడీపీ ఇన్‌చార్జ్‌ని కుర్చోబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో ప్రోటోకాల్ వివాదం తెరమీదికొచ్చింది. ఇరుపార్టీల నాయకులు వాగ్వాదాలకు దిగారు. ఈ సంఘటనకు నిరసనగా వైస్ చైర్మన్ వార్డు సభను బహిష్కరించి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.
అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ నాయకులతో కలసి జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. పోలీసులు వీరి ధర్నాను అడ్డుకుని వివాదం పెద్దది కాకుండా చూశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమరనాథరెడ్డి కౌన్సిలర్లతో కలసి ప్రోటోకాల్ వివాదం, తెలుగు తమ్ముళ్ల హంగామాపై సీఐ బాలయ్య దృష్టికి తీసుకెళ్ళారు. అక్కడికి చేరుకున్న డిఎస్పీ హరినాథ రెడ్డి కమిషనర్ వెంకటేశ్వరరావ్‌ను స్టేషన్‌కు పిలిపించి ఈ సంఘటనపై పూర్తిగా విచారించారు. నేటి నుంచి జరిగే వార్డుసభల్లో వీడియో రికార్డింగ్ చేపట్టాలని కమిషనర్‌ను ఆదేశించారు. జన్మభూమి వద్ద గొడవలు సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్‌ఐలను ఆదేశించారు. అధికారులు సైతం ప్రోటోకాల్‌ను పటిష్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు. ఆయన వెంట వైస్ చైర్మన్ చాంద్‌బాషా పలువురు కౌన్సిలర్లు ఆ పార్టీ నాయకులు సివి కుమార్, హేమంత్‌కుమార్ రెడ్డి మైనారిటీ నాయకులు రహీంఖాన్, కమాల్, ఖాజా, శ్యామ్, చెంగారెడ్డి, ప్రహ్లాద తదితరులు పాల్గొన్నారు.