బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సభ సూచన
వాడీవేడీగా స్టాండింగ్ కమిటీల సమావేశాలు
హన్మకొండ : ఆసరా పింఛన్ల నుంచి ఇంటి పన్నుల వసూలు చేయడంపై ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరా కల్పించేందుకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తుంటే వచ్చిన దానిలో నుంచి పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నులు పేరిట కత్తిరించడం ఎంత వరకు సమంజసమని డీపీఓను నిలదీశారు. దీంతో సంబంధిత అధికారి మాట్లాడుతూ ఆసరా పింఛన్ల నుంచి ఇంటి పన్నులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని తెలిపారు. హన్మకొండలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం శనివారం జరిగింది. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన 1, 2,4, 7 స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. 3వ స్థాయి సంఘం సమావేశం ధర్మసాగర్ జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, 5వ స్థాయి సంఘం సమావేశం వీరమ్మ, 6వ స్థాయి సంఘం సమావేశం మాదాసు శైలజ అధ్యక్షతన జరిగాయి. క్వారీ నిర్వాహకులు భారీ ఎత్తున గ్రానైట్ రాళ్లు తరలిస్తుండడంతో రోడ్లు పాడవుతున్నాయని జెడ్పీటీసీ సభ్యులు వాపోయూరు. ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ తాను నెల్లికుదురు మండలం చిన్ననాగారం శివారు తండాను సందర్శించినపుడు గ్రానైట్ క్వారీతో ప్రజలు పడుతున్న బాధలు స్వయంగా చూశానన్నారు. క్వారీ యజమానిని పిలిచి తన వంతుగా భారీ వాహనాల రాకపోకలకు అనుగుణంగా రోడ్డు నిర్మించాలని సూచించానన్నారు.
మైనింగ్ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని, క్వారీలున్న గ్రామాలను మైనింగ్ చేస్తున్న ఏజెన్సీలు దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ఉపప్రణాళిక నిధుల నుంచి ఎస్సీ, ఎస్టీల బిల్లులు చెల్లించాల్సిన నిధులను ఇతర పనులకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు తరలించాయని. దీంతో బకాయిలు పేరుకుపోయాయన్నారు. తాగునీటికి ఇబ్బం ది ఎదురుకాకుండా విద్యుత్ సమస్యను అధిగమించేందుకు సోలార్ మోటార్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులు భరిస్తున్నట్లు తెలిపారు. మహబూబాబాద్ లోక్‌సభ నియోజవ ర్గానికి 179 సోలార్ పంప్‌సెట్‌లు మంజూరైనట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రా లు మంజూరైన చోట భవనాలు నిర్మించడం లేదని సభ్యులు అధికారులను ప్రశ్నించారు. దీంతో పంచాయతీ అధికారులు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు కేటాయించిన రూ.4.50 లక్షల నిధులతో భవనాలు పూర్తి కావన్నారు. ఏటూరునాగారం డిగ్రీ కాలేజీలోని విద్యార్థులకు మూడేళ్లుగా స్కాలర్‌షిప్‌లు రాకుండా ఇబ్బందులు పడుతున్నారని జెడ్పీటీసీ సభ్యు లు అధికారులను నిలదీశారు.
స్కాలర్‌షిప్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, వీటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన చెరువుల అభివృద్ధి పనులకు లెస్‌కు టెండర్ వేయడం ద్వారా పనుల నాణ్యతపై సందేహాలు కలుగుతున్నాయని ఎమ్మెల్యే అరూరి రమేశ్, జెడ్పీటీసీ సభ్యులు పేర్కొన్నారు. పనుల వివరాలు తమకు ఎందుకు ఇవ్వడం లేదని అధికారులను ప్రశ్నిం చారు. నివేదికలు జెడ్పీటీసీ సభ్యులకు అందించాలని సూచిం చారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, టీడీపీ ఫ్లోర్‌లీడర్ శివశంకర్, అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
పింఛన్లలో కోతపై జెడ్పీటీసీల ఆగ్రహం
Published Sun, Feb 22 2015 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement