
సాక్షి, అనంతపురం : తమ పింఛన్లు తొలగిస్తే పెట్రోల్ పోసి తగలబెడతామని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అనుచరులు మంగళవారం అధికారులను బెదిరించారు. జిల్లాలోని కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో అధికారులు అనర్హుల పింఛన్లను తొలగించారు. తొలగించిన వారిలో కొందరు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. విషయం తెలుసుకున్న శివమ్మ, నారాయణ, ఓబిలేసులు సచివాలయ కార్యాలయంలో వేటకొడవళ్లతో ప్రవేశించి హల్‌చల్ చేశారు. మా మాట వినకుంటే పెట్రోల్ పోసి తగలబెడతామని పంచాయితీ కార్యదర్శి మురళీకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు.