
నాలో నాతో వైఎస్సార్ పుస్తకం చదువుతున్న బోథ్ ఎంపీపీ
ఇచ్చోడ(బోథ్): విజయమ్మ రాసిన ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకం గొప్ప అనుభూతినిచ్చింది. పుస్తకం చదువుతున్నంత సేపు రాజశేఖర్‌రెడ్డితో మాట్లాడిన మాటలు, ఆయనతో గడిపిన క్షణాలు కళ్లముందు కదలాడినట్లు అనిపించింది. పుసక్తం చేతిలో పట్టుకుంటే చాలు వైఎస్సార్‌తో పెనవేసుకున్న మధుర జ్ఞాపకాలు కళ్లలో మెదలుతున్నాయని వైఎస్సార్ అభిమాని, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. ‘నాలో నాతో వైఎస్సార్’ పుస్తకం చదివిన ఆయన వైఎస్సార్‌తో తనకున్న అనుభవాలను మంగళవారం ‘సాక్షి’తో పంచుకున్నారు.
వైఎస్సార్ ఓ శక్తి..
వైఎస్సార్‌తో 1994లో పరిచయం ఏర్పడింది. ఆయన చనిపోయే వారం ముందు ఆయనతో మాట్లాడిన మాటలు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. రాజశేఖర్‌రెడ్డితో నాకు ఎంతో సానిహిత్యం ఉండేది. ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కార మార్గం చూపేవారు. ఆయన వ్యక్తి కాదు ఓ శక్తి.
మిస్టర్ శ్రీనివాస్ అనే వారు..
ఎన్నిసార్లు కలిసినా చెరగని చిరునవ్వుతో మిస్టర్ శ్రీనివాస్ అంటూ ప్రేమగా పొట్టపై చిన్నగా కొట్టేవారు. జిల్లా సమస్యలు విని వాటికి వెంటనే పరిష్కార మార్గం చూపేవారు. ఆదిలాబాద్ జిల్లా అంటే ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఆయన స్ఫూర్తితోనే నేను ఈరోజు ఉన్నంతలో కొంత పేదల కోసం ఖర్చు చేస్తూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను.
మరిచిపోలేని అనుబంధం
2001లో పాదయాత్రలో పాల్గొన్నాను. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది, వైఎస్సార్ సీఎం అయ్యాక ఆయనతో అనుబంధం మరింత పెరిగింది. 2007లో జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సోనాలలో మా ఇంటికి కూడా వచ్చారు. ఆయన వైద్య వృత్తిలో చేసిన సేవల మాదిరిగానే నా కుమారిడితో ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment