విద్యార్థులు లక్ష్యంతో ముందుకుసాగాలి : ఎంపీ సోయం బాపూరావ్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు లక్ష్యంతో ముందుకుసాగాలి : ఎంపీ సోయం బాపూరావ్‌

Published Mon, Jan 1 2024 2:16 AM | Last Updated on Mon, Jan 1 2024 2:04 PM

ఎంపీ సోయంకు స్వాగతం పలుకుతున్న విద్యార్థులు - Sakshi

ఎంపీ సోయంకు స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

ఆదిలాబాద్‌: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకుసాగితే విజయం సాధిస్తారని ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావ్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలను ఆదివారం ఆయన సందర్శించారు. పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థులు తోడసం వెంకటలక్ష్మి, నరసింహస్వామిలు ఆగాఖాన్‌ అకాడమీ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో సీటు వచ్చిందుకు శాలువా కప్పి సత్కరించారు.

అనంతరం పాఠశాలలో సమస్యలపై ప్రిన్సిపాల్‌ కాంబ్లే అనిల్‌, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల భవనం పూర్తయినా అనుమతి ఇవ్వలేదని నిర్వాహకులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ విజయ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇవి చ‌ద‌వండి: కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్‌ జెండర్‌ తొలిసారిగా శబరిమల..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement