వడగామ్‌లో మొక్కలు నాటుతున్న ఎంపీ బాపురావు
సాక్షి, ఇంద్రవెల్లి(ఖానాపూర్): ఆదివాసీ గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి అభివృద్ధికి కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదివారం మండలంలోని వడగామ్ గ్రామం రాయిసెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడవి పండుగలో చెట్లు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా వడగామ్ అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజనులు సంప్రదాయ వాయిద్యాల మధ్య బాపురావుకు స్వాగతం పలికారు. వడగామ్ రాయిసెంటర్ పరిధిలోని గ్రామల పటేల్‌ల ఆధ్వర్యంలో శాలువలతో సన్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు చేయడానికి ఇప్పటికే రూ.500 కోట్లతో నివేదిక పంపించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు ఆదివాసీ గ్రామాల్లో కనీస అభివృద్ధి జరగలేదని, సంక్షేమం పేరుతో రాష్ట్ర పాలకులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరానికి డిసెంబర్ 9న చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఢిల్లీలో భారీ సభ ఏర్పాటు చేసి ఆదివాసీల న్యాయమైన డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభ, ఆదివాసీ పెద్ద సిడాం భీంరావ్, పెసా చట్టం జిల్లా కోఆర్డినేటర్ వెడ్మా బోజ్జు, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు, మండల అధ్యక్షుడు మెస్రం నాగ్‌నాథ్, సర్పంచ్‌లు ఆత్రం రత్తుబాయి, కినక జుగాదిరావ్, ఎంపీటీసీ గేడం మదుకర్, బిజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దిపక్‌సింగ్‌షేకవత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment