‘పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అట్రాసిటీ కేసు పెడతా’ | BJP MP Soyam Bapurao Makes Sensational Comments on Lambadis and Jogu Ramanna | Sakshi
Sakshi News home page

పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అట్రాసిటీ కేసు పెడతా : బీజేపీ ఎంపీ

Published Tue, Oct 29 2019 1:32 PM | Last Updated on Tue, Oct 29 2019 1:42 PM

BJP MP Soyam Bapurao Makes Sensational Comments on Lambadis and Jogu Ramanna - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అట్రాసిటీ కేసు పెడతానని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా జరిగిన మీడియా సమావేశంలో సోయం మాట్లాడుతూ.. యురేనియం ప్రాజెక్టు పాపం అటవీశాఖ మాజీ మంత్రి జోగురామన్నదేనని ఆయన జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. నక్సలైట్‌ ప్రాంతాల నిధులతో టీఆర్‌ఎస్‌ నేతల పొలాలకు రోడ్లు వేసుకున్నారని ఆరోపించారు. పదివేలు ఇస్తే ఆదివాసీలు అమ్ముడుపోరని, తెలంగాణ రాష్ట్రాన్ని దళారుల చేతుల్లో పెట్టిన కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు ఆదివాసీల పోరాటం ఆపేది లేదని శపథం చేశారు. పదివేలు ఇచ్చుడు కాదు.. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నేను ఒక్క పిలుపునిస్తే ఎస్పీ ఆఫీస్‌, కలెక్టర్‌ ఆఫీస్‌ ఉండదంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement