అయోధ్యలో బాలికపై గ్యాంగ్‌రేప్‌..నిందితుడి దుకాణాల కూల్చివేత | Officials raze illegal complex of Ayodhya rape accused | Sakshi
Sakshi News home page

అయోధ్యలో బాలికపై గ్యాంగ్‌రేప్‌..నిందితుడి దుకాణాల కూల్చివేత

Published Fri, Aug 23 2024 4:56 AM | Last Updated on Fri, Aug 23 2024 4:56 AM

Officials raze illegal complex of Ayodhya rape accused

అయోధ్య: అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడి నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొయీద్‌ ఖాన్‌ అనే వ్యక్తి దుకాణ సముదాయాన్ని జిల్లా అధికా రులు గురువారం కూల్చి వేశారు. పురాకలంధర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని భదర్సానగర్‌లో మొయీద్‌ ఖాన్‌ బేకరీ నడుపుతున్నాడు. మొయీద్‌తోపాటు అతడి పనిమనిషి రాజు ఖాన్‌ ఓ బాలికపై రెండునెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దురాగతాన్ని వారు వీడియో తీశారు.

బాలిక గర్భం దాల్చినట్లు తేలడంతో జూలై 30న పోలీసులు మొయీద్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు. ఆగస్ట్‌ 3న అతడు నడిపే బేకరీని నేలమట్టం చేశారు. చెరువు స్థలం కబ్జా చేసి దానిని నిర్మించినట్లు అధికారులు అంటున్నారు. తాజాగా, గురువారం మొయీద్‌ ఖాన్‌కు చెందిన దుకాణ సముదాయాన్ని కూల్చి వేశారు. దానిని ప్రభుత్వ స్థలంలో నిర్మించాడన్నారు. ఆ సమయంలో భవనం ఖాళీగానే ఉందని చెప్పారు. కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. మొయీద్‌ ఖాన్‌ సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు, ఫైజాబాద్‌ ఎంపీ అవధేశ్‌ ప్రసాద్‌ అనుచరుడని బీజేపీ నేతలతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement